విక్టర్ బౌట్: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • విక్టర్ బౌట్: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్

    విక్టర్ బౌట్: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్

    July 31, 2022
    in India, News

    unknown

    ఓ మోస్ట్ వాంటెండ్ క్రిమినల్ ను అమెరికా చెర నుంచి విడిపించేందుకు రష్యా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అసలు ఎవరీ విక్టర్ బౌట్ అతనికెందుకు అంత ప్రాధాన్యత?
    1967లో పుట్టిన విక్టర్ బౌట్ సోవియట్ సైన్యంలో ట్రాన్స్‌లేటర్‌గా పనిచేశాడు. సోవియట్ పతనమయ్యాక అంతర్జాతీయ రవాణా వ్యాపారిగా మారాడు. ఆ తర్వాత ఆయుధ వ్యాపారిగా ఎదిగాడు. విశ్వవ్యాప్తంగా ఉగ్ర, రెబల్ గ్రూపులతో సంబంధాలు పెట్టుకొన్నాడు. అనేక దేశాలకు విక్టర్ నెట్ వర్క్ విస్తరించింది. ఇతడి వద్ద యాంటినోవ్‌, ఇల్యూషన్‌, యకోవ్‌లెవ్‌ వంటి కార్గో విమానాలు ఉన్నాయి. వీటితో ట్యాంకులు, హెలికాప్టర్లు, టన్నుల కొద్దీ ఆయుధాలను ప్రపంచంలోని ఏ మూలకైనా చేరవేయగలడు. ఆఖరుకు ఐరాస కూడా తమ శాంతి పరిరక్షక దళాన్ని సోమాలియాకు చేర్చడానికి, ఐరాస ఆహార సాయాన్ని కాంగోకు చేర్చడానికి విక్టర్‌ విమానాలు వినియోగించారు. హాలీవుడ్‌లో నికోలస్‌ కేజ్‌ నటించిన ‘లార్డ్‌ ఆఫ్‌ వార్‌’ విక్టర్‌ బౌట్‌ను ఉద్దేశించి తీసిందేనట. అయితే అమెరికా పక్కా ప్రణాళికతో సినీ ఫక్కీలో 2008లో విక్టర్ ను అరెస్ట్ చేసింది. కానీ రష్యా మాత్రం విక్టర్ తమ దేశ వాణిజ్య వేత్తగా చెబుతోంది. విక్టర్ సైతం తనపై కేసు రాజకీయ దురుద్దేశపూరితమైనదని వాదిస్తున్నాడు. ప్రస్తుతం రష్యాలో అరెస్టైన ఇద్దరు అమెరికన్లకు బదులుగా విక్టర్ ను విడుదల చేసేందుకు అమెరికా అంగీకరించింది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version