ఆగ‌స్ట్ 5న థియేట‌ర్/ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాలు

ఆగ‌స్ట్ నెల‌లో చాలా తెలుగు సినిమాలు విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి. చాలాకాలంగా వాయిదా ప‌డుతూ వ‌స్తున్న సినిమాల‌న్ని ఈ నెల‌లోనే రిలీజ్ కాబోతున్నాయి. ఆగ‌స్ట్ 5న సీతా రామం, బింబిసార బాక్సాఫీస్ వ‌ద్ద పోటీప‌డ‌బోతున్నాయి. మ‌రి ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలేంటో చూద్దాం.

బింబిసార: ఆగ‌స్ట్ 5

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ న‌టించి ‘బింబిసార’ చిత్రం ట్రైల‌ర్, పాట‌ల‌తో అంచ‌నాల‌ను పెంచింది. ఈ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. గురువారం రాత్రి నుంచే ప్ర‌పంచ‌వ్యాప్తంగా బింబిసార ప్రీమియ‌ర్స్ ప్రారంభంకానున్నాయి. ఈ సినిమాతో క‌ళ్యాణ్‌రామ్ కెరీర్ బింబిసార ముందు, త‌ర్వాత‌లా ఉంటుంద‌ని ఎన్‌టీఆర్ చెప్ప‌డం కూడా ఆస‌క్తిని రేకెత్తించింది.

సీతా రామం: ఆగ‌స్ట్ 5

దుల్క‌ర్ స‌ల్మాన్, మృణాల్ ఠాకూర్ జంట‌గా న‌టించిన ‘సీతా రామం’పై ప్రేక్ష‌కుల‌కు భారీ అంచ‌నాలు ఉన్నాయి. క్లాసిక‌ల్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కిన ఈ చిత్రం ట్రైల‌ర్, పాట‌లు ప్రేక్ష‌కుల‌ను మెప్పించాయి. ర‌ష్మిక మంద‌న కీల‌క పాత్ర‌లో న‌టించింది. హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వ వ‌హించాడు. 

పంచ‌తంత్రం: ఆగ‌స్ట్ 5

‘పంచ‌తంత్రం’ సినిమాలో బ్ర‌హ్మానందం కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. క‌ల‌ర్స్ స్వాతి ఈ మూవీతో మ‌ళ్లీ రీ-ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. స‌ముద్ర‌ఖ‌ని, శివాత్మిక‌, తదిత‌రులు న‌టిస్తున్నారు. ఐదు క‌థ‌ల స‌మాహారంగా వ‌స్తున్న ఈ సినిమా కూడా ఆగ‌స్ట్ 5న రిలీజ్ అవుతుంది.

ఈ వారం ఓటీటీ రిలీజ్‌లు

టైటిల్‌కేట‌గిరిభాష‌ఓటీటీవిడుద‌ల తేది
లైట్ ఇయ‌ర్మూవీపాన్-ఇండియా
డిస్నీ+హాట్‌స్టార్
ఆగ‌స్ట్ 3
క‌డువామూవీ
పాన్-ఇండియాప్రైమ్ వీడియో
ఆగ‌స్ట్ 4
ఆవాస వ్యూహంమూవీ
మ‌ల‌యాళం
సోనీలివ్
ఆగ‌స్ట్ 4
వెడ్డింగ్ సీజ‌న్మూవీ
ఇంగ్లీష్
నెట్‌ఫ్లిక్స్‌
ఆగ‌స్ట్ 4
ది గ్రేట్ వెడ్డింగ్స్ ఆఫ్ మున్నెస్సిరీస్‌
హిందీ
వూట్ సెల‌క్ట్‌
ఆగ‌స్ట్ 4
ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్మూవీ
తెలుగు
ఆహా, నెట్‌ఫ్లిక్స్‌
ఆగ‌స్ట్ 5
డార్లింగ్స్‌మూవీ
హిందీ
నెట్‌ఫ్లిక్స్‌
ఆగ‌స్ట్ 5
మ‌హామూవీ
తమిళ్‌
ఆహా త‌మిళ్‌ఆగ‌స్ట్ 5
కార్ట‌ర్మూవీ
కొరియా
నెట్‌ఫ్లిక్స్‌
ఆగ‌స్ట్ 5
విక్టిమ్ వూ ఈజ్ నెక్ట్స్‌సిరీస్‌
తమిళ్‌
సోనీలివ్
ఆగ‌స్ట్ 5
వెండెట్ట‌మూవీ
ఇంగ్లీష్
ల‌య‌న్‌గేట్స్ ప్లేఆగ‌స్ట్ 5
థ‌ర్టీన్ లైఫ్స్‌మూవీ
ఇంగ్లీష్
ప్రైమ్ వీడియో
ఆగ‌స్ట్ 5
ది శ్యాండ్‌మ్యాన్సిరీస్‌
ఇంగ్లీష్
నెట్‌ఫ్లిక్స్‌
ఆగ‌స్ట్ 5
క్రాష్‌కోర్స్‌సిరీస్‌
హిందీ
ప్రైమ్ వీడియో
ఆగ‌స్ట్ 5
ఆడ్ క‌పుల్మూవీ
హిందీ
Shemaroo MEఆగ‌స్ట్ 5
Exit mobile version