కిచ్చా సుదీప్ హీరోగా నటించిన ‘విక్రాంత్ రోణ’ మూవీ నేడు థియేటర్లలో విడుదలైంది. నిరూప్ భండారీ, నీతా అశోక్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రల్లో నటించారు. అనూప్ భండారి దర్శకత్వం వహించాడు. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించాడు. జాక్ మంజునాథ్, అలంకార్ పాండియన్ నిర్మాతలుగా వ్యవహరించారు. యాక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ అంచనాలను పెంచింది. దీంతో పాటు రా రా రక్కమ్మ పాట సోషల్‌మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. మరి సినిమా ఎలా ఉంది కథేంటో తెలుసుకుందాం
కథేంటంటే..
కర్ణాటకలోని కొమరట్టు అనే గ్రామంలో జరిగే కథ ఇది. ఆ ఊరిలో ఒక పోలీస్ ఆఫీసర్ అనుమానాస్పదంగా మరణిస్తాడు. ఆ మిస్టరీని చేందించేందుకు ఇన్‌స్పెక్టర్ విక్రాంత్ రోణ (సుదీప్) వస్తాడు. ఆ ఇన్వెస్టిగేషన్‌లో మరో 16 మంది చిన్నపిల్లలు కూడా ఆ గ్రామంలో హత్య జరిగినట్లు తెలుసుకుంటాడు. ఆ హత్యలకు, పోలీసాఫీసర్ హత్యకు, విక్రాంత్ రోణకు ఉన్న సంబంధం ఏంటి. ఇంతకీ ఆ హత్యలు చేసిందెవరు విక్రాంత్ రోణ ఈ కేసును ఎలా ఛేదిస్తాడు అనేదే కథ
విశ్లేషణ:
కథ ప్రారంభంలో మంచి థ్రిల్లింగ్ సన్నివేశాలతో ఆరంభమవుతుంది. విక్రాంత్ రోణ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించిన తర్వాత కథలో వేగం పుంజుకుంటుంది. అయితే ఇలాంటి స్టోరీలో మధ్యలో లవ్‌స్టోరీ, కామెడీ రావడంతో ట్రాక్ తప్పినట్లు అనిపిస్తుంది. ఆ సన్నివేశాలు అంతగా అతికినట్లు కనిపించవు. అయితే ఇంటర్వెల్ సమయానికి వచ్చే ట్విస్ట్ అదరిపోతుంది. దీంతో సెకండాఫ్‌లో ఏం జరగబోతుందోనన్న ఆసక్తి పెరుగుతుంది. కిచ్చా సుదీప్ నటన, యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లాయి. రారా రక్కమ్మ పాట థియేటర్లలోనూ సందడి చేసింది. సెకండాఫ్ మొత్తం రివేంజ్ డ్రామాలా ఉంటుంది. విక్రాంత్ రోణ గతం, క్లైమాక్స్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సినిమా మొత్తానికి అక్కడక్కడా కొన్ని థ్రిల్లింగ్ సీన్స్‌లో మధ్యలో వచ్చే బోరింగ్ సీన్స్‌తో సాగిపోతుంది.
ఎవరెలా చేశారంటే..
స్టైలిష్ ఇన్‌స్పెక్టర్‌గా సుదీప్ తన పాత్రలో అదరగొట్టాడు. యాక్షన్ సన్నివేశాలు, డైలాగ్స్ బాగున్నాయి. నిరూప్ భండారి పాత్ర మొదటినుంచి కాస్త బోరింగ్‌గా అనిపించినా చివరికి థ్రిల్‌ను పంచుతుంది. జాక్వెలిన్ కనిపించింది కాసేపయినప్పటికీ అందచందాలతో ఆకట్టుకుంది. కథలో ఇతర పాత్రలకు పెద్దగా ప్రాధాన్యత లేదు.
సాంకేతిక విషయాలు:
దర్శకుడు అనూప్ భండారీ రాసుకున్న కథలో థ్రిల్లింగ్ సీన్స్ బాగున్నప్పటికీ అక్కడక్కడా వచ్చే కొన్ని సీన్లు బోర్ కొట్టిస్తాయి. ఇక ఆర్ట్ వర్క్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అజనీష్ మ్యూజిక్, విలియం సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
బలాలు:
సుదీప్
ఆర్ట్ వర్క్, మ్యూజిక్
యాక్షన్ ఎపిసోడ్స్
బలహీనతలు:
రొటీన్ సన్నివేశాలు
సెకండాఫ్
Celebrities Featured Articles Hot Actress
Arrchita Agarwaal: శరీరం అలా ఉంటేనే ఇండస్ట్రీలోకి రావాలి: బాలీవుడ్ నటి