తెలుగు రాష్ట్రాల్లో ఈ వీకెండ్ సంక్రాంతి సందడి మెుదలు కానుంది. దీంతో ఎప్పటిలాగే కొత్త సినిమాలతో థియేటర్లు కళకళలాడబోతున్నాయి. ఈ ఏడాది కొత్త పలువురు స్టార్ హీరోలు సంక్రాంతి బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. అటు ఓటీటీలోనూ సరికొత్త చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాయి. మరి ఎవరెవరు సంక్రాంతి బరిలో ఉన్నారో ఇప్పుడు చూద్దాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు
గుంటూరు కారం
మహేశ్‌బాబు (Mahesh Babu) హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ డ్రామా చిత్రం ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం థియేటర్‌లలో విడుదల కానుంది. అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూవీ కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు, పాటలు యువతను విశేషంగా ఆకట్టుకున్నాయి.
హను-మాన్
యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. వైవిధ్యమైన సినిమాలు తీస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తేజ సజ్జా కథానాయకుడిగా ఆయన రూపొందించిన మరో చిత్రం ‘హను-మాన్’ (Hanu Man). ఆంజనేయస్వామి కథా నేపథ్యంతో సూపర్ హీరో ఫిల్మ్‌గా దీన్ని తీర్చిదిద్దారు. ఈ చిత్రం కూడా జనవరి 12న విడుదల కాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లోని వీఎఫ్‌ఎక్స్ సినిమాపై అంచనాలు పెంచేసింది. చిన్నారులను సైతం అలరించేలా ఇందులో సన్నివేశాలు ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది.
సైంధవ్
టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచారు. శైలేష్‌కొలను దర్శకత్వంలో ఆయన నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘సైంధవ్’ (Saindhav) జనవరి 13న థియేటర్‌లలో విడుదల కానుంది. వెంకటేష్‌కి ఇది 75వ సినిమా. కూతురి సెంటిమెంట్‌తో పాటు, వెంకటేశ్ యాక్షన్ సినిమాకు హైలైట్‌గా నిలవనుంది. శ్రద్ధాశ్రీనాథ్, నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆర్య కీలకపాత్రలు పోషించారు.
నా సామిరంగ
ఈ సంక్రాంతికి మరో స్టార్ హీరో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. నాగార్జున (Nagarjuna) హీరోగా విజయ్ బిన్ని దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నా సామిరంగ’ (Naa Saami Ranga) చిత్రం.. జనవరి 14న విడుదల కానుంది. అల్లరి నరేశ్, రాజ్‌తరుణ్ కీలక పాత్రలు పోషించగా.. ఆషికా రంగనాథ్ కథానాయికగా చేసింది. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘పొరింజు మరియం జోసే’ చిత్రానికి రీమేక్‌గా నా సామిరంగను రూపొందించారు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా కథలో మార్పులు చేశారు.
అయలాన్
సంక్రాంతికి తెలుగు చిత్రాలతో పాటు ఓ డబ్బింగ్ సినిమా సైతం విడుదల కాబోతోంది. తమిళ నటుడు శివకార్తికేయన్ ‘అయలాన్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు రాబోతున్నాడు. ఆర్.రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సైన్స్ ఫిక్షన్ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా చేసింది. జనవరి 12న తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. గ్రహాంతర వాసితో మనిషికి కుదిరిన స్నేహం ఎలాంటి పరిస్థితులకు దారి తీసింది అన్నది కథ.
ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు
ఈ వారం ఓటీటీ సినిమాల విషయానికొస్తే ఏకంగా 29 చిత్రాలు / వెబ్ సిరీసులు రిలీజ్ కానున్నాయి. థియేటర్లకు వెళ్లి కొత్త మూవీస్ చూసే ఆసక్తి లేకపోతే వీటిని ప్రిఫర్ చేయవచ్చు. ఇంతకీ ఓటీటీలో రాబోతున్న ముఖ్యమైన చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏవో ఇప్పుడు చూద్దాం.
ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్
నితిన్ కథానాయకుడిగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్’. శ్రీలీల హీరోయిన్. ఈ చిత్రం జనవరి 12న ఓటీటీలోకి రానుంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. గతేడాది డిసెంబర్ 8న విడుదలైన ఈ చిత్రం పరాజయాన్ని మూటగట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద విఫలమై నితీర్ కెరీర్‌లో మరో డిజాస్ ఫ్లాప్‌గా నిలిచింది. మరి ఓటీటీ ప్రేక్షకులనైనా ఈ చిత్రం ఆకట్టుకుందో లేదో చూడాలి.
కోట బొమ్మాళి P.S
శ్రీకాంత్ కీలక పాత్రలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై రూపొందిన చిత్రం ‘కోట బొమ్మాళి పి.ఎస్’. వరలక్ష్మి శరత్‌కుమార్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు. ఈ చిత్రం ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. జనవరి 11వ తేదీ నుంచి ‘ఆహా’లో ప్రసారం కానుంది. నవంబరు 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.
మరిన్ని OTT చిత్రాలు & వెబ్ సిరీస్‌ల విడుదలల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
https://telugu.yousay.tv/tfidb/ott
Title | Category | Language | Platform | Release Date |
Break Point Season 2 | Series | English | Netflix | Jan 10 |
King Dom – 3 | Movie | English | Netflix | Jan 10 |
The Trust | Series | English | Netflix | Jan 10 |
Boy Swallows Universe | Series | English | Netflix | Jan 10 |
Killer Soup | Movie | Hindi | Netflix | Jan 11 |
Lift | Movie | English | Netflix | Jan 12 |
Echo | Series | English | Disney + Hotstar | Jan 11 |
The Legend of Hanuman | Series | Hindi | Disney + Hotstar | Jan 12 |
Journey | Movie | Tamil | SonyLIV | Jan 12 |
Sivappu | Movie | Tamil | Aha | Jan 12 |
La Brea | Series | English | Jio Cinema | Jan 10 |
Ted | Series | English | Jio Cinema | Jan 12 |
Mission: Impossible – Dead Reckoning Part One | Movie | Telugu/English | Amazon Prime | Jan 11 |
Roleplay | Movie | English | Amazon Prime | Jan 12 |
Celebrities Featured Articles Telugu Movies
Fahadh Faasil: ‘పుష్ప 2’ ఈవెంట్స్‌ను ఫహాద్ ఫాజిల్ అందుకే పక్కకు పెట్టాడా?