Vivo Y77T 5G Review: వివో నుంచి మరో అత్యాధునిక ఫోన్‌.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు! 
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Vivo Y77T 5G Review: వివో నుంచి మరో అత్యాధునిక ఫోన్‌.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు! 

    Vivo Y77T 5G Review: వివో నుంచి మరో అత్యాధునిక ఫోన్‌.. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు! 

    August 21, 2023

    భారత్‌లో మంచి క్రేజ్‌ ఉన్న మెుబైల్‌ తయారీ కంపెనీల్లో వివో ఒకటి. ఈ కంపెనీ విడుదల చేసే స్మార్ట్‌ఫోన్లకు భారత్‌లో మంచి మార్కెట్‌ ఉంది. మెుబైల్‌ ప్రియులు ఎక్కువగా వివో ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఆ కంపెనీ నుంచి ఏ చిన్న ఫోన్ విడుదలైన అది ఆసక్తిని పెంచుతుంటుంది. తాజాగా వివో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్‌ చేసింది. ఈ మెుబైల్‌ను Vivo Y77T 5G పేరుతో చైనాలో అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలో భారత్‌లోనూ ఈ స్మార్ట్‌ఫోన్ విడుదల కానున్నట్లు వివో వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఈ ఫోన్‌ ప్రత్యేకతలు ఏంటీ? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి? కలర్స్‌, ధర వంటి అంశాలను ఇప్పుడు చూద్దాం. 

    ఫోన్‌ స్క్రీన్‌ / డిస్‌ప్లే

    Vivo Y77T 5G స్మార్ట్‌ఫోన్‌ను 6.64 అంగుళాల Full HD+ IPS LCD స్కీన్‌తో తీసుకొచ్చారు. ఇది 2388×1080 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్‌ రేట్‌ను ఫోన్‌కు ‌అందించారు. 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో రూపొందించారు. ఆక్టా కోర్‌ MediaTek Dimensity 7020 SoC ప్రొసెసర్‌తో ఈ మెుబైల్‌ వర్క్‌ పనిచేయనుంది. దీనికి Android 13 OS సపోర్ట్‌ చేయనుంది.

     స్టోరేజీ సామర్థ్యం

    Vivo Y77T 5G మెుబైల్‌ రెండు వేరియంట్లలో స్టోరేజ్‌ సామర్థ్యాన్ని కలిగి ఉంది. 8GB RAM / 128GB LPDDR4x ROM, 12GB RAM / 256GB UFS 2.2 ROM వేరియంట్లలో ఇది అందుబాటులోకి రానుంది. Micro SD కార్డు ద్వారా స్టోరేజ్‌ సామర్థ్యాన్ని మరింత పెంచుకునే వెసులుబాటును కల్పించారు. 

    బ్యాటరీ

    Vivo Y77T 5G స్మార్ట్‌ఫోన్‌కు 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని అందించారు. ఇది 44w ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. దీని సాయంతో మెుబైల్‌ను వేగంగా ఛార్జ్‌ చేసుకోవచ్చు. ఎలాంటి అవాంతరాలు లేకుండా 24 గంటలకు పైగా మెుబైల్‌ను ఉపయోగించవచ్చని వివో వర్గాలు తెలిపాయి. 

    కెమెరా క్వాలిటీ

    Vivo Y77T 5G ఫోన్‌ను మంచి కెమెరా క్వాలిటీతో తీసుకొచ్చారు. ఈ మెుబైల్‌ వెనక భాగంలో డ్యూయల్‌ రియర్‌ కెమెరా సెటప్‌ను ఫిక్స్‌ చేశారు. ఇందులో 50MP ప్రైమరీ కెమెరాతో పాటు, 2MP డెప్త్‌ సెన్సార్‌ కెమెరా ఉంది. వీటితో సాయంతో క్వాలిటీ ఫొటోలు తీసుకోవచ్చని వివో వర్గాలు తెలిపాయి. ఇక ఫ్రంట్‌ సైడ్‌ 8MP సెల్ఫీ కెమెరాను అమర్చారు. 

    కలర్స్‌

    వివో వై77టి 5G మెుబైల్‌ మెుత్తం మూడు రంగుల్లో చైనాలో విడుదలైంది. బ్లాక్, బ్లూ, గోల్డెన్‌ రంగుల్లో ఈ ఫోన్‌ విక్రయాలు జరుగుతున్నాయి. భారత్‌లోనూ ఇవే కలర్స్‌లో మెుబైల్ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. 

    ధర ఎంతంటే?

    భారత్‌లో వివో Y77t 5G మెుబైల్‌ ధరలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే మన కరెన్సీ ప్రకారం చైనాలో 8GB RAM+128GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 16వేలకు విక్రయిస్తున్నారు. 12GB RAM+256GB స్టోరేజ్‌ వేరియంట్‌ను రూ.18వేలకు అమ్ముతున్నారు. భారత్‌లోనూ దాదాపు ఇవే ధరలు ఉండొచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనిపై వివోనే స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

     

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version