Top 5 Telugu Serial Actress: సీరియల్స్‌ చూడటం లేదా? అయితే ఈ కుర్ర అందాలు మిస్‌ అవుతున్నట్లే!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Top 5 Telugu Serial Actress: సీరియల్స్‌ చూడటం లేదా? అయితే ఈ కుర్ర అందాలు మిస్‌ అవుతున్నట్లే!

    Top 5 Telugu Serial Actress: సీరియల్స్‌ చూడటం లేదా? అయితే ఈ కుర్ర అందాలు మిస్‌ అవుతున్నట్లే!

    February 20, 2024

    ఈ జనరేషన్‌ యూత్‌కు సినిమాలు, వెబ్‌సిరీస్‌లపై ఉన్న ఆసక్తి.. టెలివిజన్‌లో వచ్చి సీరియళ్లపై ఉండదు. సీరియళ్లలో ఉండే సాగదీత, సెంటిమెంట్‌ వారికి పెద్దగా రుచించదు. దీంతో ఇంట్లో ఎవరైనా సీరియల్స్ పెడితే వెంటనే ముఖం చిట్లిస్తుంటారు. రిమోట్‌ తీసుకొని ఛానెల్‌ మార్చేస్తుంటారు. అయితే వారికి తెలియని విషయం ఏంటంటే ఇప్పుడు సీరియళ్లలోనూ అందమైన భామలు తళుక్కుమంటున్నారు. హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గని గ్లామర్‌తో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. అందం, అభినయంతో వీక్షకులను కట్టిపడేస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో టాప్‌-5 సీరియల్ భామలు ఎవరో ఇప్పుడు చూద్దాం. 

    Ayesha Zeenath

    స్టార్‌ మా (Star maa)లో వస్తున్న ‘ఊర్వశివో రాక్షసివో’ (Urvasivo Rakshasivo) సీరియల్ ట్రెండింగ్‌లో ఉంది. ఇందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో ప్రగతి నటించగా.. ఆమెను ఢీకొట్టే హీరోయిన్‌ దుర్గ పాత్రలో అయేషా జీనత్ (Ayesha Zeenath) నటిస్తోంది. ప్రస్తుతం ఈ సీరియల్‌ మంచి టీఆర్పీ రేటింగ్‌తో దూసుకెళ్తోంది.

    కేరళకు చెందిన ఈ బ్యూటీ ‘రెడీ స్టడీ పో’ అనే రియాలిటీ షోతో బుల్లితెరపై కెరీర్‌ ప్రారంభించింది. ఆ తర్వాత జీ తమిళ్‌ లో వచ్చిన ‘సత్య’ అనే సీరియల్‌ ద్వారా మంచి గుర్తింపు సంపాందించింది.

    సూపర్ క్వీన్ అనే జీ తమిళం రియాలిటీ షోలోనూ పాల్గొన్న అయేషా.. అందులో రెండో స్థానంలో నిలిచి మరింత పాపులర్ అయ్యింది. 

    అలాగే తమిళ్ బిగ్ బాస్ సీజన్ 6లో కంటెస్టెంట్‌గా మంచి పేరు తెచ్చుకుంది. హోస్ట్ కమల్‌తో గొడవ పెట్టుకుని అప్పట్లో అయేషా బాగా పాపులర్ అయింది.

    Raksha Goud

    కన్నడ నటి రక్ష గౌడ్‌ (Raksha Goud).. తెలుగులో వస్తోన్న ‘గుప్పెడంత మనసు’ (Guppedantha Manasu) సీరియల్ ద్వారా చాలా పాపులర్‌ అయ్యింది. ఇందులో వసుధార పాత్రలో అందరి మనసులను దోచుకుంది. 

    ఈమె లీడ్‌ రోల్‌లో చేస్తున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌ రీసెంట్‌గా 1000 ఎపిసోడ్‌లను పూర్తి చేసింది. ఇందులో ఈమె క్రెడిట్ ఎంతగానో ఉందని చెప్పవచ్చు. 

    2017లో కన్నడ సీరియల్‌ ‘రాధా రమణ’తో రక్ష తన బుల్లితెర కెరీర్‌ను ప్రారంభించింది. తెలుగులో కృష్ణవేణి అనే సీరియల్‌ చేసినప్పటికీ రక్షకు పెద్దగా పేరు రాలేదు.

    గుప్పెడంత మనసు సీరియల్‌తో ఈ భామ గ్రాఫ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇప్పుడు ఎక్కడికెళ్లినా తనను గుర్తుపడుతున్నారని ఆమె ఓ ఇంటర్యూలో చెప్పారు. 

    Jyothi Rai

    ‘గుప్పెడంత మనసు’ (Guppedantha Manasu) సీరియల్ ద్వారా పాపులర్ అయిన మరో కన్నడ నటి జ్యోతి రాయ్‌ (Jyothi Rai). ఇందులో జగతి పాత్రపై ఆమె చెరగని ముద్ర వేసింది. 

    కర్ణాటకకు చెందిన జ్యోతి రాయ్‌.. తెలుగు, కన్నడ సీరియల్స్‌లలో నటిస్తూ మంచి పేరు సంపాదించింది. ముచ్చటైన చీరకట్టులో తల్లి పాత్రలు పోషిస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది.

    అయితే సోషల్‌ మీడియాలో మాత్రం జ్యోతి రాయ్‌ను ఫైర్ బ్రాండ్‌గా చెప్పవచ్చు. ఆమె ఎప్పటికప్పుడు గ్లామర్ ఫొటోలను షేర్‌ చేస్తూ అందరికీ షాక్ ఇస్తుంటుంది.

    ప్రస్తుతం ఈ భామ కన్నడ సినిమాలతో పాటు.. ‘ప్రెట్టి గర్ల్‌’ (Pretty Girl) అనే సిరీస్‌లోనూ నటిస్తున్నట్లు తెలుస్తోంది. 

    Preethi Sharma

    తెలుగులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మరో పాపులర్‌ నటి ప్రీతి శర్మ (Preethi Sharma). ‘పడమటి సంధ్యా రాగం’ (Padamati Sandhya Ragam) సీరియల్‌లో ఆధ్య పాత్ర ద్వారా ఈ భామ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది.

    ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన ప్రీతి శర్మ.. కలర్స్ తమిళ్‌ సీరియల్‌ ‘ఒరు కాదయి పాడతుమా, సార్‌?’ ద్వారా బుల్లితెరకు పరిచయమైంది. 

    తెలుగులోకి ‘కావ్యాంజలి’ అనే సీరియల్‌ ద్వారా అడుగుపెట్టింది. ఇందులో అంజలి పాత్ర పోషించి అందరి దృష్టిని ఆకర్షించింది. 

    ఈ క్రమంలోనే ‘పడమటి సంధ్యా రాగం’ సీరియల్‌లో లీడ్‌ రోల్‌ సంపాదించి గృహిణుల ఫేవరేట్‌ నటిగా మారిపోయింది. 

    Soundarya Reddy

    ‘పడమటి సంధ్యా రాగం’ (Padamati Sandhya Ragam) అందరి దృష్టిని ఆకర్షించిన మరో నటి ‘సౌందర్య రెడ్డి’ (Soundarya Reddy). ఈ భామ తన అందం, అభినయం, నటనతో బుల్లితెరపై హల్‌చల్‌ చేస్తోంది. 

    కర్ణాటకలోని బెంగళూరు నగరానికి చెందిన ఈ భామ.. ‘రాజీ’ అనే కన్నడ సీరియల్ ద్వారా టెలివిజన్‌లోకి అరంగేట్రం చేసింది. 

    ఆ తర్వాత ‘పడమటి సంధ్యా రాగం’ సీరియల్‌లో అవకాశం దక్కించుకొని.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. 

    బుల్లితెర కెరీర్‌లో ఆమెకు ఇది రెండో సీరియల్ అయినప్పటికీ.. 10 సీరియళ్లకు సరిపడ క్రేజ్‌ను ఈ సుందరి దక్కించుకుంది. తన అందంతో చిన్న స్క్రీన్‌పై మాయ చేస్తోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version