ఉక్రెయిన్‌తో యుద్ధం జరుగుతున్న వేళ సైన్యంలో చేరిన వాలంటీర్ల నుంచి రష్యాకు నిరసన సెగ తగిలింది. వేతనాలు చెల్లించడం లేదని తక్షణమే చెల్లించే వరకు పోరాడబోమని చెబుతున్న ఓ [వీడియో](url) సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సైన్యంలో చేరితే తమ కుటుంబాలకు చెల్లిస్తామన్న సుమారు 5000 డాలర్లు ఇంకా ఇవ్వలేదని వారు పేర్కొన్నారు. అవి ఇచ్చే వరకు తాము సహాయ నిరాకరణ చేస్తామని హెచ్చరించారు. యుద్ధం కోసం రెట్టింపు జీతం చెల్లిస్తామని మాస్కో వాలంటీర్లను చేర్చుకుంది.
వేతనాలు ఇస్తేనే యుద్ధం: రష్యా సైన్యం

© Envato