వార్ 2 చిత్రంలో ఆ పాత్రకు ఎన్టీఆర్ మినహా ఎవ్వరిని సంప్రదించలేదని నిర్మాత ఆదిత్య చోప్రా తెలిపారు. ఎన్టీఆర్‌ను దృష్టిలో ఉంచుకొని క్యారెక్టర్‌ను డిజైన్ చేశామని వెల్లడించారు. ఈ సినిమాకు సంబంధించి దాదాపు 5 నెలలుగా చర్చలు జరిగాయి. చివరకు మార్చి చివర్లో స్ప్రిప్ట్ వర్క్ పూర్తయ్యింది. కథ డిమాండ్ మేరకు హృతిక్, జూనియర్ ఎన్టీఆర్ వంటి సూపర్ స్టార్లను తీసుకున్నామని మేకర్స్ తెలిపారు.
వార్ 2 సినిమా కోసం ఎన్టీఆర్ కంటే ముందు ప్రభాస్, విజయ్ దేవరకొండను సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. వారు రిజెక్ట్ చేసిన తర్వాతే వార్-2 ఎన్టీఆర్ వద్దకు చేరినట్లు సోషల్ మీడియాలో వదంతులు వ్యాపించాయి. దీనిపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆందోళన చెందారు. వారు కాదనుకున్న కథ మా అన్న దగ్గరకు వచ్చిందా అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతూ అసహనం వ్యక్తం చేశారు. అయితే వార్-2 నిర్మాత ఇచ్చి క్లారిటీతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లోకి వెళ్లిపోయారు. తమ హీరో వార్-2 సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి ఘనంగా ఎంట్రీ ఇస్తాడని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్‌ఆర్‌ఆర్ చిత్రంతో ఎన్టీఆర్ పాన్ ఇండియా లెవల్‌లో క్రేజ్ సంపాదించుకున్నాడు. అందులో ఎన్టీఆర్ నటనకు బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారు. ఈ నేపథ్యంలో డైరెక్ట్ హిందీ మూవీలో చేయనుండటం, అది కూడా దిగ్గజ నటుడు హృతిక్‌తో తెరను పంచుకోనుండటం ఎన్టీఆర్‌కు కలిసిరానుంది. ఇప్పటికే బాలీవుడ్‌లో రిలీజైన ‘వార్’ చిత్రం సూపర్ హిట్‌గాా నిలిచింది. తొలి పార్ట్‌లో హృతిక్‌తో పాటు బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ నటించాడు. డ్యాన్స్, ఫైట్లతో అదరగొట్టాడు. మరీ వార్-2లో ఎన్టీఆర్ ఎలా చేస్తాడన్న అంశం ఇప్పటి నుంచే ఆసక్తి రేపుతోంది.
ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్‌లో సినిమా వస్తుండటంపై పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు పెరిగిపోతున్నాయి. తారక్, హృతిక్ కలిసి డ్యాన్స్ చేస్తే ఓ రెంజ్‌లో ఉంటుందని ఇప్పటినుంచే ప్రచారం జరుగుతోంది. పోరాట సన్నివేశాల్లో హృతిక్, ఎన్టీఆర్ నటన చూస్తే థియేటర్లలో ఎవరూ కుదురుగా కూర్చోలేరని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ దెబ్బకు ఆర్‌ఆర్‌ఆర్ రికార్డ్స్ కూడా చెరిగిపోతాయని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్