జూన్ నెలలో ఆఖరి వారంలోకి అడుగు పెట్టేశాం. నెలాఖరున పలు చిత్రాలు థియేటర్ల వద్ద సందడి చేయడానికి రెడీగా ఉన్నాయి. డిఫరెంట్ జానర్లలో తెరకెక్కిన సినిమాలు ఈ వారం(June 29,30) విడుదల అవుతుండటం విశేషం. థియేటర్లతో పాటు ఓటీటీల్లోనూ పలు వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను పలకరించనున్నాయి. ఆ విశేషాలు తెలుసుకుందాం.
థియేటర్లలో విడుదలయ్యే చిత్రాలు
స్పై(SPY)
నిఖిల్ సిద్ధార్థ నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమే ‘స్పై’. ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకుడిగా మారి ఈ సినిమాను తెరకెక్కించాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ నేపథ్యంలో జరిగిన సంఘటనల ఆధారంగా దీనిని తెరకెక్కించినట్లు చిత్రబృందం చెబుతోంది. వాస్తవికతకు దగ్గరగా, నిజ జీవిత స్పై ఏజెంట్లు ఎలా ఉంటారో ఇందులో చూపించినట్లు మూవీ టీం వెల్లడించింది. కె.రాజశేఖర్ రెడ్డి కథ అందించి ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించాడు. ఐశ్వర్య మీనన్ నిఖిల్ సరసన నటించింది. జూన్ 29న విడుదలకు సిద్ధమవుతోంది.
సామజవరగమన(Samajavaragamana)
శ్రీవిష్ణు కథానాయకుడిగా వస్తున్న చిత్రమే ‘సామజవరగమన’. వినూత్నమైన ప్రేమకథగా ఈ సినిమాను తెరకెక్కించినట్లు చిత్రబృందం చెబుతోంది. ఈ మూవీకి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించగా రాజేశ్ దండా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. మూవీకి గోపీ సుందర్ సంగీతం అందించాడు. రెబా మోనికా జాన్ కథానాయిక. నరేశ్, సత్య, తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని జూన్ 29న విడుదలకు సిద్ధమైంది.
ఇండియానా జోన్స్(Indiana Jones)
సాహసోపేతమైన సినిమాలకు ప్రత్యేక అభిమానులు ఉంటారు. ఈ కోవలో వచ్చిన ఇండియానా జోన్స్ సిరీస్ అప్పట్లో ఎంతగానో అలరించింది. ఇప్పుడు ఇదే సిరీస్‌లో మరో చిత్రం రాబోతోంది. ‘ఇండియానా జోన్స్ అండ్ డయల్ ఆఫ్ డెస్టినీ’ సినిమా జూన్ 29న విడుదల కాబోతోంది. తమిళ్, తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ సిరీస్‌లో దాదాపు 14 ఏళ్ల క్రితం చివరి చిత్రం వచ్చింది. మళ్లీ ఇప్పుడే థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అయింది.
మాయా పేటిక(Mayaa Petika)
శ్రీనివాస్, పాయల్ రాజ్‌పుత్, సునీల్, పృథ్వీ తదితరులు కలిసి నటించిన చిత్రం ‘మాయా పేటిక’. సెల్‌ఫోన్ చుట్టూ జరిగే కథగా ఈ సినిమా సాగనుందని చిత్రబృందం వెల్లడించింది. రమేశ్ రాపార్తి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎప్పుడో పూర్తయింది. ఎట్టకేలకు జూన్ 30న విడుదల అయ్యేందుకు ముస్తాబైంది.
లవ్ యూ రామ్(Love You Ram)
ప్రముఖ రచయిత, దర్శకుడు దశరథ్ కథ అందించి నిర్మిస్తున్న సినిమా ‘లవ్ యూ రామ్’. తనదైన శైలిలో ఈ ప్రేమ కథను చెక్కారు దశరథ్. విభిన్నమైన మనస్తత్వాలు ఉన్న ఇద్దరు ప్రేమికుల కథ ఎక్కడిదాకా సాగింది? చివర్లో ఎలాంటి మలుపులు తిరిగిందనేది తెరపై చూడాల్సిందేనని చిత్రబృందం తెలిపింది. రోహిత్ బెహల్, అపర్ణ జనార్దనన్ జంటగా నటించగా బి.వి.చౌదరి దర్శకత్వం వహించాడు. దశరథ్‌తో నిర్మాణ బాధ్యతలు పంచుకున్నాడు. జూన్ 30న చిత్రం రిలీజ్ కానుంది.
ఓటీటీల్లో విడుదలయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు
Title | Category | Language | Platform | Release Date |
Weekend Family Season 2 | Web Series | English | Disney + Hotstar | June 28 |
Lust Stories 2 | Web Series | Hindi | Netflix | June 29 |
See You In my Nineteenth Life | Web Series | Korean | Netflix | June 29 |
Jack ran Season 4 | Web Series | English | Amazon Prime | June 30 |
Celebrity | Web Series | Korean | Netflix | June 30 |
The Night Manager Season 2 | Web Series | Hindi | Disney+ Hotstar | June 30 |
Arthamainda Arunkumar | Web Series | Telugu | Aha | June 30 |
Sargent | Web Series | Hindi | Jio Cinema | June 30 |
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!