Urvashi Apsara: శ్రీలీల కంటే ‘కిస్సిక్‌’ కొరియోగ్రాఫరే కస్సక్‌లా ఉందే? 
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Urvashi Apsara: శ్రీలీల కంటే ‘కిస్సిక్‌’ కొరియోగ్రాఫరే కస్సక్‌లా ఉందే? 

    Urvashi Apsara: శ్రీలీల కంటే ‘కిస్సిక్‌’ కొరియోగ్రాఫరే కస్సక్‌లా ఉందే? 

    January 2, 2025

    అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం అత్యంత భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలోని ‘కిస్సిక్‌’ సాంగ్ నార్త్, సౌత్ అన్న తేడా లేకుండా అన్ని భాషల ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. స్టార్ హీరోయిన్ శ్రీలీల వేసిన స్టెప్పులకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. అయితే ఈ సాంగ్‌ షూట్‌ సందర్భంగా హీరో అల్లు అర్జున్‌తో స్టెప్పులేసి ఓ యువతి నెట్టింట తెగ వైరల్ అయ్యింది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఊర్వశి అప్సర (Urvashi Apsara) అయిన ఆ యువతి తాజాగా మరోమారు కిస్సిక్‌ పాటకు స్టెప్పులేసి అదరగొట్టింది. దీంతో శ్రీలీల కంటే ఆమెనే చాలా బాగుందన్న కామెంట్స్‌ నెట్టింట గట్టిగా వినిపిస్తున్నాయి.

    శ్రీలీలను తలదన్నేలా..!

    టాలెంటెడ్‌ లేడీ కొరియోగ్రాఫర్‌ ఊర్వశి అప్సర (Urvashi Apsara) పేరు.. ప్రస్తుతం తెగ ట్రెండింగ్ అవుతోంది. కిస్సిక్‌ పాట (Kissik Song)కు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా ఆమె వర్క్ చేసింది. న్యూయర్‌ సందర్భంగా జనవరి 1న కిస్సిక్ సాంగ్‌కు స్టెప్పులేస్తూ నెట్టింట ఓ వీడియోను షేర్ చేసింది. అందులో అదిరిపోయే స్టెప్పులతో అదరగొట్టింది. ఎద, థైస్‌, నాబి అందాలు ఆరబోస్టూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ వీడియో చూసి ప్రతీ ఒక్కరూ ఫిదా అవుతున్నారు. కొందరైతే శ్రీలీల కంటే ఈమెనే కస్సక్‌లా ఉందంటూ పోస్టులు పెడుతున్నారు. ఆమె డ్యాన్స్‌ చేస్తుంటే చూపులు తిప్పుకోలేకపోతున్నామని కామెంట్స్ చేస్తున్నారు. ఆ వీడియోను మీరూ చూసేయండి. 

    బన్నీతో స్టెప్పులేసి ఫేమస్‌

    కిస్సిక్‌ సాంగ్ ప్రాక్టిస్ సందర్భంగా అల్లు అర్జున్‌తో ఊర్వశి అప్సర స్టెప్పులు వేసింది. డిసెంబర్‌ 22న ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో అప్సర పోస్టు చేసింది. క్షణాల వ్యవధిలోనే అది నెట్టింట వైరల్‌గా మారింది. మెరుపు తీగలా కదులుతూ మెస్మరైజింగ్ మూమెంట్స్‌తో అప్సర అదరగొట్టింది. ఆ వీడియో వైరల్ కావడంతో ఈ భామ ఎవరు? అంటూ అందరూ తెగ సెర్చ్‌ చేశారు. ఆమె అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌ అని తెలిసీ మరింత స్టన్ అయ్యారు. హీరోయిన్‌ తలదన్నే గ్లామర్‌ ఆమెదంటూ ప్రశంసలు కురిపించారు. ఇదిలా ఉంటే ‘పుష్ప’లోని ‘ఊ అంటావా.. ఊఊ అంటావా’ పాటకు సైతం ఊర్వశినే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేసింది. ఆ సాంగ్‌ కూడా బ్లాక్ బాస్టర్‌ అయిన సంగతి తెలిసిందే. 

    ఆమె గురించి ఇవి తెలుసా?

    ఊర్వశి అప్సర (Urvashi Apsara) విషయానికి వస్తే ఆమె కొరియోగ్రాఫర్‌తో పాటు నటి కూడా. బాలీవుడ్‌లో వచ్చిన ‘కిట్టి పార్టీ’, ‘డిసెంబర్‌ 31’, ‘అనంత్‌’, ‘పింటు కి పప్పి’ వంటి చిత్రాల్లో ఆమె నటించింది. గుజరాత్‌లో పుట్టిన ఆమె 100 పైగా పాటలకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేసింది. 2016లో డ్యాన్సర్‌గా కెరీర్ మెుదలుపెట్టి గణేష్ ఆచర్య దగ్గర అసిస్టెంట్‌గా జాయిన్‌ అయ్యింది. 2016లో ‘మిస్‌ ముంబయి’ అందాల పోటీల్లో పాల్గొని సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. ఆమెకు బెల్లీ డ్యాన్స్‌లోనూ ప్రావీణ్యం ఉంది. ఖాళీ సమయాల్లో డ్యాన్స్ రీల్స్‌ చేస్తూ సోషల్ మీడియాలోనూ బాగా పాపులర్‌ అయింది. అలాగే హాట్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తోంది. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version