గత దశాబ్దాల కాలంలో తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. వీటిలో కొన్నింటికి సీక్వెల్స్ సైతం ప్రేక్షకులను పలకరించాయి. అయితే తొలి భాగంతో పోలిస్తే (Tollywood Disaster Sequels) సెకండ్ పార్ట్ ఆడియన్స్ పెద్దగా ఆకట్టుకులేకపోయాయి. తొలి సినిమా మానియాను కొనసాగించడంలో విఫలమయ్యాయి. ఎన్నో అంచనాలతో థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పరిచాయి. ఇంతకీ ఆ సినిమాలు ఏవి? అందులో నటించిన స్టార్ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం.
మనీ మనీ మోర్ మనీ
జేడీ చక్రవర్తి హీరోగా చేసిన మనీ మూవీ సిరీస్‌లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి. మనీ (1993), మనీ మనీ (1994) పేరుతో వచ్చిన ఆ చిత్రాలు మంచి హిట్‌ను సొంతం చేసుకున్నాయి. అయితే ఆ చిత్రాలకు కొనసాగింపుగా 2011లో వచ్చిన ‘మనీ మనీ మోర్ మనీ’ (Money Money More Money) మాత్రం ఆడియన్స్‌ను తీవ్రంగా నిరాశ పరిచింది. బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవి చూసింది.
శంకర్‌దాదా జిందాబాద్
మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమాల్లో శంకర్‌దాదా M.B.B.S ఒకటి. 2004లో విడుదలైన ఆ చిత్రం చిరుకి మంచి పేరు తీసుకొచ్చింది. అంతేగాక కాసుల వర్షం కురిపించింది. ఈ నేపథ్యంలో దీనికి కొనసాగింపుగా ‘శంకర్‌దాదా జిందాబాద్’ (Shankar Dada Zindabad) తెరకెక్కించారు. డిఫరెంట్ స్టోరీతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచింది.
కిక్ 2
రవితేజ కెరీర్‌లోని టాప్-5 హిట్ చిత్రాల్లో ‘కిక్’ (Kick Movie) సినిమా కచ్చితంగా ఉంటుంది. 2009లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్‌బాస్టర్ హిట్ అందుకుంది. ఈ నేపథ్యంలో దీనికి సీక్వెల్‌గా 2015లో ’కిక్-2’ (Kick 2)వచ్చింది. అయితే సినిమా ఆశించిన మేర విజయాన్ని అందుకోలేకపోయింది. రవితేజ ఫ్లాపు చిత్రాల్లో ఒకటిగా మిగిలిపోయింది.
సర్దార్ గబ్బర్ సింగ్
పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బాస్టర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా ఎన్నో అంచనాలతో వచ్చిన ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ (Sardaar Gabbar Singh) మాత్రం ఆ స్థాయిలో ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది. 2016లో వచ్చిన ఈ చిత్రం.. పవన్ డిజాస్టర్ చిత్రాల్లో ఒకటిగా మిగిలిపోయింది.
మన్మథుడు 2
అక్కినేని నాగార్జున హీరోగా చేసిన ఎవర్‌గ్రీన్ చిత్రాల్లో ‘మన్మథుడు’ (Manmadhudu) ఒకటి. ఈ సినిమాను ఇప్పటికీ చాలామంది చూస్తుంటారు. ఇందులో నాగార్జున కామెడీ టైమింగ్‌ను, బ్రహ్మీ కాంబినేషన్‌లో వచ్చే సీన్లను ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఈ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన ‘మన్మథుడు 2’ (Manmadhudu 2) మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో దారుణంగా విఫలైంది.
గాయం 2
1993లో జగపతి బాబు హీరోగా రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన గాయం (Gayam) చిత్రం బ్లాక్ బాస్టర్‌గా నిలిచింది. ఆరు నంది అవార్డులను సైతం కొల్లగొట్టింది. అటువంటి ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన గాయం-2 (Gayam 2) మాత్రం బాక్సాఫీస్ వద్ద చతికలపడింది. ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైంది. 2010లో వచ్చిన ఈ సీక్వెల్ చిత్రానికి ప్రవీణ్ శ్రీ దర్శకత్వం వహించారు.
ఆర్య-2
అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబోలో వచ్చిన మెుట్టమెుదటి చిత్రం ‘ఆర్య’ (Arya Movie). ఫీల్‌గుడ్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం.. బన్నీతో పాటు సుకుమార్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. దీనికి సీక్వెల్‌గా వచ్చిన ‘ఆర్య 2’ (Arya 2) అదే స్థాయిలో మెప్పించలేకపోయింది. మోస్టరు టాక్ మాత్రమే తెచ్చుకుంది.
చంద్రముఖి 2 & నాగవల్లి
తెలుగులో వచ్చిన టాప్-5 హారర్ చిత్రాల్లో రజనీకాంత్ హీరోగా ‘చంద్రముఖి’ కచ్చితంగా ఉంటుంది. ఈ సినిమా అప్పట్లో విపరీతంగా భయపెట్టింది. చంద్రముఖి (Chandramukhi) పాత్రలో జ్యోతిక అదరగొట్టింది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన చంద్రముఖి 2 (Chandramukhi 2), నాగవల్లి (Nagavalli) చిత్రాలు మాత్రం తీవ్రంగా నిరాశపరిచాయి. నాగవల్లిలో వెంకటేష్ లీడ్ రోల్‌లో నటించగా.. చంద్రముఖి 2లో రాఘవ లారెన్స్ చేశాడు.
రోబో 2
రజనీకాంత్ హీరోగా డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ‘రోబో’ (Robo) చిత్రం.. 2010లో ఏ స్థాయి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అద్భుతమైన గ్రాఫిక్స్ మాయజాలంతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనక వర్షాన్ని కురిపించింది. దీనికి అనుసంధానంగా 2018లో రిలీజైన ‘రోబో 2’ (Robo 2) అందరి అంచనాలను తలకిందులు చేసింది. ఇందులో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో కనిపించాడు.
సత్య 2
రామ్‌గోపాల్ వర్మను బాలీవుడ్‌లో స్టార్ డైరెక్టర్‌గా చేసిన చిత్రం ‘సత్య’ (Sathya). ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన సత్య-2 (Sathya 2)మాత్రం ఆ స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఇందులో శర్వానంద్ హీరోగా నటించాడు. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించాడు.
వెన్నెల 1/2
రాజా హీరోగా దేవకట్టా దర్శకత్వంలో వచ్చిన ‘వెన్నెల’ (Vennela) చిత్రం.. 2005లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ద్వారానే వెన్నెల కిషోర్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. అయితే ఏడేళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ‘వెన్నెల 1/2’ (Vennela 1/2) దారుణంగా పరాజయాన్ని మూటగట్టుకుంది. అయితే ఈ సినిమాకు వెన్నెల కిషోర్ దర్శకత్వం వహించడం విశేషం.
అవును 2
విభిన్నమైన హారర్ కథాంశంతో వచ్చిన ‘అవును’ (Avunu).. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకుంది. డైరెక్టర్‌గా రవిబాబుకు మంచి పేరు తీసుకొచ్చింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ‘అవును 2’ (Avunu 2) మాత్రం బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది.
మంత్ర 2
కథానాయిక చార్మి చేసిన మరుపురాని చిత్రాల్లో ‘మంత్ర’ (Mantra). హారర్ & సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం మ్యాసివ్ విజయాన్ని అందుకుంది. 2007లో వచ్చిన ఈ చిత్రానికి ఓషో తులసి రామ్ దర్శకత్వం వహించాడు. అయితే దీనికి అనుసంధానంగా వచ్చిన ‘మంత్ర 2’ (Mantra 2) మాత్రం చార్మి ఆశలను అడియాశలు చేసింది.