This Week OTT Releases: ఈ వారం(May 5) థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు ఇవే..!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • This Week OTT Releases: ఈ వారం(May 5) థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు ఇవే..!

    This Week OTT Releases: ఈ వారం(May 5) థియేటర్లు, ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాలు ఇవే..!

    May 2, 2023

    అసలు సిసైలన వేసవి నెల ప్రారంభమైంది. ఈ సమయంలో థియేటర్లకు రప్పించి ప్రేక్షకులను చల్లబర్చేందుకు కొత్త సినిమాలు రెడీ అవుతున్నాయి. ఈ వారం(మే 5) బాక్సాఫీసు వద్ద పలు సినిమాలు సందడి చేయబోతున్నాయి. మరోవైపు, ఓటీటీల్లోనూ కొన్ని సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. వాటి వివరాలు చూద్దాం. 

    రామబాణం

    హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కాంబోలో వస్తున్న మూడో చిత్రమిది. అన్నదమ్ముల మధ్య అనుబంధాన్ని ఈ సినిమా ద్వారా డైరెక్టర్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. లక్ష్యం తరువాత గోపీచంద్, జగపతిబాబు, శ్రీవాస్ కాంబోలో వస్తోందీ సినిమా. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి. సక్సెస్‌ఫుల్ కాంబినేషన్ కావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. డింపుల్ హయతీ ఇందులో హీరోయిన్‌గా నటించింది. ఖుష్బూ ప్రధాన పాత్రలో నటించింది. మే 5న సినిమా విడుదల కానుంది.

    ఉగ్రం

    నాంది హిట్ తర్వాత అల్లరి నరేష్ సరికొత్త కెరీర్‌ని పున: ప్రారంభించాడు. ఈ చిత్రానికి డైరెక్షన్ చేసిన విజయ్ కనకమేడలతో మరోసారి జతకట్టి ఈ సారి అల్లరి నరేష్ ‘ఉగ్రం’ మరో హిట్‌కు ప్రయత్నిస్తున్నాడు.ట్రైలర్ ఆసక్తిని పెంచింది. నాంది మాదిరిగానే ఇందులో మరో ప్రధాన సమస్యను డైరెక్టర్ లేవనెత్తే ప్రయత్నం చేశారు. హ్యూమన్ ట్రాఫికింగ్ కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ఏటా నమోదవుతున్న మిస్సింగ్ కేసులు చివరికి ఎటువైపు దారితీస్తున్నాయనే ప్రశ్నకు మే 5న ప్రేక్షకులకు జవాబు చెప్పనుంది. షైన్ స్క్రీన్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కింది.

    ది కేరళ స్టోరీ

    విడుదలకు ముందే దేశవ్యాప్తంగా చర్చల్లో నిలిచిన సినిమా ఇది. సుదిప్తో సేన్ డైరెక్షన్ వహించిన ఈ మూవీ మే 5న థియేటర్ల ముందుకు రాబోతోంది. ఆదా శర్మ లీడ్ రోల్‌లో నటించింది. కేరళలో మతం మారిన మహిళలు తీవ్రవాద సంస్థల్లో చేరడం, వాటి పూర్వాపరాల గురించి దాగివున్న నిజాలను ఈ సినిమా వెలికితీయనుందని చిత్రబృందం ప్రకటించింది. దీంతో పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ స్టోరీకి ఆధారాలు చూపితే రూ.కోటికి పైగా నజరానా ప్రకటించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. చిత్రబృందం మాత్రం తమ సినిమాను సమర్థించుకుంది. హిందీ భాషలో ఇది తెరకెక్కింది.

    విరూపాక్ష(మళయాలం)

    తెలుగులో భారీ విజయాన్ని అందుకున్న విరూపాక్ష మిగతా భాషల్లోనూ అలరించేందుకు రెడీ అవుతోంది. మే 5న మళయాలం భాషలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు, చిత్రబృందం ప్రమోషన్లలో బిజీబిజీగా గడుపుతోంది. కొచ్చిలో హీరో సాయిధరమ్ తేజ్, హీరోయిన్ సంయుక్త మీనన్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ సినిమా వైపు దృష్టిని ఆకర్షిస్తున్నారు. కార్తీక్ దండు దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ పతాకంపై నిర్మితమైంది. 

    అరంగేట్రం

    కమర్శియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమే ‘అరంగేట్రం’. శ్రీనివాస్ ప్రభన్ దర్శకత్వం వహించగా మహేశ్వరి నిర్మాణ బాధ్యతలు స్వీకరించింది. ఓ ముగ్గురు యువకులు, ఆరుగురు యువతుల మధ్య జరిగే కథగా ఇది తెరకెక్కింది. జబర్దస్త్ సత్తిపండు, రోషన్, ముస్తఫా, ఆస్కరి, శ్రీవల్లి, విజయ, సాయిశ్రీ, శ్రీనివాస్, అనిరుధ్, ఇందు, లయ తదితరులు నటించారు. విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. మే 5న అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.   

    యాద్గిరి అండ్ సన్స్

    వాస్తవిక ఘటనల ఆధారంగా ‘యాద్గిరి అండ్ సన్స్’ తెరకెక్కింది. భిక్షపతి రాజు పందిరి దర్శకత్వం వహించాడు. రాజీవ్ కనకాల, మురళీధర్ గౌడ్, అనిరుధ్ తుకుంట్ల, జీవా, యశ్విని నివేదిత తదితరులు నటించారు. మే 5న సినిమా విడుదల కానుంది. 

    OTT విడుదలలు

    TitleCategoryLanguagePlatformRelease Date
    Clifford the Big Red DogMovieEnglishNetflixMay 2
    Queen Charlotte a Bridgerton StoryWeb seriesEnglishNetflixMay 2
    SanctuaryMovieEnglishNetflixMay 4
    The Larva FamilyAnimated MovieEnglishNetflix May 4
    MeterMovieTeluguNetflix May 5
    3MovieTeluguNetflixMay 5
    YogiMovieTeluguNetflixMay 5
    Rowdy FellowMovieTeluguNetflixMay 5
    ThammuduMovieTeluguNetflixMay 5
    AmruthamChandamamaloMovieTeluguNetflixMay 5
    Match FixingMovieTeluguETV WinMay 5
    Tu Zuti mai makkarMovieHindiNetflixMay 5
    FirefliesSeriesHindiZEE 5May 5
    Shebhash FeludaMovieBengaliZEE5May 5
    Corona PapersMovieMalayalamDisney HotstarMay 5
    Sas Bahu aur FlamingoMovieHindiDisney HotstarMay 5
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version