‘విక్ర‌మ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
 • Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ‘విక్ర‌మ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

  ‘విక్ర‌మ్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

  June 30, 2022

  క‌మ‌ల్ హాస‌న్ , ప‌హాద్ ఫాజిల్, విజ‌య్ సేతుప‌తి న‌టించిన ‘విక్ర‌మ్’ మూవీ జూన్ 2న థియేట‌ర్ల‌లో విడుద‌లై భారీ స‌క్సెస్ సాధించింది. ఇప్ప‌టికే ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.400 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. అయితే తాజాగా విక్ర‌మ్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ మూవీ డిస్నీ+హాట్‌స్టార్‌లో జులై 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. చాలాకాలం త‌ర్వాత క‌మ‌ల్‌కు ఈ సినిమా మంచి స‌క్సెస్‌ను ఇచ్చింది. విక్ర‌మ్‌ను క‌మ‌ల్ స్వ‌య‌గా రాజ్ క‌మ‌ల్ ఫిల్మ్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ బ్యాన‌ర్‌పై నిర్మించాడు. ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడు లోకేశ్ క‌న‌గ‌రాజ్ సృష్టించిన ప్ర‌పంచం ప్రేక్ష‌కుల‌కు బాగా న‌చ్చింది. సూర్య అతిథి పాత్ర‌లో క‌నిపించి ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు పొందుతున్నాడు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
  Exit mobile version