గత వారం థియేటర్ల వద్ద పెద్ద సినిమాలు సందడి చేశాయి. మళ్ళీ సెప్టెంబర్ వరకు భారీ చిత్రాలు విడుదల కావడం లేదు. థియేటర్లను ఆక్రమించేందుకు చిన్న సినిమాలు ఉత్సాహం చూపుతున్నాయి. ఈ వారం(Aug 18) పలు చిత్రాలు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. దీంతో పాటు ఓటీటీలో పలు చిత్రాలు, వెబ్ సిరీస్‌లు సందడి చేయబోతున్నాయి. ఆ వివరాలు చూద్దాం.
థియేటర్లలో విడుదలవుతున్న చిత్రాలు
మిస్టర్ ప్రెగ్నెంట్
వినూత్న కథాంశంతో తెరకెక్కుతున్న సినిమా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. శ్రీనివాస్ వింజనంపాటి దర్శకుడు. సయ్యద్ సొహైల్, రూపా కొడువయ్యూర్ జంటగా నటిస్తున్నారు. ‘ప్రసవ సమయంలో తల్లి పడే కష్టాన్ని తండ్రి తీసుకుంటే ఎలా ఉంటుంది?’ అనే అంశంపై దీనిని తెరకెక్కించినట్లు చిత్రబృందం చెబుతోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. ఆగస్టు 18న సినిమా విడుదల కానుంది.
జిలేబి
హాస్య కథా చిత్రాలకు పేరున్న దర్శకుడు విజయ్ భాస్కర్. నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మథుడు వంటి చిత్రాలను తెరకెక్కించాడు. తాజాగా విజయ్ భాస్కర్ దర్శకత్వంలో ‘జిలేబి’ సినిమా రాబోతోంది. తనయుడు శ్రీ కమల్‌ని హీరోగా పరిచయం చేస్తున్నాడు. రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్ర పోషిస్తుండగా మురళీ శర్మ, తదితరులు సహాయ పాత్రల్లో నటించారు. గుంటూరు రామకృష్ణ నిర్మాత. ఆగస్టు 18న సినిమా విడుదల కానుంది.
ప్రేమ్ కుమార్
వరుస సినిమాలతో సంతోష్ శోభన్ ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. తాజాగా ‘ప్రేమ్‌కుమార్’గా వస్తున్నాడు. రాశిసింగ్, రుచిత హీరోయిన్లుగా నటించారు. ప్రేమ్‌కుమార్, సుందరలింగం స్నేహితుల మధ్య జరిగే సందడి ప్రేక్షకులను మెప్పిస్తుందని చిత్రబృందం చెబుతోంది. రైటర్ హరీశ్ మహర్షి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శివ ప్రసాద్ పన్నీరు నిర్మించాడు. ఈ సినిమా ఆగస్ట్ 18న రిలీజ్ కానుంది.
పిజ్జా3
హార్రర్ కామెడీ జానర్‌లో వస్తున్న ‘పిజ్జా’ సిరీస్ సినిమాలు విజయం సాధిస్తున్నాయి. తాజాగా, పిజ్జా3 తమిళంలో విడుదలై హిట్ టాక్‌ని సొంతం చేసుకుంది. దీంతో తెలుగులోనూ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. మోహన్ గోవింద్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఇటీవల విడుదలైన ప్రచార చిత్రం ఆకట్టుకుంది. కంప్లీట్ హార్రర్ థ్రిల్లర్‌గా ఈ సినిమా అలరించనుంది. ఆగస్ట్ 18న మూవీ విడుదల అవుతోంది.
డీడీ రిటర్న్స్ భూతాల బంగ్లా
సంతానం ప్రధాన పాత్రలో వచ్చిన ‘డీడీ రిటర్న్స్ భూతాల బంగ్లా’ సినిమా కోలీవుడ్‌లో సక్సెస్‌ని అందుకుంది. ఇప్పుడు తెలుగులో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతోంది. మహిళలు, చిన్నారులు ఈ సినిమాను ఆస్వాదిస్తారని దర్శకుడు ఎస్.ప్రేమ్ చంద్ వెల్లడించాడు. ఈ మూవీ సైతం ఆగస్ట్ 18న రిలీజ్ కానుంది.
OTTలో రిలీజ్ అవుతున్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు
Title | Category | Language | Platform | Release Date |
Annapurna Photo Studio | Movie | Telugu | ETV Win | Aug 15 |
Taali | Movie | Hindi | Jio | Aug 15 |
Untold: All Of Fame | Movie | English | Netflix | Aug 15 |
No Escape Room | Movie | English | Netflix | Aug `15 |
Chatrapathi | Movie | Hindi | Zee5 | Aug 15 |
Stories Not to be Told | Movie | English | Book My Show | Aug 15 |
babylon 5 the road home | Movie | English | Book My Show | Aug 15 |
Dep vs Hard | Series | English | Netflix | Aug 16 |
Guns and Gulabs | Series | Hindi | Netflix | Aug 18 |
harlan coben’s shelter | Series | English | Netflix | Aug 18 |
Celebrities Featured Articles Telugu Movies
Game Changer: ‘మేము మూలాలు మర్చిపోలే’.. బన్నీకి పవన్ చురకలు?