ఇండియా టుడే మ్యాగజైన్ కవర్ ఫొటో.. అల్లు అర్జున్, డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టింది. జులై మ్యాగజైన్ కవర్ పై అల్లు అర్జున్ ఫొటోను ప్రచురించింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ ఆ కవర్ ఫొటోను ట్విట్టర్, ఇన్ స్టాలో వైరల్ చేశారు. అల్లు అర్జున్ ఫాన్ ఇండియా స్టార్, బన్నీకి తిరుగు లేదు అంటూ కామెంట్స్ చేశారు. రకరకాల ఎమోజీలు పెడుతూ బాగా ట్రెండ్ చేశారు. ఈ క్రమంలో బన్నీ ఫ్యాన్స్ కామెంట్స్, ప్రభాస్ ఫ్యాన్స్ కు అసహనం కలిగించాయి. వెంటనే గతంలో ఇండియా టుడే మ్యాగజైన్ ప్రచురించిన బాహుబలి మూవీలోని ప్రభాస్ కవర్ ఫొటోను డార్లింగ్ అభిమానులు పోస్ట్ చేశారు. దీంతో ఇద్దరు సూపర్ స్టార్స్ ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ వార్ ఒక్కసారిగా హీటెక్కింది. ఆ ట్విట్టర్ వార్ పై ఓ లుక్కెద్దాం..
అదృష్టం వల్లే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్
అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అని దేశంలో ప్రతి రాష్ట్రం అతన్ని గుర్తించిందని ఓ ఫ్యాన్ ట్వీట్ చేశాడు. ప్రభాస్ కేవలం సౌత్ ఇండియాలోనే ఫేమస్ అని చెప్పుకొచ్చాడు. అది కూడా కేరళ, తమిళనాడులో మాత్రమే డార్లింగ్ హవా ఉందని వ్యాఖ్యానించాడు. రాజమౌళి ద్వారానే ప్రభాస్ కు పేరొచ్చిందని కామెంట్ చేశాడు.
అల్లు అర్జున్ కు కేవలం పుష్పలో చేసిన మేనరిజం, డీఎస్పీ సాంగ్స్ వల్లే గుర్తింపు వచ్చిందని మరో ఫ్యాన్ విమర్శించాడు.
మరొకరు ట్వీట్ చేస్తూ.. అదృష్టం వల్లనే ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడని విమర్శించాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ లుక్ మారిపోయిందని కామెంట్ చేశాడు. రాధేశ్యామ్ మూవీలో అంకుల్ లా కనిపించాడని వ్యాఖ్యానించాడు.
బన్నీ సినిమాలకు వచ్చే జనం ఆర్టీసీ ఎక్స్ రోడ్ థియేటర్లలోనే నిండటం లేదు.ఇక ఆయన పాన్ ఇండియా స్టార్ ఏంటని ఘాటుగా వ్యాఖ్యానించాడు.
రంగస్థలం, కేజీఎఫ్ నుంచి కాఫీ కొట్టారు..
పుష్ప మూవీ రంగస్థలం, కేజీఎఫ్ మూవీ నుంచి కాఫీ కొట్టారని అంతే తప్ప అంతకు మించి అందులో ఏమి లేదని విమర్శించాడు. ఐటెం సాంగ్ చేయించి సమంతను డీ ఫేమ్ చేశారని ఆరోపించాడు. బాహుబలి మూవీని.. మేల్,ఫిమేల్ తో సంబంధం లేకుండా అందరూ ఆదరించారని చెప్పుకొచ్చాడు.
వారిద్దరూ బానే ఉన్నారు.. మధ్యలో మీరే..
ఇదంతా చూస్తున్న సగటు అభిమానులు మాత్రం ఇద్దరు హీరోల ఫ్యాన్స్ తీరును తప్పుపడుతున్నారు. బన్నీ, ప్రభాస్ వారి వారి యాక్టింగ్ టాలెంట్ తో పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగారు. ఫ్యాన్స్ మాత్రమే ఇన్ సెక్యురిటీ ఫిలింగ్ తో గొడవలు పడుతున్నారని హితబోధ చేస్తున్నారు. సోషల్ మీడియాలో రచ్చకెక్కి వారి పరువు తీయొద్దని కోరుతున్నారు.