Vivo V40e: సెప్టెంబర్ 25న సరికొత్త ఫొన్ లాంచ్.. యూత్‌ను అట్రాక్ట్ చేసే సూపర్బ్ ఫీచర్లు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Vivo V40e: సెప్టెంబర్ 25న సరికొత్త ఫొన్ లాంచ్.. యూత్‌ను అట్రాక్ట్ చేసే సూపర్బ్ ఫీచర్లు

    Vivo V40e: సెప్టెంబర్ 25న సరికొత్త ఫొన్ లాంచ్.. యూత్‌ను అట్రాక్ట్ చేసే సూపర్బ్ ఫీచర్లు

    September 21, 2024
    Vivo V40e

    Vivo V40e

    చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో, తన తాజా V-సిరీస్‌లో భాగంగా భారత మార్కెట్‌లోకి Vivo V40Ve ను విడుదల చేయనుంది. ఈ హ్యాండ్‌సెట్, ఇప్పటికే విడుదలైన Vivo V40 ప్రో,  Vivo V40 మోడల్స్‌కు జతగా వస్తుందని అంచనా. కంపెనీ ఇంతవరకు ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఎటువంటి వివరాలను అధికారికంగా ప్రకటించలేదు, అయినప్పటికీ బెంచ్‌మార్కింగ్ వెబ్‌సైట్లలో దీని వివరాలు లీకయ్యాయి. ముఖ్యమైన ఫీచర్ల వివరాలు ఆన్‌లైన్‌లో వైరల్ అవతున్నాయి. వాటిపై ఓలుక్ వేద్దాం.

    Vivo V40e లాంచ్  డేట్

    Vivo V40e సెప్టెంబర్ 25న విడుదల కానుంది. ఈ హ్యాండ్‌సెట్ ధర ఎంత అనే దానిపై ఇంకా ఎటువంటి సమాచారం లేదు. లాంచింగ్ సమయంలో దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. Vivo V40e “రాయల్ బ్రాంజ్” రంగులో లభ్యమవుతుందని తెలుస్తోంది.

    Vivo V40e స్పెసిఫికేషన్లు

    Vivo V40eలో కర్వ్డ్ డిస్‌ప్లే ఉండబోతుందని, దీని పీక్ బ్రైట్‌నెస్ 4,500 నిట్స్ అని నివేదికలో పేర్కొంది. అంతేకాకుండా, గత లీకుల ప్రకారం, Vivo V40e ఫన్‌టచ్ OS 14 (ఆండ్రాయిడ్ 14) ఆధారంగా పనిచేస్తుందని, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌తో రానుందని సమాచారం.

    ఈ నివేదిక ప్రకారం, Vivo V40e 5,500mAh బ్యాటరీతో రానుందని తెలిసింది. ఇది ఈ సంవత్సరం విడుదలైన ఇతర మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లతో పోటీపడనుంది. దీని ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యం 80W ఉంటుందని అంచనా.

    గత నెలలో, ఈ హ్యాండ్‌సెట్ భారత్‌కు చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) వెబ్‌సైట్‌లో V203 మోడల్ నంబర్‌తో లిస్ట్ చేయబడింది. అదేవిధంగా, Vivo V40e Geekbenchలోనూ కనిపించింది. దీని డైమెన్సిటీ 7300 SoC ప్రాసెసర్, 8GB RAM రానుందని తెలిసింది.

     ఇక దీని కెమెరా విషయానికొస్తే..వివో V40e ముందు భాగంలో 50MP AF సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. దీనికి అదనంగా, ఈ స్మార్ట్‌ఫోన్‌లో పలు AI పోర్ట్రెయిట్ సూట్‌లు, 4K వీడియో రికార్డింగ్ ఫీచర్లు ఉంటాయి. వివో V40e, ఈ ఫోన్‌కు IP65 రేటింగ్ ఉండి వాటర్, డస్ట్ రెసిస్టెంట్‌ను కలిగి ఉంది. దీంతో పాటు Vivo V40e 90 గంటల ప్లేబాక్ టైం, 20 గంటల వీడియో ప్లేబాక్ టైం కలిగి ఉంటుంది.

    Vivo V40e ధర

    ఈ గ్యాడ్జెట్‌ను మీడియం బడ్జెట్‌లో తీసుకొస్తున్నారు. ధర రూ.30,000 వేల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version