విజయ్ దేవరకొండ టాప్-5 బెస్ట్ యాక్టింగ్ సీన్స్
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • విజయ్ దేవరకొండ టాప్-5 బెస్ట్ యాక్టింగ్ సీన్స్

    విజయ్ దేవరకొండ టాప్-5 బెస్ట్ యాక్టింగ్ సీన్స్

    May 9, 2022

    రౌడీ‌బాయ్ విజయ్ దేవరకొండ అందానికి, అభినయానికి, యాటిట్యూడ్‌కి రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలామంది అభిమానులు ఉన్నారు. అంతకుముందు ఎన్ని సినిమాలు చేసినా అంతగా దక్కని గుర్తింపు అర్జున్ రెడ్డి సినిమాతో దక్కింది. తనదైన నటనతో, ఫైట్లతో, యువతను ఆకట్టుకునే డైలాగులతో ఎప్పటికప్పుడూ విభిన్న రోల్స్ చేస్తున్న ఈ డైనమిక్ హీరో నేడు తన పుట్టిన రోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా అతడు హీరోగా నటించిన మూవీస్‌లో టాప్-5 బెస్ట్ సీన్స్ ఏంటో ఓ సారి చూసేద్దాం.

    1.పెళ్లి చూపులు(2016)

    విజయ్ దేవరకొండ-రీతూ వర్మ కాంబోలో వచ్చిన రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ మూవీలో ప్రతి సీను నవ్వించేలా ఉంటుంది. ప్రియదర్శి, అభయ్ బేతిగంటితో విజయ్ నటించిన సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి. హీరోయిన్ ఫుడ్ ట్రక్ సామాన్‌కి ఇచ్చిన డబ్బును నైట్ హీరో, అతడి స్నేహితులు కలిసి తాగి పబ్‌లో వారు పేల్చిన డైలాగులు హాస్యాన్ని పుట్టిస్తాయి.

    2.అర్జున్‌రెడ్డి(2017)

    సందీప్‌రెడ్డి వంగ దర్శకత్వం వహించిన ఈ మూవీ విజయ్ దేవరకొండ, శాలినీ పాండేలకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ చిత్రంతో హీరోయిన్ షాలినీ పాండేను ఏడిపించిన అమిత్‌ని విజయ్ దేవరకొండ కొట్టిన తీరు, వాడితో చెప్పిన ఎమోషనల్ డైలాగులు విజయ్ నటనకు తార్కాణంగా నిలిచాయి. ఈ సీన్ ఇప్పటికీ యువతలో చెరగని ముద్ర వేసుకుంది.

    3.గీత గోవిందం(2018)

    రష్మిక మంధాన, విజయ్ దేవరకొండ మధ్య నడిచిన ప్రతి సన్నివేశం సినీప్రియులను అలరించింది. ఈ మూవీ క్లైమాక్స్‌లో హీరో, హీరోయిన్ నటించిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. విజయ్ అమాయకంగా నటించి యువతకు మరింత చేరువయ్యాడు. ఈ మూవీలో పూర్తిగా క్లాస్ కుర్రాడిలా కనిపించాడు. పరశురాం ఈ మూవీకి దర్శకత్వం వహించారు.

    https://youtu.be/Ogv8i1IucHE

    4.నోటా(2018)

    విజయ్ దేవరకొండ పవర్‌ఫుల్ యాక్టింగ్‌తో ఈ మూవీలో అదరగొట్టాడు. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అంతగా సక్సెస్ సాధించనప్పటికీ హీరోగా విజయ్‌కి మాత్రం గుర్తింపు దక్కింది. ఓ పొలిటికల్ లీడర్ క్యారెక్టర్‌లో అతడు చెప్పిన డైలాగులు, చేసిన యాక్టింగ్ యువతను బాగా ఆకట్టుకున్నాయి. ఈ మూవీలో మెహ్రీన్ హీరోయిన్‌గా నటించారు.

    5.వరల్డ్ ఫేమస్ లవర్(2020)

    ఈ మూవీలో విజయ్ దేవరకొండ ముగ్గురు హీరోయిన్లతో మూడు క్యారెక్టర్లలో నటించారు. రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేశ్, క్యాథరిన్ ట్రెసాతో విభిన్న క్యారెక్టర్లతో ఇతడు నటించిన విధానం మూవీకి హైలెట్‌గా నిలిచాయి. రాశీఖన్నా, విజయ్ మధ్య సాగిన లవ్ అండ్ రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. తన గెటప్ పూర్తిగా మార్చి విజయ్ ఈ సినిమాలో నటించాడు. ఈ మూవీకి క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version