VNRTri0: నితిన్‌, రష్మిక, వెంకీ కుడుముల సినిమా లాంఛ్‌… త్వరలోనే షూటింగ్‌
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • VNRTri0: నితిన్‌, రష్మిక, వెంకీ కుడుముల సినిమా లాంఛ్‌… త్వరలోనే షూటింగ్‌

    VNRTri0: నితిన్‌, రష్మిక, వెంకీ కుడుముల సినిమా లాంఛ్‌… త్వరలోనే షూటింగ్‌

    March 24, 2023

    నితిన్‌, రష్మిక మందన్న, వెంకీ కుడుముల కాంబినేషన్‌లో మరో చిత్రం లాంఛ్ అయ్యింది. VNRTrioగా సినిమాను ప్రారంభించారు. మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టారు.సంక్రాంతికి సూపర్ హిట్లు అందించిన దర్శకులు బాబి, గోపిచంద్‌ మలినేనితో పాటు హను రాఘవపూడి, బుచ్చిబాబు కూడా హాజరయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై సినిమా నిర్మితమవుతోంది.

    వేరే లెవెల్‌

    సినిమా అనౌన్స్‌మెంట్‌ను కూడా క్రేజీగా చేశారు. ఓ ఫన్నీ వీడియోను క్రియేట్ చేసి రిలీజ్ చేసింది చిత్రబృందం. లేట్ అయ్యానా ? అని వెంకీ అడగ్గా… బాగా అంటూ నితిన్‌, రష్మిక, సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ చెప్పడంతో వీరి కాంబినేషన్‌లో ఎప్పుడో రావాల్సిన సినిమా ఆలస్యమయ్యిందన్నట్లుగా తీర్చిదిద్దారు. ముందు సినిమాల కంటే ఈ చిత్రం వేరే లెవెల్‌లో ఉంటుందని దర్శకుడు చెప్పడం కొసమెరుపు.

    ఎలా ఉంటుందో?

    వీరి కాంబినేషన్‌లో వచ్చిన భీష్మ కమర్షియల్‌గా మంచి సక్సెస్‌. మరోసారి కలిసి పనిచేస్తుండటంతో అదిరిపోయే స్క్రిప్ట్‌ను వెంకీ కుడుముల తీర్చిదిద్దాడని టాక్. ఛలో సినిమా నుంచి కామెడీ, యాక్షన్ తరహా యూత్‌ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ తెరకెక్కించాడు ఈ దర్శకుడు. ఈ సారి మరింత అద్భుతంగా ఉంటుందని టాక్. ఇందులో ఊహించలేనంత ట్విస్ట్‌లు ఉంటాయని తెలుస్తోంది. 

    చిరు ఎందుకు వచ్చాడు?

    మైత్రీ మూవీ బ్యానర్‌లో వాల్తేరు వీరయ్య సినిమా తీశాడు చిరంజీవి. ఇటీవల పెద్ద హిట్ అయ్యింది. మరోవైపు ఇప్పటికే వెంకీ కుడుముల ఓ కథ చెప్పాడని.. దాన్ని చిరు ఓకే చేశాడని టాక్ వినిపిస్తోంది. మంచి ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటుందని వినికిడి. అందుకే చీఫ్ గెస్ట్‌గా చిరంజీవి వచ్చాడని సినీ వర్గాలు వెల్లడించాయి.

    సెంటిమెంట్‌

    మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైనా చీఫ్ గెస్ట్‌గా వచ్చారంటే సినిమా హిట్ అని భావిస్తాడు నితిన్. ఇష్క్ ఆడియో ఫంక్షన్‌కు పవన్ కల్యాణ్ వచ్చాడు. ఆ తర్వాత కూడా  మరో ప్రీ రిలీజ్ వేడుకలో మెరిసాడు పవర్ స్టార్. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి రావటంతో ఇది కూడా హిట్ అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ కామెంట్లు పెడుతున్నారు.

    షూటింగ్ షురూ

    చిత్రాన్ని అతి త్వరలో సెట్స్‌ పైకి తీసుకెళ్లనుంది చిత్రబృందం. వేగంగా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version