భారత్‌లో యామా క్రేజ్ ఉన్న రంగాల్లో వాహన రంగం ఒకటి. ఇక్కడ ఏటా లక్షల్లో బైక్‌లు సేల్ అవుతూ ఉంటాయి. వాహనదారుల అభిరుచులకు అనుగుణంగా వాహన సంస్థలు ప్రతీ ఏడాది కొత్త మోడళ్లను తీసుకొస్తుంటాయి. ఈ క్రమంలోనే మే నెలలో పలు కంపెనీలకు చెందిన ద్విచక్ర వాహనాలు విడుదల కానున్నాయి. అధునాతన సాంకేతికతతో వీటిని తీసుకువస్తున్నట్లు ఆయా సంస్థలు ప్రకటించాయి. ఇంతకీ ఈ నెలలో రాబోయే బైక్‌లు ఏవి?. వాటి ప్రత్యేకతలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
1. TVS అపాచీ RT-300
TVSకు చెందిన అపాచీ బైక్‌కు వాహనదారుల్లో మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో ఆ సంస్థ కొత్తగా అపాచీ RT-300 మోడల్‌ను తీసుకొస్తుంది. ఇది నెలలోనే లాంచ్ కానుంది. 312cc ఇంజన్ సామర్థ్యంతో దీన్ని తీసుకొస్తున్నారు. దీని ధర రూ.2,20,000 – రూ. 2,29,999 మధ్య ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
2. ట్రయంఫ్ స్ట్రీట్ ట్రిపుల్ 765
ట్రయంప్ బైక్ కూడా ఈ నెలలోనే విడుదల కానుంది. ఇది RS & R అనే రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. Triumph Street Triple RS వెల రూ. 11,50,000 – రూ.12,00,000 మధ్య ఉండొచ్చు. అలాగే Triumph Street Triple R మోడల్ ధర రూ. 9,50,000 – రూ. 10,00,000 మధ్య ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ బైక్‌ల ఇంజిన్ పవర్ 765cc గా ఉంది.
3. రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 Next Gen
రాయల్ ఎన్‌ఫిల్డ్ కంపెనీ దశబ్దాల కాలం నుంచి టూ వీలర్ రంగంలో రారాజుగా వెలుగొందుతోంది. ఈ సంస్థ నుంచి బైక్ వస్తుందంటే వాహన ప్రియులు అలెర్ట్ అయిపోతారు. ఈ నేపథ్యంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి మరో కొత్త బైక్ రానుంది. 350 Next Gen పేరుతో దీనిని తీసుకురానున్నారు. దీని వెల రూ.1,50,000 – రూ.1,60,000 మధ్య ఉండొచ్చని అంచనా.
4. ఎనర్జీ వన్ ఈ-స్కూటర్
బెంగళూరుకు చెందిన ఎనర్జీ వన్ కంపెనీ ఈ నెలలోనే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయనుంది. 236 కి.మీ రైడింగ్ రేంజ్‌తో.. గంటకు 105 కి.మీ గరిష్ట వేగం సామర్థ్యంతో ఈ బైక్ రానుంది. దీని మార్కెట్ వెల రూ. 1,00,000 – రూ. 1,05,000 మధ్య ఉంటుందని సమాచారం.
5. హీరో ఎక్స్‌స్ట్రీమ్ 200S 4V
ప్రముఖ వాహన సంస్థ హీరో నుంచి కూడా ఓ కొత్త బైక్ ఈ నెలలో లాంచ్ కానుంది. Hero Xtreme 200S 4V పేరుతో దీనిని విడుదల చేయనున్నారు. రూ. 1,40,000 – రూ. 1,45,000 మధ్య దీని వెల ఉండనుంది.
6. డుకాటి మాన్‌స్టర్ ఎస్‌పీ
భారత్‌లో డుకాటి మాన్‌స్టర్ ఎస్‌పీ బైక్ తాజాగా లాంచ్ అయింది. స్టాండర్డ్ వేరియంట్ కన్నా ఈ బైక్ ధర రూ.3లక్షలు అదనం. ఎక్స్‌షోరూం ధర రూ.15.95 లక్షలు. స్టాండర్డ్ వర్షన్‌ని పోలిన డిజైన్‌తో ఇది తయారైంది. 937 సిసి ట్విన్ సిలిండర్ లిక్విడ్ కూల్ ఇంజిన్‌ని ఇది కలిగి ఉంది. 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. బీఎండబ్ల్యూ ఎఫ్900 ఆర్, కవాసకి జెడ్900 వంటి బైక్‌లకు ఇది పోటీ ఇవ్వనుంది.
Celebrities Featured Articles Movie News
Dacoit: మోసం చేశావ్ మృణాల్.. అడవి శేష్ కామెంట్స్ వైరల్