Ustaad Bhagat Singh: ‘గ్లాస్‌ అంటే సైజ్‌ కాదు సైన్యం’.. ఏపీ ప్రభుత్వానికి పవన్‌ గట్టి కౌంటర్‌?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Ustaad Bhagat Singh: ‘గ్లాస్‌ అంటే సైజ్‌ కాదు సైన్యం’.. ఏపీ ప్రభుత్వానికి పవన్‌ గట్టి కౌంటర్‌?

    Ustaad Bhagat Singh: ‘గ్లాస్‌ అంటే సైజ్‌ కాదు సైన్యం’.. ఏపీ ప్రభుత్వానికి పవన్‌ గట్టి కౌంటర్‌?

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా డాషింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh). ఈ చిత్రంపై పవన్‌ ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ‘గబ్బర్‌ సింగ్‌’ లాంటి బ్లాక్‌బాస్టర్‌ తర్వాత వీరిద్దరూ కలిసి పనిచేస్తుండటంతో ఎక్స్‌పెక్టెషన్స్‌ తారా స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం పవన్‌ ఏపీ రాజకీయాల్లో బిజీ బిజీగా ఉన్నారు. జనసేన పార్టీ తరపున చాలా చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సినీ అభిమానులతో పాటు జనసైనికులకు మంచి బూస్టప్‌ ఇచ్చేలా ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ నుంచి మరో గ్లింప్స్‌ రిలీజైంది. ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 

    ‘గాజు పగిలేకొద్ది పదునెక్కుద్ది’

    భగత్‌ బ్లేజ్‌(Bhagath Blaze) పేరుతో రిలీజైన ఈ గ్లింప్స్‌ వీడియో ఆద్యాంతం అలరించింది. 1:02 నిమిషాల నిడివి కలిగిన ఈ వీడియోల పవన్ ఔట్‌ అండ్‌ ఔట్‌ యాక్షన్‌ లుక్‌లో కనిపించాడు. గ్లింప్స్‌లోకి వెళ్తే.. మెుదట విలన్‌ గ్యాంగ్‌లోని మనిషి పవన్‌ను ఉద్దేశించి నీ రేంజ్ ఇది అంటూ టీ గ్లాస్‌ను చూపించి కింద పడేస్తాడు. ఆ తర్వాత పవన్‌ కల్యాణ్‌.. ‘గాజు పగిలేకొద్ది పదునెక్కుద్ది’, ‘గ్లాస్ అంటే సైజ్‌ కాదు సైన్యం.. కనిపించని సైన్యం’ అంటూ పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌ చెప్పడం వీక్షకులకు గూస్‌బంప్స్‌ తెప్పించేలా ఉంది. దేవి శ్రీ ప్రసాద్ అందించిన బీజీఎం కూడా సూపర్‌గా అనిపించింది. ఈ గ్లింప్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.

    𝐁𝐇𝐀𝐆𝐀𝐓'𝐒 𝐁𝐋𝐀𝐙𝐄 | Ustaad Bhagat Singh | Pawan Kalyan | Sreeleela | Harish Shankar | DSP

    అధికార వైసీపీకి గట్టి కౌంటర్!

    ఏపీలోని అధికార వైసీపీకి గట్టి కౌంటర్‌ ఇచ్చేలా ఈ గ్లింప్స్‌ను రూపొందినట్లు సినీ వర్గాలు భావిస్తున్నాయి. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా పవన్‌ ఓడిపోయాడని.. ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాలేకపోయారని తరచూ అధికార పార్టీకి చెందిన నేతలు విమర్శిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్‌ను, జనసేన పార్టీని తక్కువగా చూస్తున్న వారికి గట్టి కౌంటర్‌ ఇచ్చేలా ఈ డైలాగ్స్ ఉన్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం గ్లింప్స్‌లోని ‘గాజు గ్లాస్‌’ డైలాగ్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

    పొలిటికల్‌ హీట్‌ పెంచిన డైలాగ్స్‌!

    మరి కొన్నిరోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరగనున్నాయి. పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేన పార్టీ.. టీడీపీ – భాజాపాతో పెట్టుకొని ఎన్నికల బరిలో దిగుతుంది. ఈ నేపథ్యంలో కావాలనే పొలిటికల్ హీట్ పెంచేలా ఈ గ్లింప్స్‌ను విడుదల చేశారని అటు రాజకీయ వర్గాల్లోనూ చర్చ మెుదలైంది. ఎన్నికల వేళ జనసైనికుల్లో ఫుల్‌జోష్‌ నింపేందుకు ఈ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారని అంటున్నారు. ఏదీ ఏమైనా పవన్ ఫ్యాన్స్ మాత్రం మాస్ ఈ గ్లింప్స్‌తో జాతర చేసుకుంటున్నారు. చాల రోజుల తర్వాత పవన్ కల్యాణ్‌ను ఇలా యాక్షన్ మోడ్‌లో చూడటం సంతోషంగా ఉందంటూ సంబురాలు చేసుకుంటున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version