This Week Releases: ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న చిత్రాలు ఇవే
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • This Week Releases: ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న చిత్రాలు ఇవే

    This Week Releases: ఈ వారం థియేటర్లలో సందడి చేయనున్న చిత్రాలు ఇవే

    July 3, 2023

    ఈ వారం(July 7) బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సందడి చేయబోతున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని థియేటర్లలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే రిలీజైన ఆయా చిత్రాల ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. మరి, ఆ సినిమాలతో పాటు ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏంటో చూసేద్దాం. 

    థియేటర్లలో విడుదలవుతున్న చిత్రాలు

    రంగబలి(Rangabali)

    నాగశౌర్య, యుక్తి తరేజా జంటగా నటించిన చిత్రం ‘రంగబలి’. ఈ మూవీని పవన్ బాసంశెట్టి తెరకెక్కించాడు. ‘లవ్ స్టోరీ’ మూవీకి మ్యూజిక్ అందించిన పవన్ సీహెచ్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేశాడు. సత్య, సప్తగిరి, బ్రహ్మాజీ, తదితరులు నటించగా సుధాకర్ చెరుకూరి నిర్మించాడు. జులై 7న సినిమా విడుదల కానుంది. 

    రుద్రంగి(Rudrangi)

    బీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నిర్మించిన చిత్రం ‘రుద్రంగి’. జగపతి బాబు, మమత మోహన్‌దాస్, తదితరులు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. అజయ్ సామ్రాట్ డైరెక్షన్ చేయగా నోఫెల్ రాజా మ్యూజిక్ అందించాడు. జులై 7న మూవీ రిలీజ్ కానుంది. 

    భాగ్ సాలే(Bhaag Saale)

    శ్రీసింహ కోడూరి హీరోగా వస్తున్న చిత్రం ‘భాగ్ సాలే’. నేహా సోలంకి శ్రీసింహ సరసన నటించింది. వైవా హర్ష, రాజీవ్ కనకాల, జాన్ విజయ్ తదితరులు కీలక పాత్ర పోషించారు. డైరెక్టర్ ప్రణీత్ బ్రహ్మాండపల్లి ఈ మూవీని క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దాడు. కాలభైరవ మ్యూజిక్ అందించాడు. జులై 7న రిలీజ్ అవుతోంది.

    ఇద్దరు(Iddaru) 

    యాక్షన్ కింగ్ అర్జున్, జేడీ చక్రవర్తి కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఇద్దరు’. ఎస్ఎస్ సమీర్ దర్శకత్వంలో ఫర్హీన్ ఫాతిమా నిర్మాణంలో వస్తోందీ సినిమా. జులై 7న రిలీజ్ కానుంది. 

    సర్కిల్(Circle)

    ‘ఎవరు ఎప్పుడు ఎందుకు శత్రువులవుతారో’ అంటూ ట్యాగ్‌లైన్‌తో వస్తున్న చిత్రం ‘సర్కిల్’.  నీలకంఠ దర్శకత్వం వహించాడు. సాయి రోనక్, అర్షిణ్ మెహతా, బాబా భాస్కర్, నైనా తదితరులు ఇందులో నటించారు. జులై 7న మూవీ రిలీజ్. 

    ఓ సాథియా (Oo Sathiya)

    దివ్య భావన దర్శకత్వంలో ‘ఓ సాథియా’ తెరకెక్కింది. ఆర్యన్ గౌరా, మిస్తీ చక్రవర్తి, తదితరులు నటించారు. చందన కట్టా నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా సైతం జులై 7న విడుదల కానుంది.

    7.11 PM

    ఆసక్తికరమైన కథాంశంతో 7.11 PM మూవీ థియేటర్లలోకి వస్తోంది. చైతు మాదాల ఈ మూవీని తెరకెక్కించాడు. సాహస్, దీపిక ప్రధాన పాత్రల్లో నటించారు. నరేశ్ యనమదల, మాధురి రావిపాటి, వాణి కన్నెగంటి సినిమాను నిర్మించారు. జులై 7న విడుదల కాబోతోంది.

    మోహనకృష్ణ గ్యాంగ్‌లీడర్ (Mohanakrishna’s Gang Leader)

    మోహనకృష్ణ, సౌజన్య, హరిణి, సుమన్, తదితరులు నటించిన చిత్రమే ఇది. మోహనరావు డైరెక్షన్ చేసి నిర్మాతగా వ్యవహరించారు. జులై 7న మూవీ రిలీజ్ కానుంది. 

    నాతో నేను(Natho Nenu)

    సాయికుమార్, శ్రీనివాస్ సాయి, ఆదిత్య ఓం, దీపాలి రాజ్‌పుత్, ఐశ్వర్య, రాజీవ్ కనకాల తదితరులు నటించిన చిత్రం ‘నాతో నేను’. జులై 7న విడుదల కానుంది. తుర్లపాటి శాంతికుమార్ దర్శకత్వం వహించగా ప్రశాంత్ టంగుటూరి నిర్మాతగా వ్యవహరించారు. 

    ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు

    TitleCategoryLanguagePlatformRelease Date
    Ishq Next DoorMovieHindiJio CinemaJuly 3
    GoodNightMovieTamilDisney + HotstarJuly 3
    BabylonMovieEnglishAmazon PrimeJuly 5
    Sweet Kaaram CoffeeWeb SeriesTeluguAmazon PrimeJuly 6
    The Pope’s ExorcistMovieEnglishNetflixJuly 7
    DeepFakeLoveWeb SeriesEnglishNetflixJuly 7
    AdhuraWeb SeriesHindiAmazon PrimeJuly 7
    TarlaMovieHindiZee5July 7
    IB 71MovieHindiDisney + HotstarJuly 7
    FarhanaMovieTamil/TeluguSony LivJuly 7
    BlindMovieHindiJio CinemaJuly 7

    APP

    ఈ వారం(July 7) బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాలు సందడి చేయబోతున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుని థియేటర్ల ముందు అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే పలు చిత్రాల ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. మరి, ఆ సినిమాలతో పాటు ఓటీటీలో సందడి చేయనున్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఏంటో ‘YouSay Web’బటన్‌పై క్లిక్ చేసి తెలుసుకోండి.   

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version