Vamshhi Krrishna: ఒకే ఓవర్‌లో 6 సిక్స్‌లు బాదిన ఆంధ్ర క్రికెటర్.. ఎలా కొట్టాడంటే..!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Vamshhi Krrishna: ఒకే ఓవర్‌లో 6 సిక్స్‌లు బాదిన ఆంధ్ర క్రికెటర్.. ఎలా కొట్టాడంటే..!

    Vamshhi Krrishna: ఒకే ఓవర్‌లో 6 సిక్స్‌లు బాదిన ఆంధ్ర క్రికెటర్.. ఎలా కొట్టాడంటే..!

    February 21, 2024

    ఆంధ్రప్రదేశ్‌లోని కడపలో జరుగుతున్న కల్నల్‌ సీకే నాయుడు ట్రోఫీ (Col CK Nayudu Trophy)లో ఆంధ్రా బ్యాటర్‌ వంశీ కృష్ణ(Vamshhi Krrishna) విధ్వంసం సృష్టించాడు. రైల్వే జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు బాది ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు. రైల్వే జట్టు బౌలర్‌ దమన్‌దీప్‌ సింగ్‌ వేసిన ఓవర్‌లో ప్రతీ బంతిని సిక్స్‌గా మలిచిన వంశీ కృష్ణ.. ఆ ఓవర్‌లో ఏకంగా 36 పరుగులు రాబట్టాడు. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 64 బంతుల్లో 110 రన్స్‌తో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. వంశీ కృష్ణ ఆరు సిక్సులకు సంబంధించిన వీడియోను బీసీసీఐ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది. 

    ఎలా కొట్టాడంటే!

    బౌలర్‌ దమన్‌దీప్‌ సింగ్‌.. తన తొలి బంతిని ఔట్‌సైడ్‌ వైపు వేయగా దానిని స్వీప్‌ ఆడి మరి వంశీ సిక్స్‌గా మలిచాడు. తర్వాత స్లాట్‌లో పడ్డ రెండో బంతిని.. లాంగ్‌ ఆన్‌ దిశగా బౌండరి వెలుపలికి తరలించాడు. వంశీకి చెక్‌ పెట్టే ఉద్దేశంతో మూడో బాల్‌ను ఫుల్‌ లెంగ్త్‌ డెలివరీ వేయగా దాన్ని కూడా అలవోకగా సిక్స్‌ బాదాడు. ఇక నాలుగో బంతి కూడా స్లాట్‌లో పడటంతో దాన్నీ స్టాండ్స్‌లోకి పంపి వంశీ ఆరు పరుగులు రాబట్టాడు. ఐదో బంతిని కూడా తొలి బంతిలాగే స్వీప్‌ ఆడి లెగ్‌సైడ్‌ వైపు స్టాండ్స్‌లోకి పంపాడు. ఆరో బంతిని సైతం బ్యాక్‌ఫుట్‌లో సిక్స్‌గా మలిచి వంశీ సంబరాలు చేసుకున్నాడు. రెండు చేతులు పైకెత్తి డగౌట్‌లో ఉన్న సహచరులతో తన సంతోషాన్ని పంచుకున్నాడు. 

    దిగ్గజాల సరసన చోటు

    వంశీ కృష్ణ ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు బాది ఈ ఘనత సాధించిన నాల్గో భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. గతంలో రవిశాస్త్రి, యువరాజ్‌, రీసెంట్‌గా యంగ్‌ క్రికెటర్‌ రుత్‌రాజ్‌ గైక్వాడ్‌ ఇలాగే ఆరు బంతులకు ఆరు సిక్స్‌లు కొట్టి ఈ జాబితాలో వంశీ కృష్ణ కంటే ముందున్నారు. ఇప్పటివరకూ పెద్దగా పరిచయం లేని వంశీ కృష్ణ ఈ ఇన్నింగ్స్‌తో ఒక్కసారిగా బీసీసీఐ దృష్టిలో పడటం గమనార్హం. వీడియోలో అతడి ఆటను చూసిన నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. భవిష్యత్‌లోనూ మరింత మెరుగైన ప్రదర్శన చేసి టీమిండియాలో చోటు సంపాదించాలని సూచిస్తున్నారు. 

    7 బంతుల్లో 7 సిక్స్‌లు!

    టీమిండియా యువ ఆటగాడు రుత్‌రాజ్‌ గైక్వాడ్‌.. 2022లో జరిగిన విజయ్ హజారే ట్రోఫీలో సరికొత్త రికార్డు సృష్టించాడు. మహారాష్ట్రకు సారథ్యం వహిస్తున్న రుత్‌రాజ్‌ ఏకంగా ఒకే ఓవర్లో ఏడు సిక్స్‌లు బాదాడు. ఈ టోర్నీ  క్వార్టర్స్ ఫైనల్స్‌లో భాగంగా ఉత్తర్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఓపెనింగ్‌ బ్యాటర్‌ ఈ అరుదైన ఘనత సాధించాడు. శివ సింగ్ వేసిన 49 ఓవర్‌లో వరుసగా నాలుగు బంతులను రుతురాజ్ సిక్సర్లు బాదగా.. ఐదో బంతిని బౌలర్‌ నోబాల్‌గా వేసాడు. ఆ బంతిని కూడా సిక్స్ బాదిన రుతురాజ్ తర్వాతి రెండు బంతులను కూడా స్టాండ్స్‌కు తరిలించాడు.

    యువరాజ్‌ సిక్సర్లకు 15 ఏళ్లు

    టీ20ల్లో ఆరు బంతులకు ఆరు సిక్స్‌లు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది స్టార్ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌. 2007 సెప్టెంబర్‌ 19న ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్‌ ఈ ఘనత సాధించాడు. ఇంగ్లాండ్‌ బౌలర్‌ స్టువర్ట్ బ్రాడ్‌ను లక్ష్యంగా చేసుకొని అతడి ఓవర్‌లో మెుత్తంగా 36 పరుగులు పిండుకున్నాడు. అయితే మ్యాచ్‌కు ముందు అప్పటి ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ ఆండ్రూ ఫ్లింటాఫ్‌తో యువరాజ్‌కు మధ్య చిన్న వాగ్వాదం జరిగింది. యువరాజ్‌కు అసభ్యకర సంజ్ఞలు చేస్తూ ఫ్లింటాఫ్‌ అతడ్ని రెచ్చగొట్టాడు. దీంతో యువరాజ్‌ తర్వాతి ఓవర్‌లోనే ఆరు సిక్స్‌లు బాది ఫ్లింటాఫ్‌కు గట్టి కౌంటర్ ఇవ్వడం విశేషం. ఈ సూపర్బ్‌ ఇన్నింగ్స్‌కు గతేడాది సెప్టెంబర్‌తో 15 ఏళ్లు పూర్తైంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version