Top Redmi Phones: రెడ్‌మీలో ఏ ఫోన్ కొనాలని సందేహిస్తున్నారా? అయితే వీటిని ట్రై చేయండి!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Top Redmi Phones: రెడ్‌మీలో ఏ ఫోన్ కొనాలని సందేహిస్తున్నారా? అయితే వీటిని ట్రై చేయండి!

    Top Redmi Phones: రెడ్‌మీలో ఏ ఫోన్ కొనాలని సందేహిస్తున్నారా? అయితే వీటిని ట్రై చేయండి!

    October 21, 2023

    భారతీయులు అమితంగా ఇష్టపడే మెుబైల్‌ బ్రాండ్లలో రెడ్‌మీ కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే రెడ్‌మీ అతి తక్కువ ధరకే అత్యాధునిక ఫోన్‌ను అందిస్తుంది. అంతేగాక మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో ఫోన్స్‌ లాంచ్‌ చేస్తుంటుంది. ఈ నేపథ్యంలోనే చాలా మంది మెుబైల్‌ ప్రియులు రెడ్‌మీ ఫోన్స్‌ కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. అయితే చాలా మందికి రెడ్‌మీ ఫోన్‌ కొనాలని ఉన్నప్పటికీ ఏది తీసుకోవాలో తెలియక సతమతమవుతుంటారు. ఈ నేపథ్యంలో రెడ్‌మీలోని టాప్‌ రేటెడ్‌ మెుబైల్స్‌ను YouSay మీ ముందుకు తీసుకొచ్చింది. మరి ఆ ఫోన్స్‌ ప్రత్యేకతలు, ఫీచర్లు, ధర చూసి ఏదీ కొనాలో మీరే డిసైడ్ చేసుకోండి. 

    Redmi Note 12

    ఈ మొబైల్ 6.67 అంగుళాల స్క్రీన్‌ను కలిగి ఉంది. దీనికి 120Hz రిఫ్రెష్‌ రేట్ అందించారు. అంతేగాక 50MP ప్రైమరీ సెన్సార్‌ ఉన్న ట్రిపుల్‌ రియర్‌ కెమెరా సెటప్‌, 5000 mAh బ్యాటరీని ఫోన్‌కు అందించారు. Android 13 OS, Qualcomm Snapdragon 685 Octa core ప్రొసెసర్‌తో ఫోన్‌ వర్క్‌ చేస్తుంది. అమెజాన్‌లో ఈ ఫోన్‌ రూ.11,998లకు అందుబాటులో ఉంది. 

    Redmi Note 12 5G

    రెడ్‍మీ నోట్ 12 5జీ మొబైల్ క్వాల్కామ్ స్నాప్‍డ్రాగన్ 4 జెన్ 1 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. 120Hz రిఫ్రెష్ రేట్‍తో కూడిన 6.67 అంగుళాల ఫుల్ హెచ్‍డీ+ అమోలెడ్ డిస్‍ప్లేను ఫోన్‌ కలిగి ఉంది. మెుబైల్‌ వెనక భాగంలో 48 MP ప్రైమరీ, 8 MP అల్ట్రా వైడ్, 2 MP మాక్రో కెమెరాలను షావోమీ పొందుపరిచింది. అలాగే 13 MP ఫ్రంట్ కెమెరాను ఫిక్స్ చేసింది. 5,000mAh బ్యాటరీ, 33 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‍కు సపోర్ట్‌ను కూడా ఫోన్‌కు అందించింది. అమెజాన్‌లో ఈ ఫోన్‌ రూ.17,499లకు లభిస్తోంది.

    Redmi Note 12 Pro 5G

    ఈ రెడ్‌మీ ఫోన్‌.. 6.67 అంగుళాల ఫుల్ HD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోటోలు, వీడియోల కోసం ఫోన్ వెనుక భాగంలో 50 MP ప్రైమరీ సెన్సార్‌తో ఉన్న ట్రిపుల్‌ రియర్‌ కెమెరా సెటప్‌ను ఫిక్స్‌ చేశారు. ఫోన్‌ ముందువైపు సెల్ఫీల కోసం 16 MP కెమెరాను అమర్చారు. అలాగే 5000mAh బ్యాటరీ, 67W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ను ఫోన్‌కు అందించారు. అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 20,999గా ఉంది. 

    Redmi 12C

    రెడ్‌మీలో రూ.10 వేల లోపు మంచి మెుబైల్‌ను కోరుకునే వారు Redmi 12C పరిశీలించవచ్చు. ఇది అమెజాన్‌లో రూ.9,499లకు లభిస్తోంది. ఈ మెుబైల్‌ 17cm HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది. 6+5GB వర్చువల్‌ ర్యామ్‌, 5000mAh బ్యాటరీని ఫోన్‌కు అందించారు.

    Redmi K50i 5G

    రెడ్‌మీ ఫోన్ కోసం ఎదురుచూస్తున్న వారికి రెడ్‌మీ కే 50i మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు. ఈ ఫోన్‌ను సరికొత్త  MediaTek Dimensity 8100 CPUతో తీసుకొచ్చారు. Liquid FFS displayను కూడా అందించారు. అత్యుత్తమ సౌండ్‌ క్వాలిటీ దీని సొంతం. అలాగే 64MP ట్రిపుల్‌ కెమెరా సెటప్‌, 4K వీడియో రికార్డింగ్‌కు ఇది సపోర్టు చేస్తుంది. బ్లూ, క్విక్ సిల్వర్‌, స్టీల్త్ బ్లాక్‌ రంగుల్లో ఈ ఫోన్‌ అందుబాటులో ఉంది. ఈ మెుబైల్‌ను ‌అమెజాన్‌ రూ.18,499 ఆఫర్‌ చేస్తోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version