యువ నటుడు సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేసిన ‘డీజే టిల్లు’ (DJ Tillu), టిల్లు స్క్వేర్ (Tillu Square) చిత్రాలు టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా సిద్ధు నటన, వాయిస్ మాడ్యూలేషన్‌కు తెలుగు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ముఖ్యంగా టిల్లు పాత్రకు యూత్ చాలా బాగా కనెక్ట్ అయ్యారు. అయితే ఈ చిత్రాల్లో హీరోతో పాటు హీరోయిన్లు పాత్రలు కూడా అంతే క్రేజ్‌ను సంపాదించాయి. ఫస్ట్ మూవీలో రాధిక పాత్రలో నేహా శెట్టి మెస్మరైజ్ చేయగా.. సీక్వెల్‌లో లిల్లీలో పాత్రలో అనుపమా కనిపించి మెప్పించింది. దీంతో తర్వాతి చిత్రం టిల్లు క్యూబ్‌లో ఎవరు నటిస్తారన్న దానిపై ప్రతీ ఒక్కరిలోనూ ఆసక్తి ఏర్పడింది. అయితే మూడో పార్ట్‌లో సిద్ధూకు జోడీగా స్టార్ హీరోయిన్‌ను లాక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
సిద్ధూకి జోడీగా బుట్టబొమ్మ!
ఇటీవల విడుదలైన టిల్లు స్క్వేర్ (Tillu Square) చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. రూ.125 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి అదరగొట్టింది. ఇందులో హీరోయిన్‌గా చేసిన అనుపమా.. తన హాట్‌షోతో అదరగొట్టింది. కాగా, ఈ సినిమాకు సీక్వెల్‌గా టిల్లు క్యూబ్ రూపొందించనున్నట్లు దర్శక నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. అయితే లెటేస్ట్ బజ్ ప్రకారం మూడో పార్ట్‌లో ‘పూజా హెగ్డే’ (Pooja Hegde)ను హీరోయిన్‌గా తీసుకోబోతున్నట్లు సమాచారం. ఈ ఆఫర్ ఆమె వద్దకు కూడా వెళ్లిందని అంటున్నారు. హిట్ సిరీస్ కావడం, తన రోల్‌కు మంచి ఇంపార్టెన్స్ ఉండటంతో పూజ కూడా వెంటనే ఓకే చేసిందనే టాక్ నడుస్తోంది. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానున్నట్లు తెలుస్తోంది.
సమంత, తమన్నా లేనట్లే!
‘టిల్లు స్క్వేల్’ భారీ సక్సెస్‌తో మూడో పార్ట్‌ను పెద్ద ఎత్తున నిర్మించాలని మేకర్స్ భావించారు. ఇందులో భాగంగా టిల్లు క్యూబ్ సినిమా కోసం తొలుత ఇద్దరు స్టార్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. సమంత (Samantha), తమన్నా (Tamannaah) పేర్లను పార్ట్ -3 కోసం పరిశీలిస్తున్నారని పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి. వీరిలో ఒకరు దాదాపు ఖరారవుతారంటూ కూడా ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరిగింది. కానీ, చివరకూ ‘పూజా హెగ్డే’ వైపే చిత్ర యూనిట్ మెుగ్గు చూపినట్లు తెలుస్తోంది. దీంతో సిద్ధు జొన్నలగడ్డ, పూజా పెయిర్ ఎలా ఉంటుందోనన్న ఆసక్తి ఫ్యాన్స్‌లో మెుదలైంది.
పూజాకు మంచి ఛాన్స్!
ఒకప్పుడు బ్లాక్ బాస్టర్ హిట్స్‌తో దూసుకెళ్లిన పూజా హెగ్డేకు గత కొంతకాలంగా టైమ్ అసలు కలిసి రావడం లేదు. ఈ భామ నటింటిన వరుస సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. దీంతో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన ఈ అమ్మడు.. ఫ్యామిలీతో ఖాళీ సమయాన్ని ఎంజాయ్ చేస్తోంది. అదే సమయంలో ఓ మంచి అవకాశం కోసం ఎదురుచూస్తోంది. ఈ తరుణంలో పూజా హెగ్డేకు ‘టిల్లు క్యూబ్’లో ఆఫర్ రావడం నిజంగా లక్కీ అనే చెప్పాలి. పూజా ఈ మూవీలో నటిస్తే కెరీర్ పరంగా ఆమెకు తప్పకుండా ప్లస్ అవుతుంది. సిద్ధు పక్కన రాధికగా నటిస్తే తిరిగి యూత్‌లో క్రేజ్ సంపాదించే అవకాశం ఉంది.
టిల్లు క్యూబ్ కథ అదే!
డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలకు ఇంచుమించు ఒకే తరహా కథతో రూపొందాయి. తొలి భాగం.. ఓ అమ్మాయి మోసం చేసే పాయింట్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. టిల్లు స్క్వేర్‌లో కూడా అదే పాయింట్‌తో పాటు మాఫియా డాన్ మిషన్ లాంటిది యాడ్ చేశారు. ఈసారి టిల్లు క్యూబ్ మాత్రం మరో లెవల్‌లో ఉంటుందట. టిల్లుకి సూపర్ పవర్స్ వస్తే ఏం చేస్తాడు? ఎలా బిహేవ్ చేస్తాడు? టిల్లు సూపర్ హీరో అయితే ఎలా ఉంటుంది? అనే పాయింట్ మీద కథ ఉండబోతుందని కథానాయకుడు సిద్ధూ స్వయంగా తెలిపాడు. త్వరలోనే ఆ స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలుపెడతానని గతంలో స్పష్టం చేశాడు.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!