MUNUGODE BYPOLL: మునుగోడులో ఈ కులాల ఓటర్లే కీలకం!
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • MUNUGODE BYPOLL: మునుగోడులో ఈ కులాల ఓటర్లే కీలకం!

    MUNUGODE BYPOLL: మునుగోడులో ఈ కులాల ఓటర్లే కీలకం!

    October 14, 2022

    మునుగోడులో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.  ఓటర్లకు దగ్గరయ్యేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. అధికార పార్టీ టీఆర్ఎస్ సహా కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతలు  మునుగోడు నియోజక వర్గంలోనే తిష్ట వేశారు.  గెలుపు కోసం అన్ని రకాల మార్గాలను అన్వేషిస్తున్నారు.  ముఖ్యంగా నియోజకవర్గంలోని సామాజిక సమీకరణాలపై దృష్టిసారించారు. వివిధ కులాలకు చెందిన ముఖ్యనేతలకు గాలం వేసే పనిలో తలమునకలై  ఉన్నారు. ఫలితంగా  ఆ సామాజిక వర్గం ఓట్లను గంపగుత్తగా తమ ఓటు బ్యాంకుగా మలచుకోవాలని పావులు కదుపుతున్నారు.  మునుగోడు నియోజకవర్గంలో  ఏ సామాజిక వర్గం వారు అధికంగా ఉన్నారు..? ఏ కులస్తుల ఓట్లు ప్రభావం చూపిస్తాయి..? బీసీల ఓట్లు ఎన్ని..? ఎస్సీ, ఎస్టీ ఓట్లు ఎలా ఉన్నాయనే అంశంపై చర్చ జరుపుతున్నారు. అందుకనుగుణంగా వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు.

    మునుగోడులో కులాల వారిగా ఓట్లు

    మునుగోడు నియోజకవర్గంలో ఓ సారి సామాజిక సమీకరణాలను పరిశీలిస్తే… ఈ నియోజక వర్గంలో  మొత్తం ఓటర్లు -2,20,520. వీటిలో  అత్యధికంగా గౌడ సామాజిక వర్గం  35,150 (15.94 శాతం) ఓట్లు కలిగి ఉంది. ఆ తర్వాత ముదిరాజ్‌లు -33,900 (15.37 శాతం),  ఎస్సీ మాదిగ-25,650 (11.63 శాతం),  యాదవ-21360 (9.69 శాతం),  పద్మశాలీ-11,680 (5.30 శాతం) ఓట్లు కలిగి ఉన్నారు.

    1. ఎస్టీ లంబాడీ-ఎరుకల-10,520 (4.77 శాతం)

    2. ఎస్సీ మాల-10,350 (4.69 శాతం)

    3. వడ్డెర-8350 (3.79 శాతం)

    4. కుమ్మరి-7850 (3.56 శాతం)

    5. విశ్వ బ్రాహ్మణ-7,820 (3.55 శాతం)

    6. రెడ్డి-7,690(3.49 శాతం)

    7. ముస్లింలు-7,650 (3.47 శాతం)

    8. కమ్మ-5,680(2.58 శాతం)

    9. ఆర్యవైశ్య-3,760 (1.71 శాతం)

    10. వెలమ-2,360 (1.07 శాతం)

    11. మున్నూరు కాపు-2,350(1.07శాతం)

    12. ఇతరులు-18,400( 8.34 శాతం)

    కులసంఘాల మద్దుతు కోసం.. టీఆర్ఎస్

    కులాలవారిగా ఓట్ల రిపోర్టును దగ్గర పెట్టుకున్న ప్రధాన పార్టీలు ఆయ కులాల అగ్రనాయకులను పార్టీల్లోకి ఆహ్వానిస్తాయి. ఈ అంశంలో టీఆర్ఎస్ ఇతర పార్టీల కన్నా కాస్త ముందంజలో ఉంది. ఈ నియోజకవర్గంలో గౌడ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండటంతో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ను రంగంలోకి దింపింది. ఆయన చేత మునుగోడులో విస్తృత ప్రచారం చేపిస్తోంది. ఈక్రమంలో  రాష్ట్ర గౌడ సంఘం నాయకులు పల్లే లక్ష్మణ్, బాలగోని  బాలరాజు.. శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో టీఆర్ఎస్‌కు మునుగోడులో మద్దతు ప్రకటించారు. అలాగే మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దుతు ఇస్తున్నట్లు మున్నూరు కాపు సంఘం తెలిపింది.  హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సమక్షంలో  వారు తమ నిర్ణయాన్ని ప్రకటించారు.

    సెంటిమెంట్‌నే నమ్ముకున్న కాంగ్రెస్

    అటు కాంగ్రెస్, బీజేపీ సైతం  ఆయా కులాల వారిని తమవైపు తిప్పుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి  ఇంటింటి ప్రచారం మొదలు పెట్టారు. గడపగడకు కాంగ్రెస్ పేరిట.. నియోజకవర్గంలో మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. పసుపు కుంకుమ, గాజులు పెట్టి సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. 

    వ్యూహాత్మకంగా వ్యవహరిస్తన్న బీజేపీ

    అటు బీజేపీ అగ్రనాయకత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. హుజూరాబాజ్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను ప్రచారానికి వాడుకుంటోంది.  మునుగోడు అభివృద్ధి కోసమే కోమటి రెడ్డి రాజగోపాల్ రాజీనామా చేశారనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఈక్రమంలో వివిధ సామాజిక వర్గాల పెద్దలను పార్టీలోకి ఆహ్వానిస్తోంది.

    మొత్తానికి ఇలా కులాలవారీగా పక్కాగా లెక్కలు వేసుకొని ప్రణాళికలు అమలు చేస్తున్న పార్టీలకు మునుగోడు ఉపఎన్నికలో ఏ మేరకు ఫలితం లభిస్తోందో వేచి చూడాల్సి ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version