VALENTINES DAY GIFTS FOR HIM: వీటితో.. మీ ప్రేమికుడి మనసు దోచేయండి!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • VALENTINES DAY GIFTS FOR HIM: వీటితో.. మీ ప్రేమికుడి మనసు దోచేయండి!

    VALENTINES DAY GIFTS FOR HIM: వీటితో.. మీ ప్రేమికుడి మనసు దోచేయండి!

    February 9, 2024

    వాలెంటైన్స్‌డే అనగానే అమ్మాయిల కన్నా అబ్బాయిలే ఎక్కువగా ప్లాన్‌ చేస్తుంటారు. కానీ అమ్మాయిలకూ తన వాడికి ఏదో ఒక గిఫ్ట్‌ ఇవ్వాలని ఉంటుంది కదా. అందుకే ఇది మీకోసం

    కస్టమైజ్‌డ్‌ కీచెయిన్‌

    మీ ప్రేమలో మునిగిఉన్న కుర్రాడు రోజులో ఎన్నిసార్లు మీరు కలిసున్న ఫోటోలు చూస్తాడో తెలుసా? అలాగే అబ్బాయిలు వారిని బైక్‌ను ఎంత ప్రేమిస్తారో తెలుసు కదా? అందుకే ఆ బైక్‌ కీచెయిన్‌కు మీ ఫోటోను కలిపే ఓ గిఫ్ట్‌ ఇస్తే ఎలా ఉంటుంది?

    వాచ్‌

    ప్రతి క్షణం నేను నీవెంటే ఉంటా అని చెప్పేలా మీ ప్రియుడికి ఓ చక్కటి వాచ్‌ కొనివ్వండి. కచ్చితంగా వాచీ చూసినప్పుడల్లా మీరే గుర్తొస్తారు.

    చొక్కా

    మీ ప్రియుడి టేస్ట్‌ ఏంటో మీకు తెలుసు కదా! అందుకు తగ్గట్టుగా ఓ మంచి చొక్కా కొనివ్వండి. తప్పకుండా నచ్చుతుంది.

    పెర్ఫ్యూమ్‌

    ఇది కూడా చొక్కా లాగే అతడి టేస్ట్‌కు తగినట్లుగా ఓ మంచి పెర్ఫ్యూమ్‌ కొనివ్వండి. రోజంతా వచ్చే సువాసనలో అతడికి మీరే స్పృశిస్తారు. 

    అందుకే నువ్వే రాజువి

    ఎప్పుడూ అబ్బాయిలే అమ్మాయిలకు ప్రపోజ్‌ చేస్తుంటారు. తన అందాన్ని పొగుడుతుంటారు. ఓ సారి అతడిలో మీకు నచ్చిన 20 అంశాలను పొగడండి. ప్రేమగా చెప్పండి. కుర్రాడి ఆనందానికి హద్దులుండవు. ఈ గిఫ్ట్‌ అందుకోసమే.

    లవ్‌ అగ్రీమెంట్‌

    సాధారణంగా మనీతో ముడిపడి ఉన్న ప్రతిదానికీ అగ్రీమెంట్‌ ఉంటుంది. మనసుతో ముడిపడిన ప్రేమకు మాత్రం నమ్మకమే అగ్రీమెంట్‌. కాకపోతే ఈ ఫన్నీ లవ్‌ అగ్రీమెంట్‌ మీ ప్రియుడిని సర్‌ప్రైజ్ చేస్తుంది.  

    ఉంగరం

    ఉంగరం అంటే ప్రామిస్‌. అందుకే ఎంగేజ్‌మెంట్‌లో పెళ్లికి ప్రామిస్‌గా ఉంగరం తొడుగుతారు. జీవితకాల బంధానికి సూచనగా నిలిచే ఉంగరం ప్రియుడి మనసులో మీ స్థానాన్ని మరింత సుస్థిరం చేస్తుంది.

    ప్రియమైన గ్లాసు

    ఈ మధ్య మన ఫోటో, టెక్స్ట్‌ ఏదైనా మనం కోరుకున్నది గ్లాస్‌పై ప్రింట్‌ చేసేసి ఇచ్చేస్తున్నారు. మార్నింగ్‌ కాఫీ కప్పుతోనే మీ ప్రేమను అతగాడికి గుర్తుచేయాలనుకుంటే మీరు జంటగా ఉన్న ఓ చక్కటి ఫోటోను ప్రింట్ చేయించి ఇవ్వండి.

    ఫోటో ఫ్రేమ్‌

    మన ఫోన్లో వేల ఫోటోలు ఉన్నా తనతో ఉన్న ఆ ఒక్క ఫోటో ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది కదా! ఆ ప్రత్యేకతను చూపించండి మరి. ఓ చక్కటి ఫోటో ఫ్రేమ్‌ కొని అందులో మీ ఫోటో పెట్టి ఇవ్వండి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version