VIRAL PIC: రెస్టారెంట్‌లో హీరోయిన్‌తో డేటింగ్‌లో నాగచైతన్య!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • VIRAL PIC: రెస్టారెంట్‌లో హీరోయిన్‌తో డేటింగ్‌లో నాగచైతన్య!

    VIRAL PIC: రెస్టారెంట్‌లో హీరోయిన్‌తో డేటింగ్‌లో నాగచైతన్య!

    March 29, 2023

    అక్కినేని నట వారసుడు నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల మధ్య రిలేషన్‌ ఉందంటూ చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. శోభిత హైదరాబాద్‌ వచ్చినపుడు పూర్తిగా చైతూతోనే ఉందని అతడి కొత్త ఇంటికి కూడా వెళ్లిందని సోషల్‌ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనికి తోడు వీరు కలిసి దిగిన ఫోటో ఒకటి గతంలో వైరల్‌ అయింది. తాజాగా మరో ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

    ఇద్దరూ కలిసి రెస్టారెంట్‌కు వెళ్లినట్లుగా తెలుస్తున్న ఈ ఫోటోతో ఇప్పుడు వీరు డేటింగ్‌లో ఉన్న వార్తలు నిజమేనని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. వీరు డిన్నర్‌ డేట్‌కే వెళ్లారంటూ చర్చించుకుంటున్నారు. సమంత అభిమానులు నాగచైతన్యను ట్రోల్‌ చేయడం కూడా మొదలు పెట్టారు. సామ్‌-చై విడిపోయినప్పుడు అందరూ సమంతనే నిందించారని ఇప్పుడు గురుడి అసలు రూపం భయటపడుతోందంటూ విమర్శిస్తున్నారు.

    గతంలో దిగిన ఓ ఫొటో లండన్‌లో దిగినట్లు సమాచారం.  ఈ ఇద్దరి నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా వీళ్లు ఇలా కలిసి ఫొటోలకు పోజులిచ్చారని సినిమా ఇండస్ట్రీలోని కొందరు చెప్పారు. కానీ చైతూ తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికే యూకే వెళ్లినట్లు అప్పట్లో చర్చ జరిగింది.  

    అయితే చైతూ అభిమానులు అప్పట్లో ఈ వార్తలను బలంగా తిప్పికొట్టారు. సమంత కావాలనే ఈ పుకార్లు సృష్టిస్తోందంటూ ఎదురుదాడి చేశారు. సోషల్‌ మీడియా వేదికగా చైతూ-సమంత ఫ్యాన్స్‌ మధ్య పెద్ద వార్‌ జరిగిందని చెప్పొచ్చు. శోభిత ధూళిపాళ్ల కూడా మిడిల్‌ ఫింగర్‌ చూపించి ఈ వార్తల పట్ల ఘాటుగా స్పందించారు. 

    ప్రస్తుతం నాగచైతన్య ‘కస్టడీ’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. వెంకట్‌ప్రభు దర్శకత్వంలో యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే విడుదలైన టీజర్‌  కూడా ఆసక్తికరంగా ఉంది. 

    మరోవైపు సమంత ‘శాకుంతలం’ విడుదలకు సిద్ధమవుతోంది. గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా..ఈ మైథాలాజికల్‌ డ్రామా 14 ఏప్రిల్‌న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version