అంబులెన్స్‌కి దారి ఇవ్వడానికి ప్రధానమంత్రి కాన్వాయ్‌ని పోలీసులు ఆపేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కంగ్రా నియోజకవర్గంలో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా బుధవారం తన కాన్వాయ్‌ని నిలిపి అంబులెన్సు కోసమని దారిచ్చారు. అంబులెన్సు వెళ్లిపోగానే ప్రజలకు ప్రధాని కారులో నుంచే అభివాదం చేస్తూ అక్కడి నుంచి బయలుదేరారు. ఈ [వీడియో](url) సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. గతంలోనూ ప్రధాని ఇలా అంబులెన్సుకి దారిచ్చారు.
అంబులెన్సుకి దారిచ్చిన ప్రధాని

© ANI Photo(file)