నాగచైతన్య హీరోగా నటించిన ‘థ్యాంక్యూ’ మూవీ నేడు థియేటర్లలో విడుదలైంది. రాశిఖన్నా హీరోయిన్‌గా నటించింది. అవికా గోర్, మాళవికా నాయర్ కీలక పాత్రల్లో కనిపించారు. బీవీఎస్ రవి కథను అందించారు. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించాడు. తమన్ మ్యూజిక్ అందించాడు. దిల్‌రాజు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాడు. కరోనా కారణంగా చాలాకాలంగా వాయిదాపడుతూ వస్తున్న ఈ సినిమా మొత్తానికి నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మూవీ ఎలా ఉంది స్టోరీ ఎంటీ తెలుసుకుందాం
కథేంటంటే..
అభిరామ్(నాగచైతన్య) జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొని అమెరికా వెళ్లి ఒక యాప్ తయారు చేసి సక్సెస్‌ఫుల్ బిజినెస్‌మ్యాన్‌గా ఎదుగుతాడు. అయితే ఆయన విజయం సాధించడంలో తోడ్పాటు అందించిన వ్యక్తులను మరిచిపోతాడు. అందులో ప్రియ(రాశిఖన్నా) కూడా ఒకరు. ఒక సమయంలో ఆ విషయాన్ని అర్థం చేసుక్నా అభిరామ్ తన సక్సెస్‌ఫుల్ జర్నీలో భాగమైన పాత స్నేహితులందరినీ కలిసి కృతజ్ఞతను తెలియజేయాలనుకుంటాడు. ఆ ప్రయాణంలో అభిరామ్‌కు ఎదురయ్యే అనుభవాలే థ్యాంక్యూ స్టోరీ.
విశ్లేషణ:
విక్రమ్ కె.కుమార్ గత సినిమాలు ఇష్క్, మనం, 24 సినిమాల్లో ఉన్నంత కొత్తదనం మాత్రం ఈ సినిమాలో లేదనే చెప్పుకోవాలి. ఇది చూస్తుంటే ప్రేమమ్, మజిలీ, నా ఆటోగ్రాఫ్ వంటి సినిమాలు గుర్తొస్తుంటాయి. అయితే కథ బీవీఎస్ రవిది కావడంతో స్క్రీన్‌ప్లే అవసరమైనంత కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు విక్రమ్. నాగచైతన్య మూడు పాత్రల్లో.. పదహారేళ్ల కుర్రాడిలా, 21 ఏళ్ల యువకుడిలా, 36 ఏళ్ల వ్యక్తిగా కనబడిన విధానం చాలా బాగుంది. మొట్టమొదటిసారిగా నాగచైతన్య ఇలాంటి యాటిట్యూడ్ ఉన్న పాత్రలో నటించాడు. మధ్యమధ్యలో మహేశ్‌బాబు సినిమాల గురించి ప్రస్తావన వస్తుంది. మహేశ్ ఫ్యాన్‌గా నాగచైతన్య నటించడం సూపర్‌స్టార్ ఫ్యాన్స్‌కు నచ్చుతుంది. మనందరం జీవితాల్లో వేగంగా పరిగెడుతూ గ్రాట్యిట్యూడ్‌ను చూపించడం మరిచిపోతున్నాం. అది తెలియజేయాలనే సందేశం బాగుంది. రాశిఖన్నా ఇటీవల రిలీజైన పక్కా కమర్షియల్‌లో టోటల్ కామెడీ పాత్రలో నటించగా..థ్యాంక్యూలో అందుకు విరుద్ధంగా ఎమోషనల్ క్యారెక్టర్‌లో కనిపించింది. ఆమె పాత్రమేరకు చక్కగా నటించింది. కానీ ఎప్పుడు ఆమె బాధపడుతుండటమే తెరపై ఎక్కువగా కనిపిస్తుంది. మొదటి భాగం అభిరామ్, అతడి యాటిట్యూడ్ గురించి చూపించారు. రెండోభాగంలో స్నేహితులను కలుసుకోవడం, ఎమోషన్ సీన్లతో సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది.
ఎవరెలా చేశారంటే..
నాగచైతన్య చిన్నప్పటి పాత్రలు ఇంతకుముందు చూసినట్లు అనిపించినప్పటికీ అభిరామ్ పాత్ర చాలా కొత్తగా ఉంది. అభిరామ్‌గా నాగచైతన్య తన పాత్రలో ఒదిగిపోయాడు. రాశిఖన్నా, అవికా గోర్, మాలవికా నాయర్ మెప్పించారు. ప్రకాశ్‌రాజ్, సుశాంత్ పాత్రలు సినిమాపై ప్రభావం చూపుతాయి. ఇక ఇతరులవి పెద్ద గుర్తుండిపోయే క్యారెక్టర్ కాదనే చెప్పుకోవాలి.
సాంకేతిక విషయాలు:
థ్యాంక్యూ కథలో ఉన్న ఎమోషన్‌ను తెరపై చూపించడంలో దర్శకుడు విక్రమ్ కె.కుమార్ ప్రతిభ కనబరిచాడు. బీవీఎస్ రవి కథ కొంత పాత సినిమాలను గుర్తుచేసినప్పటికీ అక్కడక్కడా కొన్ని సీన్లు మనసుకు హత్తుకుంటాయి. తమన్ మ్యూజిక్ ఇంకాస్త మెరుగ్గా ఉండాల్సింది. పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రఫీ బాగుంది. నిడివి రెండు గంటలే ఉండటంతో పెద్దగా సాగదీసినట్లుగా అనిపించదు. ఈ విషయంలో ఎడిటర్ నవీన్ నూలి సక్సెస్ అయ్యాడు.
బలాలు:
నాగచైతన్య
సినిమా నిడివి
సందేశం
బలహీనతలు:
తెలిసిన స్టోరీ
మ్యూజిక్
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి