Upcoming Cars in October 2023: అక్టోబర్‌లో రిలీజ్‌ కానున్న టాప్‌ బ్రాండెడ్‌ కార్లు ఇవే! 
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Upcoming Cars in October 2023: అక్టోబర్‌లో రిలీజ్‌ కానున్న టాప్‌ బ్రాండెడ్‌ కార్లు ఇవే! 

    Upcoming Cars in October 2023: అక్టోబర్‌లో రిలీజ్‌ కానున్న టాప్‌ బ్రాండెడ్‌ కార్లు ఇవే! 

    September 29, 2023

    ప్రతి నెలలాగే అక్టోబర్‌లోనూ పలు కంపెనీలకు చెందిన అత్యాధునిక కార్లు రిలీజ్‌ కాబోతున్నాయి. దేశీయ విపణిలోకి అడుగుపెట్టి తమ సత్తా ఎంటో నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త కారు కొనాలని భావిస్తున్నవారు అక్టోబర్‌ వరకూ ఆగాలని ఆయా కంపెనీలు సూచిస్తున్నాయి. మరి వచ్చే నెల ఎన్ని కార్లు రిలీజ్‌ కాబోతున్నాయి? ఏ ఏ తేదీల్లో అవి వచ్చే ఛాన్స్ ఉంది? వాటి ధరలు ఎలా ఉండనున్నాయి? వంటి అంశాలను ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. 

    Lexus UX

    లెక్సస్‌ కంపెనీకి చెందిన 5 సీటర్‌ SUV కారు అక్టోబర్‌లోనే రిలీజ్‌ కాబోతున్నట్లు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే నెల 4న ఇది లాంచ్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది. ఇది సుమారు రూ.40 లక్షల (ఎక్స్‌ షోరూం ధర) వరకూ ఉండొచ్చని ఆటోమెుబైల్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ కారు 1987 cc ఉన్న పెట్రోల్‌ ఇంజిన్‌తో వస్తోంది. BS 6 నిబంధనలకు అనుగుణంగా దీన్ని తయారు చేశారు. కారు ప్రారంభోత్సవం రోజునే పూర్తి వివరాలు తెలియనున్నాయి.

    Renault Arkana

    అక్టోబర్‌లో రిలీజయ్యే కార్ల జాబితాలో Renault Arkana కూడా ఉంది. ఇది కూడా 5 సీట్స్‌ కలిగిన SUV కారు. అక్టోబర్‌ 5న ఈ కారు లాంచ్‌ కానున్నట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. దీని ధర సుమారు 20 లక్షలు (ఎక్స్‌ షోరూం ధర) ఉండొచ్చని అంచనా. 1493cc డీజిల్‌ ఇంజిన్‌తో ఇది రాబోతోంది. మరిన్ని వివరాలు కోసం అక్టోబర్‌ వరకూ ఆగాల్సిందే. 

    BMW X6

    అక్టోబర్‌లో BMW నుంచి మరో సరికొత్త కారు రానుంది. BMW X6 పేరుతో ఇది లాంచ్‌ కానుంది. ఆటోమెుబైల్‌ వర్గాల సమాచారం మేరకు ఇది ఆక్టోబర్‌ 10న విడుదల అవ్వనుంది. దీని ధర రూ. 1.39 -1.49 కోట్ల మధ్య ఉండొచ్చని సమాచారం. 2998 cc ఇంజన్‌, 335.25 Bhp పవర్‌, 5 సీటింగ్‌ కెపాసిటీ, 4WD డ్రైవ్‌ టైప్‌, 10.31 kmpl మైలేజ్‌ ఫీచర్లతో ఈ కారు రాబోతోంది.

     

    Aston Martin DB12

    ఈ కారు కూడా వచ్చే నెలలోనే రానుంది. అక్టోబర్‌ 15న భారత మార్కెట్లను పలకరించనుంది. దీని విలువ సుమారు రూ. 4 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. 3998 cc పవర్‌ ఫుల్‌ పెట్రోల్‌ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఇది ఫుల్లీ ఆటోమోటిక్‌ మోడ్‌తో రానున్నట్లు తెలిసింది. పూర్తి సమాచారం కోసం లాంచ్‌ డే వరకూ వేచి చూడాల్సిందే. 

    Land Rover Defender 5-door Hybrid X

    ఈ కారు 1997cc ఇంజిన్‌ కలిగి ఉంది. 394.26 BHP పవర్‌ను జనరేట్‌ చేస్తుంది. 7 సీటింగ్‌ కేపాసిటీతో పాటు AWD డ్రైవ్‌ టైప్‌, 14.01 kmpl మైలేజ్‌ దీని ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. Land Rover Defender 5-door Hybrid X కూడా అక్టోబర్‌లోనే రిలీజ్‌ కానున్నట్లు కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఏ రోజు అనే విషయాన్ని మాత్రం స్ఫష్టం చేయలేదు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version