టాలీవుడ్ టాప్ హీరోల రెమ్యూనరేషన్స్ ఇవే?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • టాలీవుడ్ టాప్ హీరోల రెమ్యూనరేషన్స్ ఇవే?

    టాలీవుడ్ టాప్ హీరోల రెమ్యూనరేషన్స్ ఇవే?

    March 29, 2023

    Courtesy Twitter: Prabhas RULES

    ఒకప్పుడు జాతీయ సినీ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో మన హీరోల ఫొటోలు, టాలీవుడ్‌ సినిమా పోస్టర్లు కనిపించేవి కావు. అయితే అదంతా గతం. ఇప్పుడు టాలీవుడ్ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రాలతో మన ఇండస్ట్రీ ఖ్యాతి దేశ సరిహద్దులు దాటిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్‌ నుంచి వస్తున్న అగ్ర హీరోల సినిమాలన్నీ దాదాపు పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్నవే. దీంతో దానికి తగ్గట్లే మన హీరోల రెమ్యూనరేషన్లు సైతం ఆకాశన్నంటాయి. ఒకప్పుడు రూ. 10 నుంచి రూ. 15 కోట్ల పారితోషికం తీసుకునే స్థితి నుంచి మన అగ్ర హీరోలు రూ. 50 కోట్ల నుంచి రూ. 100 కోట్లకు పైగా తీసుకునే రేంజ్‌కు వెళ్లిపోయారు. ప్రస్తుతం ఏ హీరో రెమ్యూనరేషన్‌ ఎంత ఉందో చూద్దాం.

    ప్రభాస్‌:

    హీరో ప్రభాస్‌ కెరీర్‌ బాహుబలి చిత్రం తర్వాత పూర్తిగా మారిపోయింది. బాహుబలి ముందు వరకు టాలీవుడ్‌కే పరిమితమైన ప్రభాస్‌ క్రేజ్‌ఆ సినిమాతో విశ్వవ్యాప్తమైంది. దీంతో రెండేళ్ల నుంచి ఒక్కో సినిమాకు రూ. 100 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్న ప్రభాస్… సిద్ధార్థ్ సినిమాతో పాటు భవిష్యత్తులో సైన్ చేయబోయే సినిమాల కోసం రెమ్యునరేషన్‌ను మరింత పెంచాడని టాక్ వినిపిస్తోంది. ప్రభాస్ తన 25వ చిత్రం స్పిరిట్‌ కోసం ఏకంగా రూ. 150 కోట్లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

    మహేశ్‌:

    మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో ‘SSMB28’ నటిస్తున్న మహేశ్.. దాని తర్వాత దర్శకధీరుడు S.S. రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌ సినిమాలో చేయనున్నారు. రాజమౌళితో సినిమా అంటే ఓ రేంజ్‌లో ఉంటాయని ఆయన గత చిత్రాలు ఆర్‌ఆర్‌ఆర్‌, బాహుబలి ఇప్పటికే నిరూపించాయి. పాన్‌ వరల్డ్‌గా రూపొందనున్న ఈ మూవీకి మహేశ్‌ ఏకంగా రూ. 100కోట్లు తీసుకుంటున్నారని టాక్. గత చిత్రం ‘సర్కారు వారి పాట’కు రూ.55 కోట్లు తీసుకున్న మహేశ్‌ నెక్స్ట్‌ మూవీకి ఏకంగా వంద కోట్లు తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. 

    పవన్‌ కళ్యాణ్‌:

    టాలీవుడ్ అగ్రకథానాయకుల్లో పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారు. ఓ వైపు రాజకీయాల్లో బిజీబిజీగా గడుపుతూనే సినిమాలను సైతం అంతే స్పీడుగా పట్టాలెక్కిస్తున్నారు.

    పవన్‌ ఒక్కో సినిమాకు రూ. 50 కోట్ల వరకూ తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే హరిహర వీరమల్లు కోసం పవన్‌ రూ. 60 కోట్లు ఛార్జ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. తన ఒక్కో రోజు షూటింగ్ కోసం రూ. 2 కోట్లు తీసుకున్నట్టు పవన్‌ స్వయంగా వెల్లడించారు. 

    రామ్‌ చరణ్‌:

    ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంతో రామ్‌చరణ్‌ బ్రాండ్‌ పూర్తిగా మారిపోయింది. మగధీర, రంగస్థలంతో చరణ్‌కు వచ్చిన క్రేజ్‌ను RRR రెండింతలు చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. పాన్‌ ఇండియా స్టార్‌గా మారిన చరణ్‌ ప్రస్తుతం శంకర్‌ డైరెక్షన్‌ గేమ్ ఛేంజర్‌ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు చెర్రీ దాదాపు రూ. 60 కోట్లు తీసుకుంటున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు సినిమాకు రూ. 45 కోట్లు తీసుకున్న చెర్రీ శంకర్‌ మూవీ కోసం ఏకంగా రూ. 15 కోట్లు పెంచడం గమనార్హం. చెర్రీ ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు డైరెక్షన్‌లో నటించనున్నారు. 

    జూ. ఎన్టీఆర్‌:

    ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం రామ్‌చరణ్‌తో పాటు జూ.ఎన్టీఆర్‌కు వరల్డ్‌వైడ్‌గా ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టింది.  RRR కు ఎన్టీఆర్‌ రూ. 45 కోట్లు తీసుకున్నారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. కాగా, ప్రస్తుతం ఎన్టీఆర్‌ కొరటాల శివ డైరెక్షన్‌లో NTR30 మూవీలో నటిస్తున్నారు. పాన్‌ ఇండియా రేంజ్‌లో  రూపొందుతున్న ఈ సినిమాకు ఎన్టీఆర్‌ రూ.60 కోట్లు తీసుకుంటున్నారని టాక్. 

    అల్లు అర్జున్‌:

    పుష్ప చిత్రంతో అల్లు అర్జున్‌ మేనియా ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ మూవీ హిందీ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చడంతో బన్నీ క్రేజ్‌ బాలీవుడ్‌కు విస్తరించింది. దీంతో అల్లుఅర్జున్ మార్కెట్‌ విలువ భారీగా పెరిగిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ‘పుష్ప-2’ కోసం బన్నీ కూడా రూ. 60 కోట్లు తీసుకుంటున్నారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

    చిరంజీవి

    అగ్రకథానాయకుడిగా టాలీవుడ్‌ను దశాబ్దాల పాటు ఏలిన మెగాస్టార్‌ చిరు.. సినిమాల్లో తన రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన విషయం తెలిసిందే. చిరు మార్కెట్‌ వాల్యూ యంగ్‌ హీరోలకూ ఏ మాత్రం తక్కువగా లేదనే చెప్పాలి. దీంతో చిరు కూడా తన ప్రతీ సినిమాకు దాదాపు రూ. 50 కోట్ల వరకు తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సంక్రాంతికి రిలీజైన వాల్తేరు వీరయ్య కోసం చిరు రూ.40 కోట్లు తీసుకున్నారని టాక్.

    బాలకృష్ణ:

    నట సింహం బాలకృష్ణ సైతం వరుస హిట్లతో తన మార్కెట్‌ను పెంచుకున్నారు. ‘అఖండ’కు రూ.11 కోట్లు తీసున్న బాలయ్య.. ఆ సినిమా రూ. 90 కోట్ల షేర్‌ వసూలు చేయడంతో రెమ్యూనరేషన్‌ను పెంచారు. ‘వీర సింహారెడ్డి’ కోసం బాలయ్య రూ.15 కోట్లు తీసుకున్నారని తెలిసింది. 

    విజయ్‌ దేవరకొండ:

    అర్జున్‌రెడ్డి సినిమాతో యంగ్‌ హీరో విజయ్‌ దేవరకొండ టాలీవుడ్ సంచలనంగా మారారు. అయితే ఇటీవల రిలీజైన వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌, లైగర్‌ చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద దారుణంగా ఫెయిల్‌ అయ్యాయి. అయితే వరుస ఫ్లాపులు వస్తున్నప్పటికీ విజయ్ ఒక్కో సినిమాకు రూ. 15 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ‘లైగర్‌’కు కూడా విజయ్‌ రూ. 15 కోట్లు తీసుకున్నాడని ప్రచారం జరుగుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version