TIGER 3 Review in Telugu: సల్మాన్ ఖాన్ యాక్షన్‌తో అదరగొట్టాడు.. కానీ!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • TIGER 3 Review in Telugu: సల్మాన్ ఖాన్ యాక్షన్‌తో అదరగొట్టాడు.. కానీ!

    TIGER 3 Review in Telugu: సల్మాన్ ఖాన్ యాక్షన్‌తో అదరగొట్టాడు.. కానీ!

    November 12, 2023

    నటీనటులు: సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, రేవతి,  ఇమ్రాన్ హష్మీ,  సిమ్రాన్, రద్ధీ డోంగ్రా,  అనీష్ కురువిల్లా,  కుముద్ మిశ్రా, మాస్టర్ విశాల్ జేత్వా, రణ్వీర్ షోరే.

    డైరెక్టర్: ఆదిత్య చోప్రా

    ప్రొడ్యూసర్: ఆదిత్య చోప్రా

    మ్యూజిక్: తనూజ్ టికు

    ఎడిటర్: రామేశ్వర్ S. భగత్

    స్క్రీన్ ప్లే: శ్రీధర్ రాఘవన్

    సినిమాటోగ్రఫీ: అనయ్ గోస్వామి

    విడుదల తేదీ: 12/11/2023 (దీపావళి రోజున)

    సల్మాన్‌ ఖాన్(TIGER 3 Review in Telugu) లెటెస్ట్ స్పై యాక్షన్ డ్రామా ‘టైగర్ 3’ దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఏక్‌థా టైగర్, టైగర్ జిందాహై సినిమాకు ఇది సీక్వెల్. మొదట వచ్చిన ఈ రెండు చిత్రాలు సూపర్ హిట్ కావడంతో టైగర్ 3పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్, టీజర్‌లో సల్మాన్ మాస్ యాక్షన్, కత్రినా కైఫ్ బ్యూటీ సినిమాపై అంచనాలను పెంచాయి. మరి టైగర్ 3 ఇంతకు ఎలా ఉంది? ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? లేదా అనే విషయాలను ఈ రివ్యూలో చూద్దాం. 

    కథ: 

    అవినాష్ అలియాస్ టైగర్(సల్మాన్ ఖాన్) భారత దేశం తరఫున ‘రా’ ఏజెంట్‌గా పనిచేస్తుంటాడు. ఆయన భార్య జోయా(కత్రినా కైఫ్) పాకిస్థాన్‌కు చెందిన మాజీ ISI ఏజెంట్. అయితే టైగర్ పాకిస్థాన్‌లో రా ఏజెంట్ గోపీ( రణ్వీర్ షోరే)ని ఉగ్రవాదుల నుంచి కాపాడుతాడు. అయితే గోపీ చనిపోయే ముందు జోయా గురించి ఓ నమ్మలేని నిజాన్ని చెబుతాడు. తన భార్య ఐస్ఐ ఏజెంట్ అని తెలుసుకున్న టైగర్ ఏం చేశాడు? అసలు జోయా తన భర్తను ఎందుకు మోసం చేసింది. భారత్- పాకిస్థాన్ ప్రభుత్వాలు వీరిద్దరి కోసం ఎందుకు వెతుకుతాయి అనేది మిగిలిన కథ

    ఎలా ఉందంటే?

    టైగర్ 3 సినిమా.. ఏక్‌ థా టైగర్, టైగర్ జిందా హై రేంజ్‌లో మాత్రం లేదు.  భారీ యాక్షన్ విజువల్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రం అక్కడక్కడ ఆకట్టుకుంటుంది. సినిమాలో శత్రుదేశాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు ‘భార్య భర్తలు’ అయితే అనే పాయింట్ బాగున్నప్పటికీ.. దానికి తగ్గట్టుగా కథనం లేకపోవడం మైనస్ అని చెప్పాలి. సినిమా ఫస్టాఫ్, ఇంటర్వెల్ బ్యాంగ్ సినిమాకు మైనస్. ఎందుకంటే ఈ పార్ట్‌లో కథనం బలహీనంగా ఉంది. అయితే సెకండాఫ్‌లో(TIGER 3 Review in Telugu) వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌ , క్లైమాక్స్ సీన్లు కొద్దిమేరకు మెప్పిస్తాయి. సులువుగా ప్రేక్షకుడు గెస్ చేసే స్క్రీప్ట్‌ను శ్రీధర్ రాఘవన్ రాసుకున్నట్లు తెలుస్తోంది. ఇంకాస్త దీనిపై వర్క్ చేస్తే బాగుండేది. స్పై సినిమాలు అంటే ఆద్యంతం ఉత్కంఠ, ప్రతి సీన్‌లో ట్విస్ట్‌ను ప్రేక్షకుడు ఊహిస్తాడు. కానీ టైగర్ 3 సినిమాలో అవేమి కనిపించలేదు. ప్రేక్షకున్ని సినిమాలో ఎంగేజ్ చేయకుండా కథ సాగిందని చెప్పవచ్చు. సినిమా చివర్లో సల్మాన్‌ ఖాన్‌ను రక్షించేందుకు షారుఖ్‌ ఖాన్ రావడం, క్లైమాక్స్ సీన్‌లో హృతిక్ ఎంట్రీ సీన్లు ప్రేక్షకులను అలరిస్తాయి.

    ఎవరెలా చేశారంటే

    సల్మాన్ ఖాన్ వన్ మ్యాన్ ఆర్మీ షో చేశాడు. టైగర్ పాత్రకు పూర్తి  న్యాయం చేశాడు. తన పాత్రలో జీవించాడు. తన యాక్షన్ స్టైల్‌తో ఇరగదీశాడు. ఆయనపై వచ్చిన కొన్ని ఎలివేషన్‌ సీన్లు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఎమోషనల్ సీన్లలోనూ సల్మాన్ అద్భుతంగా నటించాడు. ఇక సల్మాన్- కత్రినా జంట కూడా స్క్రీన్‌పై ఆకట్టుకుంది. కత్రినా కాస్త ఓల్డ్ లుక్‌లో కనిపించినప్పటికీ యాక్టింగ్ బాగా చేసింది. తన బోల్డ్ లుక్స్‌తో ప్రేక్షకులకు కనువిందు చేసింది. ముఖ్యంగా టవల్ ఫైట్ సీన్‌లో ఆమె అందం యువ ప్రేక్షకులను రంజింపజేస్తుంది. ఇక విలన్‌గా నటించిన ఇమ్రాన్ హష్మీ తన పాత్ర పరిధిమేరకు నటించాడు. రా చీఫ్‌గా రేవతి, పాక్ ప్రైమ్ మినిస్టర్‌గా సిమ్రాన్ మెప్పించింది. క్లైమాక్స్‌లో పఠాన్‌గా వచ్చిన షారుక్ ఖాన్, హృతిక్ రోషన్ సీన్లు సినిమాకే హైలెట్.

    టెక్నికల్ పరంగా

    సాంకేతికంగా టైగర్ 3 సినిమా ఉన్నతంగా ఉంది. అనయ్ గోస్వామి సినిమాటోగ్రఫీ సినిమాకే బాగా ప్లస్ అయింది. యాక్షన్ సీక్వెన్స్‌లో ఆయన పడిన కష్టం తెలుస్తుంది. ఇక తనూజ్ టీకు బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్ అలరిస్తుంది. యాక్షన్ సీన్లను(TIGER 3 Review) ఎలివేట్ చేసిందని చెప్పవచ్చు. డైరెక్టర్ ఆదిత్య చోప్రా ఇంకా బలమైన కథ రాసుకున్నప్పటికీ… అందుకు తగిన సీన్లు, కథనం పెట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. ఉత్కంఠ భరితంగా సాగాల్సి కథనాన్ని ప్రేక్షకుడు ఊహించే విధంగా సాగింది.

    బలాలు

    • సల్మాన్ ఖాన్ యాక్షన్ సీన్లు, 
    • కత్రినా కైఫ్ బోల్డ్ లుక్స్
    • షారుఖ్‌ ఖాన్‌ కెమియో రోల్

    బలహీనతలు

    • స్క్రీన్ ప్లే
    • సహజత్వం లేని కొన్ని సీన్లు
    • ప్రేక్షకుడు ఊహించదగిన కథనం

    చివరగా:

    హై వోల్టేజ్ యాక్షన్ స్పై మూవీగా వచ్చిన టైగర్ 3లో.. సల్మాన్ ఖాన్ యాక్షన్ సీన్లు, కత్రినా కైఫ్ బోల్డ్ లుక్స్, షారుఖ్‌ ఎంట్రీ ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఈ సినిమా సల్మాన్ ఖాన్‌ ఫ్యాన్స్‌తో పాటు ఇతర యాక్షన్ సీక్వెన్స్ ఇష్టపడే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మిగతా సగటు ప్రేక్షకులకు సినిమా నచ్చకపోవచ్చు.

    రేటింగ్: 2.5/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version