This WeeK OTT Movies (Sept 25- Oct 01) : ఈ వారం ఓటీటీల్లో 30కి పైగా చిత్రాలు స్ట్రీమింగ్.. లిస్ట్ ఇదే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • This WeeK OTT Movies (Sept 25- Oct 01) : ఈ వారం ఓటీటీల్లో 30కి పైగా చిత్రాలు స్ట్రీమింగ్.. లిస్ట్ ఇదే!

    This WeeK OTT Movies (Sept 25- Oct 01) : ఈ వారం ఓటీటీల్లో 30కి పైగా చిత్రాలు స్ట్రీమింగ్.. లిస్ట్ ఇదే!

    September 25, 2023

    గత వారం వినాయక చవితి నవరాత్రులను దృష్టిలో ఉంచుకుని పెద్దగా సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాలేదు. అయితే ఈవారం మాత్రం ప్రేక్షకులను అలరించేందుకు పెద్ద సినిమాలు సిద్దమయ్యాయి. అలాగే ఓటీటీ ప్లాట్‌ఫాంలోను దాదాపు 30కి పైగా సినిమాలు స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. మరి ఆ చిత్రాలు ఏమిటో ఓసారి చూద్దాం

    స్కంద (Skanda movie)

    ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ పొత్తినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం స్కంద. ఈ సినిమా సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచాయి. రామ్ రెండు విభిన్న గెటప్‌లలో కనిపించనున్నాడు. రామ్ సరసన శ్రీలీల, సయిూ మంజ్రేకర్‌లు హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన లిరికల్ వీడియో సాంగ్స్ ప్రేక్షకుల నుంచి మంచి టాక్‌ తెచ్చుకున్నాయి. వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న రామ్‌కు ఈ సినిమా విజయం ఎంతో కీలకంగా మారింది. అటు వరుస బ్లాక్ బాస్టర్ హిట్‌లతో మంచి ఫామ్‌లో ఉన్న బోయపాటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శ్రీనివాస చిట్టూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నాడు. స్కంద చిత్రం తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.

    చంద్రముఖి 2 (chandramukhi 2)

    రాఘవ లారెన్స్‌, బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌ కాంబోలో వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ చిత్రం చంద్రముఖి2.  ఈ చిత్రాన్ని పి.వాసు తెరకెక్కిస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చంద్రముఖికి ఇది సిక్వేల్‌గా రాబోతుంది. 17 ఏళ్ల తర్వాత రాజ్‌ మహల్‌ను వీడిన చంద్రముఖి మళ్లి కోటలోకి ఎందుకు ప్రవేశించింది అనే కథాంశంతో సినిమాను తెరకెక్కించారు.  ఈ నెల 28న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. చంద్రముఖిలో జ్యోతికను చంద్రముఖి ఆవహించగా, ఇందులో నిజమైన చంద్రముఖిగా కంగనా రనౌత్‌ నటిస్తోంది. లైకా ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

    ది వ్యాక్సిన్ వార్ (The Vaccine War)

    కశ్మీర్ ఫైల్స్ సినిమా డైరెక్టర్ వివేక్ రంజన్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వస్తున్న మరో చిత్రం ది వ్యాక్సిన్ వార్. ఈ సినిమాను కరోనా నాటి పరిస్థితుల సమయంలో వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించినట్లు చిత్రబృందం చెబుతోంది. ఈనెల 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదొక సైన్స్‌ ఫిక్షన్‌తో కూడిన సినిమాగా పేర్కొంటున్నారు. ముఖ్యంగా వైద్యులు, పరిశోధకులు చేసిన గొప్ప సేవలకు ఈ సినిమా నివాళులర్పించనున్నట్లు చిత్ర బృందం చెబుతోంది.

    పెదకాపు-1 (Peddha Kapu 1)

    ఫ్యామిలీ చిత్రాలకు పెట్టింది పేరైన శ్రీకాంత్ అడ్డాల నారప్ప సినిమాతో తన దారిని యాక్షన్ చిత్రాల వైపు మరల్చుకున్నాడు. కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, బ్రహ్మోత్సవం వంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఆయన దగ్గరయ్యాడు. తాజాగా పెదకాపు-1 యాక్షన్ చిత్రంతో సెప్టెంబర్ 29న ప్రేక్షకులను పలకరించబోతున్నాడు . ఈ సినిమాలో విరాట్ కర్ణ హీరోగా, ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది.

    ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే చిత్రాలు ( సెప్టెంబర్ 25- October 1)

    TitleCategoryLanguagePlatformRelease Date
    Little Baby Bum: Music Time SeriesEnglishNetflixSept 25
    The Devil’s Plan SeriesKoreanNetflixSept 26
    Forgotten LoveMoviePolishNetflixSept 27
    OverhaulMoviePortugueseNetflixSept 27
    Sweet Flow 2 MovieFrenchNetflixSept 27
    The Wonderful Story of Henry SugarMovieEnglishNetflixSept 27
    Castlevania: NocturneSeriesEnglishNetflixSept 27
    Ice Cold: Murder, Coffee and Jessica Wangso MovieEnglishNetflixSept 28
    Love is in the AirMovieEnglishNetflixSept 28
    Fair Play MovieEnglishNetflixSept 29
    Choona SeriesHindiNetflixSept 29
    Nowhere MovieSpanishNetflixSept 29
    Reptile MovieEnglishNetflixSept 29
    Khushi MovieTeluguNetflixOct 01
    Spider-Man: Across the Spider-VerseMovieEnglishNetflixOct 01
    The Fake ShakeSeriesEnglishAmazon PrimeSept 26
    Hostel Days Season 4SeriesHindiAmazon PrimeSept 27
    Doble DiscourseMovieSpanishAmazon PrimeSept 28
    Kumari SrimatiSeriesTelugu Amazon PrimeSept 28
    Jen WeiSeriesEnglishAmazon PrimeSept 29
    El-PopSeriesSpanishHotstarSept 27
    The Worst of EvilSeriesEnglishHotstarSept 27
    King of KotaMovieTelugu Dubbed HotstarSept 28
    Launchpad Season 2SeriesEnglishHotstarSept 29
    Tum Se Na Ho Payega MovieHindiHotstarSept 29
    Papam Pasivadu SeriesTeluguAhaSept 29
    Dirty HariMovieTamilAhaSept 29
    Charlie ChopraSeriesHindiSony LivSept 27
    Bye! MovieTamilSony LivSept 29
    Agent MovieTeluguSony LivSept 29
    Angshuman MBA MovieBengaliZee5Sept 29
    Blue BeetleMovieEnglishBook My ShowSept 29
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version