Unique Promotions: ప్రమోషన్స్‌తోనే పడేశారు.. సోషల్ మీడియాలో ‘మేమ్‌ ఫేమస్‌’ రచ్చ రచ్చ..!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Unique Promotions: ప్రమోషన్స్‌తోనే పడేశారు.. సోషల్ మీడియాలో ‘మేమ్‌ ఫేమస్‌’ రచ్చ రచ్చ..!

    Unique Promotions: ప్రమోషన్స్‌తోనే పడేశారు.. సోషల్ మీడియాలో ‘మేమ్‌ ఫేమస్‌’ రచ్చ రచ్చ..!

    May 23, 2023

    సుమంత్‌ ప్రభాస్‌ ప్రధాన పాత్రలో నటిస్తూ, తెరకెక్కించిన చిత్రం ‘మేమ్‌ ఫేమస్‌’. ఈ సినిమా మే 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం చేస్తున్న ప్రమోషన్స్‌ ఆకట్టుకుంటున్నాయి. రొటిన్‌ ప్రమోషన్స్‌లా కాకుండా చిత్ర యూనిట్‌ వినూత్నంగా తమ సినిమాను ప్రమోట్‌ చేసుకుంటోంది. డీజే బ్యాండ్‌తో స్వయంగా సెలబ్రిటీల దగ్గరకు వెళ్లి తమ ప్రమోషన్స్‌లో వారిని భాగస్వామ్యం చేస్తోంది. ‘మేమ్‌ ఫేమస్‌’ను ప్రమోట్‌ చేస్తూ సెలబ్రిటీలు చెబుతున్న డైలాగ్స్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

    విశ్వక్‌సేన్‌

    ‘దాస్‌ కా ధమ్కీ’ మూవీ హిట్‌తో విశ్వక్‌ సేన్‌ ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో విశ్వక్‌ను కలిసిన ‘మేమ్‌ ఫేమస్‌’ చిత్ర యూనిట్‌ ఆయన చేత వినూత్నంగా సినిమాను ప్రమోట్ చేయించింది. 

    తిరువీర్‌

    హారర్‌ చిత్రం ‘మసూద’లో లీడ్‌ రోల్‌ చేసిన నటుడు తీరువీర్‌ కూడా ‘మేమ్‌ ఫేమస్‌’ ప్రమోషన్స్‌లో భాగమయ్యాడు.

    రాహుల్‌ సిప్లిగంజ్

    ఆస్కార్‌ విన్నర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ను కూడా చిత్ర యూనిట్‌ కలిసింది. ఊరమాస్‌ స్టెప్పులతో తమ మూవీని ప్రమోట్‌ చేయించుకుంది. 

    సింగర్ మంగ్లీ

    ప్రముఖ సింగర్‌ మంగ్లీ కూడా ధూమ్‌ ధామ్‌ డ్యాన్స్‌తో ‘మేమ్‌ ఫేమస్‌’ సినిమాపై హైప్‌ క్రియేట్ చేసింది. 

    అడివి శేష్

    యంగ్‌ హీరో అడివి శేష్‌ను కూడా చిత్ర యూనిట్‌ వదల్లేదు. తమ డప్పులకు చిందేయించి మరి హీరోతో ప్రమోషన్ చేయించుకుంది.

    విజయ్‌ ఆంటోనీ

    బిచ్చగాడు-2 సినిమా హీరో ‘విజయ్‌ ఆంటోనీ’ సైతం ఎంతో ఉత్సాహాంగా ప్రమోషన్స్‌లో పాల్గొన్నాడు. 

    రానా దగ్గుబాటి

    ‘మేమ్‌ ఫేమస్‌’ యూనిట్‌తో కలిసి హీరో రానా కూడా రచ్చ రచ్చ చేశాడు. కిర్రాక్‌ స్టెప్పులతో అలరించాడు.

    తరుణ్‌ భాస్కర్‌

    యంగ్‌ డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌ ఎంతో హుషారుగా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నాడు.

    సుహాస్‌

    ‘కలర్‌ ఫొటో’ సినిమా హీరో సుహాస్ చేసిన ప్రమోషన్స్ అన్నింటి కంటే హైలెట్‌ అని చెప్పొచ్చు. సినిమా ఫంక్షన్స్‌లో ఎంతో బిడియంగా కనిపించే సుహాస్‌ తన డ్యాన్స్‌తో ఇరగదీశాడు. 

    అనిల్‌ రావిపూడి

    ప్రముఖ డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి కూడా మూవీ ప్రమోషన్స్‌లో తళుక్కుమన్నాడు. 

    నవదీప్‌

    హీరో నవదీప్‌ ఇటీవల ‘న్యూసెన్స్‌’ అనే వెబ్‌సిరీస్‌లో నటించాడు. ‘మేమ్‌ ఫేమస్‌’ చిత్రంతో పాటు తెలివిగా తన వెబ్‌సిరీస్‌ను కూడా నవదీప్‌ ప్రమోట్‌ చేసుకున్నాడు. 

    హరీశ్‌ శంకర్‌

    ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమా డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ కూడా మేమ్ ఫేమస్‌ చిత్ర ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొన్నాడు.

    నాగచైతన్య

    ఎప్పుడూ సాఫ్ట్‌గా, కూల్‌గా ఉండే హీరో నాగచైతన్య కూడా దుమ్ములేపాడు. 

    విజయ్‌ దేవరకొండ

    యంగ్ హీరో విజయ్‌ దేవరకొండ కూడా తనదైన శైలిలో కొత్త మూవీని ప్రమోట్ చేశాడు.

    అల్లు అరవింద్‌

    ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ కార్యాలయం ఎదుట కూడా ‘మేమ్‌ ఫేమస్‌’ టీమ్ హల్‌చల్‌ చేసింది. ఈ క్రమంలో సడెన్ ఎంట్రీ ఇచ్చిన అల్లుఅరవింద్‌.. మే 26న థియేటర్స్‌లో కలుద్దాం అంటూ మూవీ బృందంతో అన్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version