అక్టోబర్ నెల మెుబైల్ ప్రియులకు పండగలా మారనుంది. ఎందుకంటే ప్రముఖ మెుబైల్ కంపెనీలు తమ అత్యాధునిక స్మార్ట్‌ఫోన్స్‌ను ఆ నెలలోనే రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యాయి. కళ్లు చెదిరే ఫీచర్స్‌తో టెక్ ప్రియులకు పసందైన అనుభూతిని పంచనున్నాయి. కొత్త మెుబైల్ కోసం ఎదురు చూసే వారు ఆక్టోబర్ వరకూ ఆగాలని పలు కంపెనీలు ఇప్పటికే సూచిస్తున్నాయి. దీంతో అసలు అక్టోబర్‌లో ఏ మెుబైల్స్ రానున్నాయా? అన్న ఆసక్తి ప్రతిఒక్కరిలోనూ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో YouSay వచ్చే నెలలో రిలీజయ్యే మెుబైల్స్ జాబితాను మీ ముందుకు తీసుకువచ్చింది. వాటి వాటి ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయో మీరు చూడండి.
Vivo V29, Y78 Plus
అక్టోబర్‌లో వివో నుంచి మెుత్తం రెండు ఫోన్లు విడుదల కానున్నట్లు తెలుస్తోంది. Vivo V29, Vivo Y78 Plus మోడళ్లను రిలీజ్ చేయనున్నట్లు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో వివో మెుబైల్ కొనాలని పట్టుదలగా ఉన్న వారు అక్టోబర్ వరకూ వేచి చూస్తే బెటర్. Vivo V29 ధర రూ.32,990, vivo Y78 Plus ధర 19,090గా ఉండొచ్చని అంచనా.
OnePlus Ace 2 Pro
వన్‌ప్లస్ నుంచి సరికొత్త మెుబైల్ అక్టోబర్‌లో రానుంది. OnePlus Ace 2 Pro స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ లాంఛ్ చేయనుంది. దీని ప్రైస్ రూ.34,290 వరకూ ఉండొచ్చని అంచనా. ఈ మెుబైల్ 6.74 అంగుళాల స్క్రీన్, 50 MP + 8 MP + 2 MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 16 MP సెల్ఫీ కెమెరా, 5000 mAh బ్యాటరీతో రానుంది.
OPPO Find X6 Pro
వచ్చే నెలలో సందడి చేయనున్న మరో మెుబైల్ ‘OPPO Find X6 Pro’. ఈ ఫోన్ 6.82 అంగుళాల డిస్‌ప్లేతో రానుంది. అలాగే 50 MP + 50 MP + 50 MP ట్రిపుల్ రియర్ కెమెరా, 120 Hz Refresh Rate, 32 MP సెల్ఫీ కెమెరా, Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ ఫీచర్లను కలిగి ఉంది. 12GB RAM / 256GB స్టోరేజ్, 5000 mAh బ్యాటరీని కూడా ఈ ఫోన్ కలిగి ఉంది. దీని ధర. 72,190 ఉండవచ్చని కంపెనీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
realme GT Neo 5 SE
రియల్‌మీ నుంచి కూడా వచ్చే నెల ఓ అద్భుతమైన ఫోన్ వస్తోంది. ‘realme GT Neo 5 SE’ మెుబైల్‌ను లాంచ్ చేసేందుకు ఆ సంస్థ సిద్ధమైంది. దీని విలువ రూ.23,990 ఉండవచ్చు. 6.74 అంగుళాల డిస్‌ప్లే, 144 Hz Refresh Rate, 64 MP + 8 MP + 2 MP బ్యాక్ కెమెరా సెటప్, 16 MP Front Camera, 5500 mAh బిగ్ బ్యాటరీ, 8GB RAM / 256GB ROM ఫీచర్లుగా ఉన్నాయి.
Redmi K60 Ultra
ప్రతీ నెలలాగే రెడ్‌మీ అక్టోబర్‌లో కూడా మరో ఫోన్‌ను లాంఛ్ చేసేందుకు సిద్ధమైంది. Redmi K60 Ultra పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేయనుంది. 6.67 అంగుళాల 446 PPI, OLED స్క్రీన్‌తో రానుంది. దీనికి 144Hz Refresh Rate అందించారు. 50 MP + 8 MP + 2 MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, Dual-color LED Flash, 20 MP సెల్ఫీ కెమెరా, ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 mAh బ్యాటరీతో ఈ ఫోన్ రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.29,790 ఉండొచ్చని అంచనా.
Honor 90 Pro, Honor X50
హానర్ నుంచి అక్టోబర్‌లో రెండు మెుబైల్స్ వచ్చే ఛాన్స్ ఉందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. Honor 90 Pro, Honor X50 పేరుతో ఆ స్మార్ట్‌ఫోన్స్ రిలీజ్ అవుతాయని అభిప్రాయపడుతున్నాయి. Honor 90 Pro స్మార్ట్‌ఫోన్.. 6.78 అంగుళాల స్క్రీన్, 200 MP + 12 MP + 32 MP బ్యాక్ కెమెరా సెటప్, 50 MP + 2 MP డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, 5000 mAh బ్యాటరీ ఫీచర్లను కలిగి ఉంది. అలాగే Honor X50 మెుబైల్ సైతం 6.78 అంగుళాల డిస్‌ప్లే, 108 MP + 2 MP డ్యుయల్ కెమెరా, 5800 mAh బిగ్ బ్యాటరి, 8 MP Front Camera ఫీచర్లతో రాబోతోంది.
iQOO Neo 8, iQOO Z8
ప్రముఖ మెుబైల్ తయారీ సంస్థ ఐకూ (iQOO) అక్టోబర్‌లో రెండు మెుబైల్స్ లాంఛ్ చేయనున్నట్లు సమాచారం. మెుబైల్ ప్రియుల కోసం iQOO Neo 8, iQOO Z8 స్మార్ట్‌ఫోన్స్ తీసుకురానున్నట్లు టెక్ వర్గాలు భావిస్తున్నాయి. iQOO Neo 8 ధర రూ.29,390, iQOO Z8 రూ.19,390 వరకూ ఉండొచ్చని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
Samsung Galaxy M54
ప్రముఖ టెక్ దిగ్గజం శామ్‌సంగ్ నుంచి కూడా వచ్చే నెల సరికొత్త గెలాక్సీ ఫోన్ రానుంది. ఆ సంస్థ Samsung Galaxy M54 మెుబైల్‌ను లాంఛ్ చేయనుంది. 6.7 అంగుళాల 393 PPI, Super AMOLED స్క్రీన్‌తో రాబోతోంది. 108 MP + 8 MP + 2 MP రియర్ కెమెరా సెటప్, 32 MP Front Camera, 6000 mAh శక్తివంతమైన బ్యాటరీ, Samsung Exynos 1380 ప్రొసెసర్, 8 GB RAM / 128 GB స్టోరేజ్ ఫీచర్లను కలిగి ఉంది. దీని ప్రైస్ రూ.37,999 ఉండవచ్చని తెలుస్తోంది.
Sony Xperia 1 V
సోనీ (Sony) నుంచి ఓ నయా స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. Sony Xperia 1 V పేరుతో ఆ ఫోన్ లాంఛ్ కాబోతోంది. ఇది కూడా 6.5 అంగుళాల 643 PPI, OLED స్క్రీన్‌తో వస్తోంది. 48 MP + 12 MP + 12 MP బ్యాక్ కెమెరా సెటప్, 12 MP సెల్ఫీ కెమెరా, 5000 mAh బ్యాటరీ, Snapdragon 8 Gen 2 ప్రొసెసర్ ఫీచర్లతో టెక్ ప్రియులను ఆకట్టుకోనుంది. దీని ధర 1,14,790 వరకూ ఉండొచ్చని సమాచారం.
Celebrities Featured Articles Movie News
Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డికి.. బన్నీ స్ట్రాంగ్ కౌంటర్!