Tiger Nageswara Rao Movie Review: రవితేజ యాక్షన్ ఫీస్ట్.. దసరా బరిలో విజేతగా నిలిచిన టైగర్ నాగేశ్వరరావు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Tiger Nageswara Rao Movie Review: రవితేజ యాక్షన్ ఫీస్ట్.. దసరా బరిలో విజేతగా నిలిచిన టైగర్ నాగేశ్వరరావు

    Tiger Nageswara Rao Movie Review: రవితేజ యాక్షన్ ఫీస్ట్.. దసరా బరిలో విజేతగా నిలిచిన టైగర్ నాగేశ్వరరావు

    October 20, 2023

    మాస్ మహారాజా రవితేజ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘టైగర్ నాగేశ్వరరావు’ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. విక్రమార్కుడు, రావణాసుర, శంభో శివ శంభో వంటి సీరియస్ క్యారెక్టర్ల తర్వాత మరోసారి సీరియస్ యాక్టింగ్‌కు స్కోప్‌ ఉన్న చిత్రంలో రవితేజ నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్‌లో కూడా రవితేజ లుక్స్, యాక్షన్ సీన్లు అంచనాలను మరింత పెంచాయి. మరోవైపు ఇంతవరకు ఎవరు టచ్ చేయని స్టువర్ట్‌పురం సబ్జెక్ట్ కావడంతో తెలుగు ప్రేక్షకుల్లో సినిమాపై హైప్ నెలకొంది. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో నిర్మించారు. మరి ఇంత హైప్ సృష్టించిన టైగర్ నాగేశ్వరరావు ప్రేక్షకుల అంచనాలను అందుకుందా? దసరా బరిలో నిలిచిన ఈ సినిమా విజయం సాధించిందా? అనే విషయాలను YouSay రివ్యూలో చూద్దాం.  

    తారాగణం: రవితేజ, గాయత్రీ భరద్వాజ్, నుపూర్‌ సనన్‌, రేణూ దేశాయ్, నాజర్, అనుపమ్ ఖేర్, జిషు సేన్ గుప్తా

    డైరెక్టర్: వంశీ కృష్ణా

    నిర్మాత: అభిషేక్ అగర్వాల్

    సినిమాటోగ్రఫీ: మది ఐ.ఎస్.సి

    ఫైట్స్: రామ్-లక్ష్మణ్

    సంగీతం: జీవీ ప్రకాశ్

    విడుదల తేదీ: అక్టోబర్‌ 20, 2023 

    కథ:

    టైగర్ నాగేశ్వరరావు అనే గజదొంగ ధనికుల దగ్గర అందినంత బంగారం, డబ్బు దోచుకుంటూ పేదలకు పంచుతుంటాడు. అతనికి పోలీసులు సైతం భయపడుతుంటారు. అయితే స్టువర్టుపురంలో మాములు వ్యక్తిగా ఉన్న నాగేశ్వరరావు గజదొంగగా ఎలా మారాడు. అందుకు దారితీసిన పరిస్థితులు ఏమిటి? తాను దోచుకున్న డబ్బు ఏంచేశాడు? స్టువర్టుపురంలో ఎలాంటి మార్పుని అతను తీసుకు వస్తాడు..? టైగర్ నాగేశ్వరరావును పట్టుకోవాలని ప్రధానమంత్రి ఎందుకు ఆర్డర్ వేశారు?  చివరకు టైగర్ నాగేశ్వరరావును పోలీసులు పట్టుకున్నారా? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలియాలంటే థియేటర్లకు వెళ్లి సినిమా చూడాల్సిందే.

    ఎలా ఉందంటే?

    ఇక సినిమా విషయానికి వస్తే… 1970లో స్టువర్టుపురంలో పేరు మోసిన గజ దొంగ టైగర్ నాగేశ్వరరావు. ఆయన జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. కానీ కథలో భారీగానే మార్పులు చేశారు వంశీ. సినిమా స్టార్టింగ్‌ నుంచే ఆసక్తికరంగా ఉంటుంది. ఫస్టాప్‌లో కొన్ని కామెడీ సీన్లు, యాక్షన్ సీన్లు పర్వాలేదనిపిస్తాయి. ఊరిలో జరిగే సంఘటనలను చక్కగా చూపించారు.  సారా(నుపురు సనన్) టైగర్ నాగేశ్వరరావు మధ్య జరిగే లవ్ ట్రాక్.. ఇడియట్ సినిమా సీన్లను గుర్తు చేస్తుంది. అయితే మాములు జీవితం సాగిస్తున్న నాగేశ్వరరావు దొంగగా ఎలా మారాడు అనే సంఘటనలను డైరెక్టర్ వంశీ బాగా డీల్ చేశాడు అని చెప్పవచ్చు. సెకండాఫ్‌లో రాబిన్ హుడ్ స్టైల్‌కి మూవీ ట్రాక్ వెళ్తుంది. ధనికుల నుంచి టైగర్ నాగేశ్వరరావు అందినంత దోచేస్తుంటాడు. అలా దోచుకున్న సొమ్మును టైగర్ నాగేశ్వరరావు ఏం చేస్తాడు అనేది కూడా బాగా చూపించారు. సినిమా చూస్తున్నంత సేపూ 1970 దశకంలోని వాతావరణానికి ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు.  అయితే టైగర్ నాగేశ్వరరావు అంటే కేవలం దొంగనే కాదు.. ఆయనలోని పాజిటివ్ కోణాన్ని చూపించడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు.

    ఎవరెలా చేశారంటే

    రవితేజ మరోసారి తన యాక్షన్‌ పవర్‌ను బయట పెట్టాడు. లుక్స్, స్క్రీన్ ప్రజెన్స్‌తో అదరగొట్టాడు. రవితేజ చెప్పిన డైలాగ్స్ థియేటర్స్‌లో ప్రేక్షకులను అలరిస్తాయి. ఎమోషనల్ సన్నివేశాల్లో రవితేజ జీవించేశాడు. యాక్షన్ సిక్వెన్స్‌ అదిరిపోయాయి. ఇక హీరోయిన్ నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్‌లు తమకు ఇచ్చిన రోల్స్‌లో మెప్పించారు. టైగర్ నాగేశ్వరరావు గజ దొంగ గ్యాంగ్‌లో యాక్ట్ చేసినవారు కూడా ఇంప్రెస్ చేస్తారు. ఈ సినిమాలో స్పేషల్ రోల్ చేసిన రేణు దేశాయ్ సామాజిక కార్యకర్తగా ఆకట్టుకుంది. ఆమె పాత్ర సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. నాజర్, జిషు సేన్ గుప్తా తమ పాత్రల్లో రాణించారు. అనుపమ్ ఖేర్ కూడా తన పాత్రకు న్యాయం చేశాడు. 

    డైరెక్షన్ ఎలా ఉందంటే?

     ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ అనే చిన్న సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన వంశీకృష్ణ .. కెరీర్‌ ఆరంభంలోనే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తీయడంలో దాదాపుగా సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు. ప్రతి సీన్‌ను జాగ్రత్తగా రాసుకున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఫ్రేమ్‌ ఫ్రేష్‌గా తీశాడు. రవితేజను టైగర్ నాగేశ్వరరావుగా చూపించడంలో విజయం సాధించాడు. ఫస్టాఫ్‌ను సెకండాఫ్‌తో కనెక్ట్ చేసిన విధానం బాగుంది. అయితే సెకండాఫ్‌లో లాగ్ అనిపిస్తుంది. కొన్ని సీన్లు తీసివేస్తే బాగుండు అనిపిస్తుంది. అలాగే నుపుర్- రవితేజ మధ్య వచ్చే లవ్ ట్రాక్ అంతగా ఆకట్టుకోదు. సింక్ లేకుండా వచ్చే పాటలు కూడా చికాకు తెప్పిస్తాయి. సెకండాఫ్‌పై ఇంకొంచెం శ్రద్ద పెడితే బాగుండు అనిపిస్తుంది. మొత్తానికి తాను అనుకున్న కథను ప్రేక్షకులకు చెప్పడంలో మాత్రం డైరెక్టర్ వంశీ సక్రెస్ అయ్యాడు.

    టెక్నికల్ పరంగా..

    నిర్మాణ విలువల పరంగా టైగర్ నాగేశ్వరరావు సినిమా చాలా రిచ్‌గా కనిపిస్తుంది. సినిమా కోసం పెట్టిన భారీ ఖర్చు సీన్లలో ప్రతిబింబిస్తుంది. కొన్ని యాక్షన్ సన్నివేశాలకు గూస్ బంప్స్ వస్తాయి. ఇక టాలెంటెడ్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాశ్ అందించిన సంగీతం పర్వాలేదు. పాటలు అంత ఆకట్టుకోకపోయినా… బీజీఎం మెప్పిస్తుంది. యాక్షన్ సిక్వెన్స్, రవితేజ డైలాగ్స్‌కు కొట్టిన BGM బాగుంది. మది ఐ.ఎస్.సి అందించిన సినిమాటోగ్రఫి, రామ్-లక్ష్మణ్ ఫైట్స్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. 

    బలాలు

    రవితేజ యాక్టింగ్

    యాక్షన్ సిక్వెన్స్

    డైరెక్షన్

    బలహీనతలు

    సింక్‌ లేకుండా మధ్య మధ్యలో వచ్చే పాటలు

    సెకండాఫ్‌లో కొన్ని లాగ్ సీన్లు

    చివరగా:

    టైగర్ నాగేశ్వరరావు అంటే కేవలం గజ దొంగ కథ మాత్రమే కాదు… ఓ పాజిటివ్ వైబ్రెషన్. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే సినిమా మంచి వినోదాన్ని పంచుతుంది.

    రేటింగ్: 3/5

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version