This Week OTT Releases: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • This Week OTT Releases: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!

    This Week OTT Releases: ఈ వారం థియేటర్, ఓటీటీల్లో సందడి చేసే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!

    November 13, 2023

    గత వారంలాగే ఈ వారం కూడా పెద్ద సినిమాలు లేకపోవడంతో థియేటర్లను ఆక్రమించేందుకు చిన్న సినిమాలు సిద్ధమవుతున్నాయి. నవంబర్‌ మూడో వారంలో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ఆసక్తికర సినిమాలు రాబోతున్నాయి. నవంబర్‌ 13 నుంచి 19 తేదీల మధ్య ఆ చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అలాగే ఓటీటీలో కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ కాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏంటి? వాటి విశేషాల ఎలా ఉన్నాయి? ఈ కథనంలో చూద్దాం.

    థియేటర్‌లో రిలీజయ్యే చిత్రాలు

    మంగళవారం

    ‘RX 100’ డైరెక్టర్‌ అజయ్‌ భూపతి రూపొందించిన మరో ఆసక్తికర చిత్రం ‘మంగళవారం’ (Mangalavaaram). ఇందులో పాయల్‌ రాజ్‌పూత్‌ (Payal Rajput), అజ్మల్‌ అమిర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ముద్ర మీడియా వర్క్స్‌ పతాకంపై స్వాతిరెడ్డి గునుపాటి, సురేష్‌ వర్మ ఈ మూవీని నిర్మించారు. నవంబరు 17న (శుక్రవారం) తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదల చేసిన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి.

    మై నేమ్‌ ఈజ్‌ శృతి

    ప్రముఖ హీరోయిన్‌ హన్సిక నటించిన లేటేస్ట్‌ మూవీ ‘మై నేమ్‌ ఈజ్‌ శృతి’ (My Name Is Shruthi) సినీ ప్రియులను థ్రిల్‌ చేసేందుకు ఈ వారమే వస్తోంది. ఆమె లీడ్‌ రోల్‌లో చేసిన ఈ చిత్రాన్ని డైరెక్టర్‌ శ్రీనివాస్‌ ఓంకార్‌ తెరకెక్కిస్తున్నారు. బురుగు రమ్య ప్రభాకర్‌ నిర్మిస్తున్నారు. ఊహకందని మలుపులతో సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది. తన మనోభావాలను ధైర్యంగా వెల్లడించే యువతిగా ఇందులో హన్సిక కనిపిస్తుందని పేర్కొన్నాయి. నవంబరు 17న (శుక్రవారం) ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

    స్పార్క్‌ లైఫ్‌

    విక్రాంత్‌ హీరోగా నటించి.. స్వయంగా తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రం ‘స్పార్క్‌ లైఫ్‌’ (Spark The Life). డెఫ్‌ ఫ్రాగ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ఈ మూవీని నిర్మించింది. మెహరీన్‌, రుక్సర్‌ థిల్లాన్‌ కథానాయికలు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 17న థియేటర్‌లలో విడుదల కానుంది.

    సప్త సాగరాలు దాటి సైడ్‌-B

    కన్నడ నటుడు రక్షిత్‌ శెట్టి (Rakshit Shetty) కీలక పాత్రలో నటించిన ప్రేమకథా చిత్రం ‘సప్త సాగరాలు దాటి సైడ్‌-B’ (Sapta Sagaralu Dhaati Side B). రుక్మిణీ వసంత్‌ కథానాయిక. హేమంత్‌ ఎం. రావు దర్శకత్వం వహించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన  (Sapta Sagaralu Dhaati Side A) సినిమాకు కొనసాగింపుగా కొత్త చిత్రాన్ని తీసుకొస్తున్నారు. నవంబర్‌ 17న కన్నడతోపాటు తెలుగు, తమిళ, మలయాళీ భాషల్లో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.

    అన్వేషి

    విజయ్‌ ధరణ్‌ దాట్ల, సిమ్రాన్‌ గుప్తా, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘అన్వేషి’ (Anvesh). వి.జె.ఖన్నా దర్శకత్వం వహించారు. టి.గణపతిరెడ్డి నిర్మాత. అడవి నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమా తెరకెక్కిందని చిత్ర యూనిట్‌ తెలిపింది. కథానాయిక అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషించిందని చెప్పింది. ఆమె చుట్టూ సాగే సన్నివేశాలు ఆకట్టుకుంటాయని, చైతన్‌ భరద్వాజ్‌ మరోసారి తన సంగీతంతో ఆకట్టుకుంటాడని చెబుతోంది. నవంబరు 17న ఈ సినిమా విడుదల కానుంది.

    ఓటీటీలో స్ట్రీమింగ్‌కానున్న చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు

    TitleCategoryLanguagePlatformRelease Date
    Twin LoveWeb SeriesEnglishAmazon PrimeNov 17
    ApurvaMovieHindiDisney + HotstarNov 15
    Chinna MovieTamil/TeluguDisney + HotstarNov 17
    Kannur SquadMovieMalayalamDisney + HotstarNov 17
    How to Become a Mob BossWeb SeriesEnglishNetflixNov 14
    Best. Christmas. Ever!MovieEnglishNetflixNov 16
    The crownWeb SeriesEnglishNetflixNov 16
    Believer 2MovieEnglishNetflixNov 17
    The DadsDocumentaryEnglishNetflixNov 17
    SukheeMovieHindiNetflixNov 18
    The RailwaymenMovieHindiNetflixNov 18

    APP: సినీ అభిమానులను అలరించేందుకు ఈ వారం కూడా పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 5 తేదీల మధ్య థియేటర్లు, OTTలో విడుదలై సందడి చేయనున్నాయి. ఈ వారం థియేటర్లు, ఓటీటీలో రిలీజ్‌ అయ్యే చిత్రాలు ఏంటో తెలుసుకోవాలంటే YouSay Web లింక్‌పై క్లిక్ చేయండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version