టీఎస్‌పీఎస్సీలో లీకేజీ ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో పరీక్షా పేపర్ కూడా లీకేజీ అయింది. మార్చి 5న జరిగిన అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష పత్రం కూడా లీకైనట్లు పోలీసులు తేల్చారు. ఈ పరీక్ష జరగక రెండు రోజుల ముందే ప్రశ్నాపత్రం లీకైంది. దీంతో అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్షను కూడా టీఎస్‌పీఎస్సీ రద్దు చేసే యోచనలో ఉంది. కాగా ఇంతకుముందు వెటర్నరీ అసిస్టెంట్, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పరీక్ష పత్రాలు లీకైన సంగతి తెలిసిందే.
రాష్ట్రవ్యాప్తంగా పేపర్ల లీకేజీ ప్రకంపనలు సృష్టిస్తుండటంతో విచారణను సిట్‌కు అప్పగించారు. ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో దర్యాప్తు శరవేగంగా జరుగుతోంది. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కూడా సీరియస్‌గా ఉన్నారు. పూర్తి నివేదిక సమర్పించాలని తెలంగాణ సర్వీస్ పబ్లిక్ కమిషన్‌ను ఆదేశించారు.
ఈ వ్యవహారంలో మంగళవారం టీఎస్‌పీఎస్సీ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. భవనం ముందున్న బోర్డును ధ్వంసం చేశారు. పోలీసులు వారిని అడ్డుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అప్పట్నుంచి పరిసర ప్రాంతాల్లో భారీగా మోహరించారు.
టీఎస్‌పీఎస్సీలో రాజకీయ నేతలు ఎక్కువ కావటం వల్లే అవకతవకలు జరుగుతున్నాయని విపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి.పేపర్ల లీకేజీ ఘటనను అన్ని పార్టీలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. ప్రభుత్వ తీరును తప్పు బడుతూ విమర్శలు సంధిస్తున్నారు.
పేపర్ల లీకేజీపై ఇప్పటికే సమీక్ష నిర్వహించిన టీఎస్‌పీఎస్సీ దిద్దుబాటు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి నిర్ణయం తీసుకోనున్నారు. ఇంటి దొంగలే గొంతు కోశారంటూ ఛైర్మన్ బి. జనార్ధన్ రెడ్డి వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ ఘటనతో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు ఆందోళనలో పడ్డారు. పేపర్ లీకేజీ వ్యవహారం ఎంత దూరం వెళుతుందో ? ఎలాంటి వాస్తవాలు బయటకు వస్తాయో ? ఏయే పరీక్షలు రద్దవుతాయో? కమిషన్ ఏం నిర్ణయాలు తీసుకుంటుందో అనే ఆలోచనలో ఉన్నారు.
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి