ప్రస్తుతం వాషింగ్ మిషన్స్ ప్రతీ ఇంట్లో సర్వసాధారణంగా మారిపోయాయి. పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా ప్రతీ ఒక్కరూ వీటిని కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో రెండు రకాల వాషింగ్ మిషన్స్ లభిస్తున్నాయి. ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ వేరియంట్లలో ఇవి అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో ఏ వేరియంట్‌ను కొనాలో తెలియక చాలా మంది సతమతమవుతుంటారు. కాబట్టి, ఈ రెండింటికీ మధ్య తేడాలేంటి? ఏది ఉత్తమమైనది? అనేది ఒకసారి చూద్దాం.
దేని వాడకం తేలికంటే..!
ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ల కంటే టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లు వాడటానికి ఈజీగా ఉంటాయి. ఎందుకంటే, ఫ్రంట్ లోడ్‌లో బట్టలు వేయడానికీ, తీయడానికీ వంగాల్సి ఉంటుంది. పెద్దవారికీ, జాయింట్ ప్రాబ్లంస్ ఉన్నవారికీ ఫ్రంట్ లోడ్ అంత కన్వీనియెంట్‌గా అనిపించదు. కానీ, ఫ్రంట్ లోడ్‌ని కొంచెం ఎత్తులో పెట్టుకుంటే ఈ ప్రాబ్లమ్ ఉండదు.
పాజ్ ఫెసిలిటీ
ఫ్రంట్ లోడ్‌తో పోలిస్తే టాప్ లోడ్‌లో ఇంకొక సౌకర్యం ఉంది. వాష్ సైకిల్ స్టార్ట్ చేశాక కూడా మధ్యలో పాజ్ చేసి మర్చిపోయినవి ఏమైనా ఉంటే ఉతకడానికి వేయవచ్చు. ఈ ఫెసిలిటీ ఫ్రంట్ లోడ్‌లో ఉండదు. అలాగే, లింట్ కలెక్ట్ చేయడం, ఫ్యాబ్రిక్ సాఫెనర్‌ని ఈవెన్‌గా డిస్ట్రిబ్యూట్ చేయడం వంటివి ఫ్రంట్ లోడ్ కంటే టాప్ లోడ్‌లో బాగా జరుగుతాయి.
డ్రెస్ క్లీనింగ్‌లో ఏది బెటర్?
బట్టల వాషింగ్ విషయానికి వస్తే టాప్ లోడ్ కంటే ఫ్రంట్ లోడ్ బెటర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే డ్రెస్ క్లీనింగ్‌లో టాప్ లోడ్ వాషింగ్ మిషన్ కాస్త రఫ్‌గా ప్రవర్తిస్తాయి. ఓవర్ లోడ్ అయినప్పుడు ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. అటు ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్స్.. క్లాత్స్‌పై జెంటిల్‌గా ఉంటాయి. టాప్ లోడ్ వాషింగ్ మెషీన్స్ పిల్లోస్, బొంతలను ఉతకడంలో కొంచెం డిఫికల్టీని ఫేస్ చేస్తాయి.
నీటి వాడకం
టాప్ లోడ్ కంటే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్ నీరు తక్కువ వినియోగించుకుంటాయి. విద్యుత్‌ను కూడా తక్కువే వాడతాయి. ఫలితంగా పవర్ బిల్‌ను కంట్రోల్ చేయవచ్చు. అటు పర్యావరణపరంగా చూసినా ఫ్రంట్ లోడ్ మిషన్లే అనువైనవి.
ఫైనల్ స్పిన్ సైకిల్
ఫైనల్ స్పిన్ సైకిల్‌లో టాప్ లోడ్‌తో పోలిస్తే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్ 33% ఎక్కువ వేగంగా స్పిన్ అవుతాయి. ఫలితంగా బట్టల్లోని నీరు వేగంగా బయటకు వచ్చేస్తుంది. దీంతో బట్టలు బయట ఆరేసినప్పుడు తేలిగ్గా ఆరిపోతాయి. అయితే ఫైనల్ స్పిన్ సమయంలో టాప్ లోడ్‌తో పోలిస్తే ఫ్రంట్ లోడ్ ఎక్కువ నాయిస్ చేస్తాయి. ఇది చాలా మందికి నచ్చకపోవచ్చు.
ధర విషయంలో..
ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్ టాప్ లోడ్ కంటే బాగా ఖరీదైనవి. కానీ ఫ్రంట్ లోడ్ మిషన్లలో ఎక్కువ వాష్ ఫీచర్స్ ఉంటాయి. పైగా ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లు తక్కువ చప్పుడు చేస్తాయి. ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్లు కొనేప్పుడు ఖరీదనిపించినా.. లాంగ్ రన్‌లో అవి ఇచ్చే సౌకర్యాలకీ, దాని ఖరీదుకీ సరిపోతుంది.
చివరిగా: ఫ్రంట్ లోడ్, టాప్ లోడ్ వాషింగ్ మిషన్లు వేటికవే ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి. పైన ఇచ్చిన వివరాలు ప్రకారం మీకు ఏ మోడ్ మిషన్ అనువుగా ఉంటుందో చూసుకొని సరైన నిర్ణయం తీసుకోండి.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!