Top 10 Hair Dryers India: మీ జుట్టును క్షణాల్లో స్టైలిష్‌గా మార్చే క్రేజీ హెయిర్‌ డ్రైయర్స్ ఇవే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Top 10 Hair Dryers India: మీ జుట్టును క్షణాల్లో స్టైలిష్‌గా మార్చే క్రేజీ హెయిర్‌ డ్రైయర్స్ ఇవే!

    Top 10 Hair Dryers India: మీ జుట్టును క్షణాల్లో స్టైలిష్‌గా మార్చే క్రేజీ హెయిర్‌ డ్రైయర్స్ ఇవే!

    September 24, 2023

    స్నానం చేసిన తర్వాత చాలా మంది జట్టు ఆరబెట్టేందుకు తీవ్రంగా శ్రమిస్తుంటారు. మహిళలైతే ఇంకా ఎక్కువ ఇబ్బందులు పడుతుంటారు. ఫ్యాన్‌ కింద నిలబడటం, తలకు టవల్‌ను చుట్టుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే అర్జెంట్‌గా ఆఫీసుకు లేదా ఫంక్షన్‌కు వెళ్లాల్సి వచ్చినప్పుడు వారి బాధ వర్ణనాతీతంగా ఉంటుంది. కాబట్టి అటువంటి సమయాల్లో హెయిర్‌ డ్రైయర్స్‌ అవసరం. అవి జుట్టును పొడిగా చేయడమే కాకుండా ఆకర్షణీయంగా మారుస్తుంది. జుట్టును పట్టులా చేయగలిగే సామర్థ్యం హెయిర్‌ డ్రైయర్లకు ఉంది. ప్రస్తుతం చాలా రకాల హెయిర్‌ డ్రైయర్లు మార్కెట్‌లో ఉన్నాయి. వాటిలో టాప్‌-10 లిస్ట్‌ను YouSay మీ ముందుకు తీసుకొచ్చింది. అవేంటో ఒక లుక్కేయండి.

    PHILIPS Hp8100/46 Hair Dryer

    మార్కెట్‌లో అందుబాటులో ఉన్న హెయిర్‌ డ్రైయర్లలో ‘PHILIPS Hp8100/46 Hair Dryer’ కు మంచి గుడ్‌విల్‌ ఉంది. ఇది తడి జట్టును వేగంగా పొడిబారేలా చేస్తుంది. రెండు సంవత్సరాల వారంటీతో PHILIPS దీన్ని తీసుకొచ్చింది. అమెజాన్‌లో రూ.810 లకు ఇది లభ్యమవుతోంది. 

    Havells HD3151

    హావెల్స్ (Havells) కంపెనీ నుంచి కూడా మంచి హెయిర్‌ డ్రైయర్‌ అందుబాటులో ఉంది. ‘Havells HD3151 Foldable Hair Dryer’కు యూజర్ల నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. దీని అసలు ధర రూ.1,415 కాగా, అమెజాన్‌ దీనిపై 28 శాతం డిస్కౌంట్‌ ప్రకటించింది. ఫలితంగా ఇది రూ.1020కు అందుబాటులోకి వచ్చింది. 

    Havells HD3162 Men’s 

    హావెల్స్ కంపెనీ.. మగవారి కోసం ప్రత్యేకంగా ఓ హెయిర్‌ డ్రైయర్‌ను రిలీజ్‌ చేసింది. ‘Havells HD3162 Men’s పేరుతో ఇది మార్కెట్‌లో అందుబాటులో ఉంది. అమెజాన్‌లో దీని ధర రూ.1,299గా ఉంది. 

    AGARO HD-1120 

    ఇది 2000 Watts AC ప్రీమియర్‌ మోటర్‌తో వర్క్‌ చేస్తుంది. వేడి, చల్లని గాలిని ఈ హెయిర్‌ డ్రైయర్‌ ఉత్పత్తి చేస్తుంది. స్త్రీ, పురుషులు ఇద్దరు ఎంతో తేలిగ్గా దీన్ని వినియోగించవచ్చు. ఆ తర్వాత ఈజీగా డ్రైయర్‌ను క్లీన్‌ చేసుకోవచ్చు. ఆమెజాన్‌లో ఇది రూ.1,499 అందుబాటులో ఉంది. 

    Philips Essential Care Hair Dryer

    ఈ హెయిర్‌ డ్రైయర్‌ను థర్మోప్రొటెక్ట్‌ సెట్టింగ్‌తో తీసుకొచ్చారు. ఇది కూడా వేడి, చల్లటి గాలిని ఉత్పత్తి చేస్తుంది. తడి జట్టును వెంటనే పొడిబారేలా చేస్తుంది. దీని అసలు ధర రూ.1,495 కాగా అమెజాన్‌ దీనిపై 17% రాయితీ ప్రకటించింది. ఫలితంగా దీన్ని రూ.1,241కే కొనుగోలు చేయవచ్చు.

     VEGA Insta Glam Foldable

    తక్కువ బడ్జెట్‌లో హెయిర్‌ డ్రైయర్‌ కోరుకునేవారు ‘VEGA Insta Glam Foldable’ను పరిశీలించవచ్చు. ఇది రూ.512 లకే అమెజాన్‌లో అందుబాటులో ఉంది. తెలుగు, పింక్‌ కలర్స్‌లో మీకు నచ్చిన దానిని ఎంపికచేసుకోవచ్చు. 

    Wahl 5439-024 Super Dry

    నాణ్యవంతమైన ప్రొఫేషనల్‌ హెయిర్‌ డ్రైయర్‌ను కోరుకునే వారు ‘Wahl 5439-024 Super Dry’ను ట్రై చేయవచ్చు. ఇది 2200 WATT పవర్‌ఫుల్‌ AC మోటర్‌తో పనిచేస్తుంది. ఇందులో 3 రకాల హీట్‌ సిట్టింగ్స్‌ ఉన్నాయి. దీని అసలు ధర రూ.3,999. దీనిని అమెజాన్‌ 35% రాయితీతో రూ.2,599కు అందిస్తోంది. 

    Morphy Richards Idazzle 

    మార్కెట్‌లో లభిస్తోన్న క్వాలిటీ హెయిర్‌ డ్రైయర్లలో ‘Morphy Richards Idazzle’ ఒకటి. ఇందులో కూల్‌ ఎయిర్‌ మోడ్‌ ఆప్షన్‌ కూడా ఉంది. దీనిపై అమెజాన్‌ 40% డిస్కౌంట్‌ ప్రకటించింది. దీంతో అసలు ధర రూ.1,495 నుంచి రూ.897కు దిగివచ్చింది. 

    Beurer HC 80 2200 

    ప్రస్తుతం మార్కెట్‌లో ‘Beurer HC 80 2200’ హెయిర్‌ డ్రైయర్‌ బాగా సేల్‌ అవుతోంది. ఇది 3 Heat , 2 Blower సెట్టింగ్స్‌ను కలిగి ఉంది. దీని అసలు ధర రూ.5,950 కాగా అమెజాన్‌ దీనిపై 70% రాయితీ ఇచ్చింది. దీంతో ఈ డ్రైయర్‌ రూ.1,785కే అందుబాటులోకి వచ్చింది.

     

    Syska 1200 Watts Hair Dryer 

    ఇది సైస్కా బ్రాండ్‌కు చెందిన చాలా తేలికైన హెయిర్ డ్రైయర్. ఇది హీట్ బ్యాలెన్స్ టెక్నాలజీతో రూపొందింది. ఇది తక్షణ వేడిని అందిస్తుంది. దీని కారణంగా తక్కువ సమయంలోనే జుట్టును ఆరబెట్టవచ్చు. తద్వారా ఆకర్షణీయమైన రూపాన్ని పొందవచ్చు. అమెజాన్‌లో ఇది రూ.799లకు లభిస్తోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version