Visa Free Countries 2023: కేవలం పాస్‌పోర్ట్‌తో ఈ దేశాలను చుట్టిరావొచ్చు.. వీసా లేకున్నా ఫర్వాలేదు!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Visa Free Countries 2023: కేవలం పాస్‌పోర్ట్‌తో ఈ దేశాలను చుట్టిరావొచ్చు.. వీసా లేకున్నా ఫర్వాలేదు!

    Visa Free Countries 2023: కేవలం పాస్‌పోర్ట్‌తో ఈ దేశాలను చుట్టిరావొచ్చు.. వీసా లేకున్నా ఫర్వాలేదు!

    August 4, 2023

    విదేశీ పర్యటనలు అంటే చాలా మంది ఎగిరి గంతేస్తారు. కొత్త ప్రదేశాలు, రుచులు, పరిచయాలు అవి అందిస్తాయని భావిస్తారు. అయితే విదేశీ పర్యటన చాలా మందికి ఒక కలగానే మిగులుతుంది. ఎందుకంటే, విదేశీ ట్రిప్స్‌ వేయడానికి పాస్‌పోర్టుతో పాటు ఆయా దేశాలు జారీ చేసే వీసాలు తప్పనిసరి. అయితే, భారతీయులు కొన్ని దేశాలకు వీసా లేకుండానే వెళ్లడం సాధ్యమన్న విషయం మీకు తెలుసా?. మీరు విన్నది నిజమే.. కేవలం పాస్‌పోర్టు ద్వారానే తమ ప్రాంతంలోని సుందరమైన ప్రదేశాలను వీక్షించే వెసులు బాటును పలు దేశాలు కల్పిస్తున్నాయి. అంతర్జాతీయంగా మన దేశానికి ఉన్న ప్రాముఖ్యం రీత్యా అనేక దేశాలు భారతీయులకు ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. మరి వీసా లేకుండా ఎన్నిదేశాల్లో పర్యటించవచ్చు? పాస్‌పార్టు ఇండెక్స్‌ భారత్‌ ర్యాంక్‌ ఎంత? వంటి విషయాలు ఈ  కథనంలో తెలుసుకుందాం. 

    భారత్‌ ర్యాంక్‌ ఎంతంటే?

    ఇటీవల విడుదలైన ‘హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్‌’ (Henley Passport Index) నివేదికలో గతేడాదితో పోలిస్తే భారత్‌ ర్యాంకు మెరుగైంది. 2022లో 85వ ర్యాంకులో ఉన్న భారత్‌.. ఈ ఏడాది తన ర్యాంకును మరింత మెరుగుపరుచుకుని 80వ స్థానానికి ఎగబాకింది. అటు అంతర్జాతీయంగా భారత్‌కు ఉన్న ప్రాముఖ్యత రీత్యా ఇటీవల భూటాన్‌, నేపాల్‌ కూడా ఇక్కడి ప్రజలకు వీసా ఫ్రీ సదుపాయాన్ని కల్పించాయి. కజికస్తాన్‌ కూడా వీసాతో పనిలేకుండా భారతీయులు 14 రోజులు తమ దేశంలో పర్యటించవచ్చని ప్రకటించింది. దీంతో భారత్‌కు వీసా ఫ్రీ ట్రావెల్‌ కల్పిస్తున్న దేశాల సంఖ్య 57కు చేరింది.

    వీసా ఫ్రీ దేశాలు 

    1. బార్బడోస్

    2. భూటాన్

    3. బొలీవియా

    4. బ్రిటిష్ వర్జిన్ దీవులు

    5. బురుండి

    6. కంబోడియా

    7. కేప్ వెర్డే దీవులు

    8. కొమొరో దీవులు

    9. జిబౌటి 

    10. డొమినికా

    11.  El Salvador

    12. ఫిజీ

    13. గాబోన్

    14. గ్రెనడా

    15. గినియా-బిస్సావు

    16. హైతీ

    17. ఇండోనేషియా 

    18. ఇరాన్

    19. జమైకా

    20. జోర్డాన్ 

    21. కజకిస్తాన్

    22. లావోస్

    23. మకావు 

    24. మడగాస్కర్ 

    25. మాల్దీవులు

    26. మార్షల్ దీవులు 

    27. మౌరిటానియా 

    28. మారిషస్

    29. మైక్రోనేషియా

    30. మోంట్సెరాట్

    31. మొజాంబిక్ 

    32. మయన్మార్

    33. నేపాల్

    34. నియు

    35. ఒమన్

    36. పలావు దీవులు

    37. ఖతార్

    38. రువాండా*

    39. సమోవా 

    40. సెనెగల్

    41. సీషెల్స్

    42. సియర్రా లియోన్ 

    43. సోమాలియా

    44. శ్రీలంక 

    45. St. లూయిస్ కిట్స్ -నెవిస్

    46. St. లూసియా *

    47. St. విన్సెంట్

    48. టాంజానియా 

    49. థాయిలాండ్ 

    50. తైమూర్-లెస్టే

    51. టోగో

    52. ట్రినిడాడ్ 

    53. టొబాగో

    54. ట్యునీషియా

    55. తువాలు

    56. వనాటు

    57. జింబాబ్వే

    ఈ దేశాలకు వీసాలు తప్పనిసరి

    ‘హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్‌’లో అమెరికా, చైనా వంటి దేశాలతో పోలిస్తే భారత్‌ చాలా వెనకబడి ఉంది. భారత్‌కు చాలా దేశాలు ఫ్రీ వీసా సదుపాయాలు కల్పించకపోవడమే ఇందుకు కారణం. ప్రస్తుతం 177 దేశాలు భారతీయులు తమ దేశంలో ప్రవేశించేందుకు వీసాలు తప్పనిసరి చేశాయి. చైనా, జపాన్‌, రష్యా, అమెరికా, ఐరోపా కంట్రీలకు వెళ్లాలంటే భారతీయులకు ఆయా దేశాల అనుమతి అవసరం. 

    సింగపూర్‌ టాప్‌

    ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్టును కలిగిన దేశంగా సింగపూర్‌ నిలిచింది. జపాన్‌ను వెనక్కినెట్టి మరి అగ్రస్థానం కైవసం చేసుకుంది. హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్‌ నివేదిక ప్రకారం సింగపూర్‌ పౌరులు ఎలాంటి వీసా అవసరం లేకుండా 192 దేశాల్లో పర్యటించవచ్చు. మరోవైపు ఈ జాబితాలో గత ఐదేళ్లుగా అగ్రస్థానంలో ఉన్న జపాన్‌ తాజాగా మూడో స్థానానికి పడిపోయింది. పలు దేశాలు ఫ్రీ వీసా సౌలభ్యాన్ని తొలగించడమే ఇందుకు కారణమని సమాచారం. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version