ప్రేమ పక్షులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వాలెంటైన్స్‌డే రాబోతుంది. ఆ రోజు ఎలాగైనా సరే బాయ్‌ఫ్రెండ్ లేదా గర్ల్‌ఫ్రెండ్‌తో టైమ్ స్పెండ్ చేయాలని ప్లాన్స్ వేసుకంటుంటారు. కొంతమంది ఆరోజు తమ ప్రేమను తెలియజేసి వాలైంటైన్స్‌డేని తీపి గుర్తుగా మార్చుకుంటారు. కొంతమంది రిలేషన్‌షిష్‌లో ఉన్నవాళ్లు మరిన్ని మెమరీస్ క్రియేట్ చేసుకుంటారు. బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. ఇవన్నీ పక్కనపెడితే ఆరోజు ఏ డ్రెస్ వేసుకోవాలి. ఎలా రెడీ అవ్వాలి. గర్ల్‌ఫ్రెండ్‌ని లేదా బాయ్‌ఫ్రెండ్‌ని ఎలా ఇంప్రెస్ చేయాలో అర్థంకాక సతమతమవుతుంటారు. వారికి మేమిచ్చే టిప్స్ ఇవే. నచ్చితే ఫాలో అవ్వండి ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్‌గా ఇలా దీప్తి సునయనలా ఒక స్లీవ్‌లెస్ టాప్, జీన్స్ వేసుకొని కూల్ లుక్‌తో వెళ్లండి.
ట్రెడీషనల్ లుక్‌తో పాటు ట్రెండీగా రెడీ అవ్వాలనుకుంటున్నారా. అయితే ఇలా హారికను ఫాలో అయిపోండి. ఫ్లోరల్ టాప్‌కి ఇలా మ్యాచింగ్ షరారా బాటమ్‌తో రెడీ అవ్వండి. మంచి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ మేకప్ టచ్‌తో కలర్‌ఫుల్ లుక్‌ను ఇవ్వండి.
ఇక అసలే వాలెంటైన్స్‌డే. వాలెంటైన్స్ డే అంటేనే రెడ్ కలర్, రెడ్ రోజెస్, రెడ్ హార్ట్ సింబల్స్. ఆరోజు రెడ్ కలర్‌లో ఇలా అరియానాలా క్రాప్ టాప్ వేసుకోండి. ఎప్పుడూ కనిపించినట్లుగా కాకుండా ఇలా వెరైటీగా దర్శనమివ్వండి.
అబ్బాయిలూ ఇలా ఒక హుడీ టీషర్ట్ వేసుకొని వెళ్లండి. కావాలనుకుంటే దానిమీద ముందే మీరు ఏం ఎక్స్‌ప్రెస్ చేయాలనుకుంటున్నారో ప్రింట్ చేయించండి. మీరు చెప్పలేకపోయానా చూసినవాళ్లకి మీ మనసులోని మాట అర్థమవుతుంది.
సింపుల్‌గా ఇలా ఒక మీ పర్సనాలిటీకి నప్పే షర్ట్, జీన్స్ వేసుకొని రొమాంటిక్ లుక్‌తో వెళ్లి గర్ల్‌ఫ్రెండ్‌ను ఇంప్రెస్ చేయండి. ఎక్కువ హడావిడీ లేకుండా ఇలా సింపుల్‌గా కూడా ట్రై చేయొచ్చు.
మరో ఆప్షన్ ఏంటంటే రొటీన్‌గా కాకుండా అఖిల్‌లా ఇలా వెరైటీగా ట్రై చేయండి. బ్లాక్ అండ్ వైట్ కలర్ షర్ట్‌పై కాంట్రాస్ట్ కలర్ జాకెట్ వేసుకొని మ్యాచింగ్ షేడ్స్‌తో మీ లుక్ అదరగొట్టండి. చూడగానే స్టైల్‌గా ఉన్నాడు కదా అనిపించాలి.
ఇలా యాంకర్ రవిలా సింపుల్‌గా ఒక ఫుల్ హ్యాండ్స్‌తో టీషర్ట్ వేసుకొని షేడ్స్ పెట్టుకొని మ్యాచింగ్ షూస్ వేసుకొని ట్రై చేయండి. ఇలాంటి పూల చొక్కాలు కూడా మళ్లీ ఇప్పుడు ట్రెండీగా మారాయి. ఇలా కూల్ లుక్‌లో మీ ప్రేమ సక్సెస్ అవుతుందని నమ్ముకొని వెళ్లండి
అమ్మాయిలూ ఇలా లంగాఓణీలో కూడా ప్రయత్నించొచ్చు. ఫెస్టివల్ మూడ్‌లో పాజిటవ్ వైబ్స్‌లో హమీదాను చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో మీరూ ట్రై చేయండి
దివిలాగా ఇలాగా ఒక టాప్ వేసుకొని దానికి నప్పే జాకెట్ వేసుకోండి. ఇలా బ్లూ కలర్ టాప్‌పై వైట్ ఎంత బాగుందో కదా కావాలంటే జాకెట్ వేసుకోకుండా కూడా స్టైల్ చేయవచ్చు.
లహరిలాగా సింపుల్‌గా టాప్ జీన్స్ వేసుకొని వెళ్లండి
Celebrities Featured Articles Movie News Telugu Movies
Allu Arjun: థ్యాంక్యూ పవన్ కళ్యాణ్ మామయ్య.. వివదానికి పుల్ స్టాప్ పెట్టిన బన్నీ