తమిళ స్టార్ హీరో విజయ్ (Vijay) నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). వెంకట్ ప్రభు దర్శకుడు. మీనాక్షి చౌదరి కథానాయిక. స్నేహ, లైలా, ప్రశాంత్, ప్రభుదేవా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం ‘డీ-ఏజింగ్ టెక్నాలజీ’తో రూపొందింది. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైన తరువాత చేసిన చివరి సినిమా అని ప్రచారం జరగడంతో ఈ సినిమా మీద అంచనాలు ఎక్కువగానే ఏర్పడ్డాయి. అయితే గురువారం (సెప్టెంబర్ 5)న వరల్డ్‌వైడ్‌గా ఈ సినిమా రిలీజైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. తమిళనాడులో మాత్రం విజయ్ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకర్షించి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలో ఈ మూవీ తొలి రోజే రూ.120 కోట్లకు పైగా కొల్లగొట్టింది. మరీ వీకెండ్‌కు వచ్చేసరికి ఈ మూవీ వసూళ్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
వీకెండ్ కలెక్షన్స్ ఎంతంటే?
విజయ్ హీరోగా నటించిన ‘ది గోట్’ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్) అంచనాలకు తగ్గట్లే బాక్సాఫీస్ వద్ద రాణిస్తోంది. తొలి నాలుగు రోజుల్లో ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ.282.5 కోట్లు (GROSS) కొల్లగొట్టింది. కొద్దిలో రూ.300 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాన్ని చేజార్చుకుంది. అయితే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన తమిళ చిత్రంగా ‘ది గోట్’ రికార్డు సృష్టించింది. ధనుష్ రీసెంట్ చిత్రం ‘రాయన్’ రూ.154 కోట్ల (GROSS) లైఫ్‌టైమ్ వసూళ్లను తొలి రెండ్రోజుల్లోనే క్రాస్ చేసి ఈ ఫీట్ సాధించింది. ఒక్క తమిళనాడులోనే ‘ది గోట్’ రూ.106.40 కోట్లు వసూలు చేయడం విశేషం. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.10.10 కోట్లు, కర్ణాటకలో రూ.21.1 కోట్లు, కేరళ రూ.10.4 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.13.9 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్‌లో రూ.120.15 కోట్ల మేర విజయ్ చిత్రం రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం రూ.300 కోట్ల క్లబ్ దిశగా దూసుకుపోతోంది.
‘ది గోట్’ ఎలా ఉందంటే?
దర్శకుడు వెంకట్ ప్రభు రాసుకున్న కథలో కొత్తదనం కనిపించదు. రక్షణ విభాగాల్లో హీరో పనిచేయడం, హీరో కొడుకుని విలన్ పెంచి తిరిగి అతడి మీదే ప్రయోగించే సినిమాలు ఇప్పటికే చాలా వచ్చాయి. అయితే హీరో కొడుకు రివేంజ్ తీర్చుకునే క్రమంలో రాసుకున్న సీన్స్ ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో క్యారెక్టర్ ఇంట్రడక్షన్‌తో పాటు ఇతర క్యారెక్టర్ల పరిచయాలకే సరిపోతుంది. ప్రీ ఇంటర్వెల్ వరకూ కథ అంతా ఊహించే విధంగానే సాగింది. ఇంటర్వెల్ సీన్‌తో సెకండాఫ్‌పై ఆసక్తి పెంచారు డైరెక్టర్. అయితే సెకండాఫ్‌లోనూ చాలా వరకూ ఊహకు తగ్గట్లే కథను నడిపారు. అయితే క్లైమాక్స్‌ను ఆసక్తికరంగా తెరకెక్కించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. సెకండాఫ్‌లో వచ్చే ట్విస్టులు కూడా ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తాయి. కామెడీ, డైలాగ్స్‌లలో తమిళ వాసనలు నిండిపోవడం వల్ల తెలుగు ఆడియన్స్‌కు అంతగా రుచించకపోవచ్చు. అయితే విజయ్ ఫ్యాన్స్‌ను మాత్రం ఈ చిత్రం ఓ రేంజ్‌లో అలరిస్తుందని చెప్పవచ్చు.
కథేంటి
గాంధీ (విజయ్) స్పెషల్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటాడు. తన టీమ్‌మేట్స్ సునీల్ ( ప్రశాంత్), అజయ్ (అజ్మల్), కళ్యాణ్ సుందరం (ప్రభుదేవా)తో కలిసి పలు విజయవంతమైమ మిషన్స్ నిర్వహిస్తాడు. అయితే తను చేసే పని గురించి భార్య అను (స్నేహా)కు చెప్పడు. మిషన్‌లో భాగంగా విదేశాలకు వెళ్లిన క్రమంలో అతడి ఐదేళ్ల కొడుకు మరణిస్తాడు. తన కుమారుడి మరణానికి భర్తే కారణమని భావించి గాంధీని దూరంగా పెడుతుంది. ఆ బాధతో గాంధీ ఫోర్స్‌కు దూరమవుతాడు. కొన్నేళ్ల తర్వాత ఓ పనిమీద మాస్కోకి వెళ్తాడు. అక్కడ చనిపోయాడు అనుకుంటున్న తన కుమారుడు జీవన్ (విజయ్)ను చూస్తాడు. ఎంతో సంతోషించి భారత్‌కు తీసుకొస్తాడు. అప్పటినుంచి గాంధీ సన్నిహితులు ఒక్కొక్కరిగా చనిపోతుంటారు. ఆ మరణాలకు కారకులు ఎవరు? చనిపోయిన జీవన్ ఎలా తిరిగొచ్చాడు? తన వాళ్ల మరణాలను గాంధీ ఎలా ఆపాడు? అన్నది తెలియాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే.
Entertainment(Telugu) Featured Articles Reviews
Maa Nanna Superhero Review: భావోద్వేగాలతో నిండిన మంచి ఎమోషనల్ జర్నీ.. సుధీర్ బాబు హిట్ కొట్టినట్లేనా?