Upcoming Mobiles In September 2023: సెప్టెంబర్‌లో రాబోతున్న స్టైలీష్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Upcoming Mobiles In September 2023: సెప్టెంబర్‌లో రాబోతున్న స్టైలీష్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

    Upcoming Mobiles In September 2023: సెప్టెంబర్‌లో రాబోతున్న స్టైలీష్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే..!

    September 13, 2023

    మెుబైల్‌ ప్రియులకు సెప్టెంబర్‌ నెల పండగే అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రముఖ కంపెనీలకు చెందిన టాప్‌ స్మార్ట్‌ఫోన్స్‌ ఈ నెలలోనే రిలీజ్‌ కాబోతున్నాయి. ఈ మెుబైల్స్ అన్నీ మంచి ప్రాసెసర్‌, అత్యాధునిక ఫీచర్లతో వస్తున్నాయి. ఇందులో యాపిల్ (Apple), ఇన్ఫినిక్స్‌ (Infinix), మోటోరోలా (Motorola), శామ్‌సంగ్‌ (Samsung), వన్‌ప్లస్‌ (OnePlus), హానర్‌ (Honor), గూగుల్‌ (Google) వంటి ప్రముఖ కంపెనీల మెుబైల్స్‌ ఉన్నాయి. ఈ నెలలో లాంచ్ అయ్యే ఆయా కంపెనీల మెుబైల్‌ మోడల్స్‌  ఏవో ఓ లుక్కేయండి.

    Moto G84 5G

    మోటోరోలా కంపెనీ తాజాగా Moto G84 5G స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ చేసింది. సెప్టెంబర్‌ 1 నుంచి ఈ ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ మెుబైల్‌ 6.55 అంగుళాల Full HD+ OLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్‌ రేటుతో దీన్ని తీసుకొచ్చారు. Qualcomm Snapdragon 695 ప్రాసెసర్‌, Android 13 OSతో ఈ ఫోన్‌ వర్క్‌ చేస్తుంది. 12GB RAM, 256GB ROM, 50MP + 8MP రియర్‌ కెమెరా సెటప్‌, 16MP సెల్ఫీ కెమెరా, 5,000mAh బ్యాటరీని ఈ మెుబైల్ కలిగి ఉంది. మోటోరోలా వెబ్‌సైట్‌ ద్వారా ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీని ధర రూ.19,999 వరకు ఉంది. ఐసీఐసీఐ క్రెడిట్, డెబిట్ కార్డు కొనుగోలు ద్వారా రూ.1000 ఇన్‌స్టాంట్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

    Infinix Zero 30 

    ఇన్ఫినిక్స్‌ తన సరికొత్త మెుబైల్‌ను సెప్టెంబర్‌ 1న మార్కెట్‌లో విడుదల చేసింది. Infinix Zero 30 పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ ఫోన్‌ 6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. 108MP+13MP డ్యూయల్‌ కెమెరా సెటప్‌, 50MP సెల్ఫీ కెమెరాను ఫోన్‌కు ఫిక్స్‌ చేశారు.  MediaTek Dimensity 8020 ప్రాసెసర్‌, 5000mAh బ్యాటరీని ఫోన్‌కు అందించారు. దీని ధర రూ. 23,999 వరకు ఉండనుంది. బ్యాంక్ ఆఫర్స్ ఇంకా రివీల్ కావాల్సి ఉంది. ఫ్లిఫ్‌కార్ట్‌ ఫ్లస్ మెంబర్స్‌కు ఈ ఫొన్ ప్రీ ఆర్డర్స్ స్టార్ట్ అయ్యాయి.

    Apple iPhone 15 series

    ఐఫోన్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న Apple iPhone 15 series మెుబైల్స్‌ ఈ నెలలోని రిలీజ్ కానున్నాయి. సెప్టెంబర్ 12న ఆపిల్.. వండర్ లస్ట్ పేరుతో జరిగే ఈవెంట్లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మోడల్స్ లాంఛ్ చేయనుంది. Apple iPhone 15 సిరీస్‌ మెుబైల్‌ 3nm ప్రాసెస్ టెక్నాలజీ ఆధారంగా కొత్త A17 బయోనిక్ చిప్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. Apple iPhone 15 ప్రో, ప్రో మాక్స్ మోడల్స్ A17 బయోనిక్ SOCని కలిగి ఉంటాయని తెలుస్తోంది. ఇండియాలో దీని ధర రూ.77,999 వరకు ఉండే ఛాన్స్ ఉంది.

    OnePlus Open foldable phone

    చైనాకు చెందిన ప్రముఖ మెుబైల్‌ కంపెనీ వన్‌ప్లస్ (OnePlus) ఈ నెలలోనే సరికొత్త ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లో రిలీజ్ చేయనుంది. ఇది 7.8 అంగుళాల ప్రైమరీ డిస్‌ప్లేతో పాటు, 6.3 అంగుళాల కవర్‌ పానెల్‌ను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్‌ రేటు అందించారు. Qualcomm Snapdragon 8 Gen 2 ప్రొసెసర్‌తో ఇది పనిచేయనుంది. 12GB RAM, 256GB ROM, 50MP ప్రైమరీ కెమెరా, 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెట్‌తో ఈ ఫోన్ రానుంది. 67W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 4800mAh బ్యాటరీ కూడా ఫిక్స్‌ చేశారు. దీని ధర రూ.1,24,999 వరకు ఉండే ఛాన్స్ ఉంది.

    Honor 90 series

    హానర్‌ 90 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్స్‌ కూడా నెలలోనే రానున్నట్లు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. Honor 90, Honor 90 Pro వేరియంట్లలో ఇది రిలీజ్‌ కానుంది. 6.7 అంగుళాల full-HD+ (1,200 x 2,664p) OLED డిస్‌ప్లేతో ఫోన్స్‌ రానున్నాయి. 120Hz రిఫ్రెష్‌ రేట్‌ను వీటికి అందించారు. Honor 90 వేరియంట్‌   200MP+12MP+2MP ట్రిపుల్‌ రెయర్‌ కెమెరా సెటప్‌ కలిగి ఉంది. Honor 90 Pro మెుబైల్‌ను 200MP+32MP+2MP కెమెరా సెటప్‌తో తీసుకొస్తున్నారు. హానర్‌ 90 సిరీస్‌.. 66W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ చేసే 5,000mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి. దీని ధర రూ.29000- రూ.30000 మధ్య ఉండే  ఛాన్స్ ఉంది.

     

    Samsung Galaxy S23 FE

    శామ్‌సంగ్ కస్టమర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫోన్లలో ‘శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్‌23 ఎఫ్‌ఈ’ (Samsung Galaxy S23 FE) ఒకటి. ఈ మెుబైల్‌ కూడా ఈ నెలలోనే రిలీజ్ కానున్నట్లు మార్కెట్‌ వర్గాల సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్‌కి 6.4 అంగుళాల FHD+ డిస్‌ప్లేను అమర్చినట్టు తెలుస్తోంది. ఫోన్ వెనుక భాగంలో 50MP ప్రైమరీ కెమెరా, 8MPసెకండరీ కెమెరాతో పాటు 12 MP టెలిఫోటో లెన్స్ కెమెరాను ఫిక్స్‌ చేశారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 10MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. బ్యాటరీ 4,500 mAh కాగా 25W ఫాస్ట్‌ఛార్జ్‌కు ఫోన్‌ సపోర్టు చేస్తుంది. దీని ధర రూ. 54,999 వరకు ఉండనుంది

    Google Pixel 8

    గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ (Google Pixel 8 Series) ఫోన్లను అక్టోబర్ 4న లాంఛ్ చేస్తున్నట్లు గూగుల్ వెల్లడించింది. పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో మోడల్స్ ఈ సిరీస్లో రానున్నాయి. ఇవి 6.17 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో రాబోతున్నాయి. 120 Hz రిఫ్రెష్‌ రేట్‌, 50 MP+12 MP డ్యూయల్ రియర్‌ కెమెరా, 10MP సెల్ఫీ కెమెరాను ఫోన్‌ కలిగి ఉంది. 24W ఫాస్ట్‌ ఛార్జ్ సపోర్టు చేసే 4485 mAh బ్యాటరీతో దీన్ని తీసుకొస్తున్నారు. ఇక దీని ధర రూ.55000- రూ.60000 మధ్య ఉండే అవకాశం ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version