Who should Balakrishna invite as guests to Unstoppable 2?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Who should Balakrishna invite as guests to Unstoppable 2?

    Who should Balakrishna invite as guests to Unstoppable 2?

    July 20, 2022

    బాల‌కృష్ణ హోస్ట్ చేసిన అన్‌స్టాప‌బుల్ షోలో 10 ఎపిసోడ్‌ల‌లో మోహ‌న్‌బాబు, నాని, బ్ర‌హ్మానందం, ర‌వితేజ‌, రాజ‌మౌళి, మ‌హేశ్‌బాబు, అఖండ టీమ్, పుష్ప టీమ్, రానా, లైగ‌ర్ టీమ్ వ‌చ్చారు.  అయితే ఇంకా కొంత‌మంది సెల‌బ్రిటీలు షోకి రావాల‌ని ప్రేక్ష‌కులు కోరుకుంటున్నారు. త్వ‌ర‌లో అన్‌స్టాప‌బుల్ 2 ప్రారంభ‌మ‌వుతుంద‌ని చెప్తున్నారు కాబ‌ట్టి ఆ సీజ‌న్‌లో బాల‌కృష్ణ ఇంకా ఎవ‌రెవ‌రిని అతిథులుగా తీసుకొస్తే బాగుంటుంది. ప్రేక్ష‌కులు ఎవ‌ర్ని ఈ షోలో చూడాల‌ని కోరుకుంటున్నారు. ఎవ‌రు వ‌స్తే సీజ‌న్ మ‌రో లెవ‌ల్‌లో ఉంటుందో చూద్దాం.

    చిరంజీవి

    మెగా కుటుంబానికి, నంద‌మూరి కుటుంబానికి ఒక కోల్డ్ వార్ న‌డుస్తుంటుంద‌ని ఇండ‌స్ట్రీలో అంటుంటారు. రీసెంట్‌గా ఎన్‌టీఆర్ కూడా ఆర్ఆర్ఆర్ ప్ర‌మోష‌న్స్‌లో ఈ విష‌యం బ‌య‌ట‌పెట్టాడు. సినిమాల ప‌రంగాను, రాజ‌కీయాల్లోనూ రెండు కుటుంబాల‌దీ వేర్వేరు దృక్ప‌థం. అందుకే ఎక్క‌డా వాళ్లిద్ద‌రు మాట్లాడుకుంటూ ప్రేక్ష‌కుల‌కు క‌నిపించిన సంద‌ర్భాలు చాలా త‌క్కువ‌.దీంతోపాటు 1980లో నాటీ టాప్ న‌లుగురు హీరోల్లో మెగాస్టార్, బాల‌కృష్ణ ఇద్ద‌రు. వాళ్ల మ‌ద్య సినిమాలో గ‌ట్టి పోటీ ఉండేది.  అందుకే బాల‌య్య‌-చిరు ఇద్ద‌రు ఒక‌ స్క్రీన్‌పై క‌నిపించి వారి కుటుంబ, వ్య‌క్తిగ‌త విష‌యాలు మాట్లాడుకుంటే ప్రేక్ష‌కుల‌కు చాలా న‌చ్చుతుంది. 

    విజ‌య శాంతి

    ఒక‌ప్పుడు విజ‌య శాంతి అంటే లేడీ అమితాబ్ బ‌చ్చ‌న్ అనేవారు. ఇప్పుడు పాలిటిక్స్‌లోకి వెళ్లి సినిమాలకు దూర‌మైంది కానీ అప్ప‌ట్లో తెలుగులో టాప్ హీరోయిన్‌గా నిలిచింది. బాల‌కృష్ణ‌-విజ‌య‌శాంతి క‌లిసి చాలా సినిమాల్లో న‌టించారు. వాళ్లు ఇప్పుడు పాత‌రోజుల గురించి, వాళ్ల మ‌ధ్య ఉన్న ఫ్రెండ్‌షిప్ గురించి మాట్లాడుతుంటే అది చూసేందుకు చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. అందరూ విజ‌య‌శాతంతిని అన్‌స్టాప‌బుల్ 2లో చూడాల‌ని ప్రేక్ష‌కులు కోరుకుంటున్నారు.

    చంద్ర‌బాబు నాయుడు

    అంద‌రు మూవీ సెలబ్రిటీస్ కాకుండా ఒక రాజ‌కీయ నాయ‌కుడిని తీసుకొస్తే చూసేందుకు ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అందులోనూ చంద్ర‌బాబు నాయుడు బాల‌కృష్ణ‌కు వియ్యంకుడు. వాళ్ల ఇద్ద‌రి మ‌ద్య అనుబందం, ఎన్‌టీఆర్‌, రాజ‌కీయాల గురించి వాళ్లు ఏం మాట్లాడుకుంటారో చూసేందుకు ఆస‌క్తిగా ఉండొచ్చు.

    ఎన్‌టీఆర్

    బాబాయ్-అబ్బాయ్‌ని ఒకేసారి ఒక షోలో చూడాల‌ని ఎవ‌రికి ఉండ‌దు. అది కూడా బాల‌య్య ఎన్‌టీఆర్‌ని ఎలాంటి ప్ర‌శ్న‌లు అడుగుతాడు.  చిన్న‌ప్ప‌టినుంచి వాళ్లిద్ద‌రి మ‌ద్య అనుబందం ఎలా ఉంటుంది. ఇలాంటి ఎవ‌రికి తెలియ‌ని విష‌యాలు బ‌య‌ట‌కు తెలిసే అవ‌కాశం ఉంది. కాబ‌ట్టి ఎన్‌టీఆర్ కూడా అన్‌స్టాప‌బుల‌కి రావాల‌ని నంద‌మూరి ఫ్యాన్స్‌తో పాటు సామాన్య ప్రేక్ష‌కులు ఆశిస్తున్నారు. ఒక‌వేళ ఎన్‌టీఆర్ వ‌స్తే ఆ ఎపిసోడ్ ఒక రేంజ్‌లో ఉండే అవ‌కాశం ఉంది.

    స‌న్నీ లియోన్

     ఇక ఔట్ ఆఫ్ ది బాక్స్  ఆలోచిస్తే తెలుగు హీరోలు హీరోయిన్లు కాకుండా ఒక ఇంట‌ర్నేష‌న‌ల్ న‌టి, అది కూడా తెలుగు షోలో.. అది బాల‌య్య షోలో క‌నిపిస్తే ఎలా ఉంటుంది. అయితే ఇప్ప‌టికే స‌న్నీ లియోన్ తెలుగులో కొన్ని సినిమాల్లో క‌నిపించింది. కానీ అన్‌స్టాప‌బుల్‌లో బాల‌య్య అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌న్నీ ఎలా స‌మాధానాలు చెప్తుంది అని ఆస‌క్తిగా చూస్తారు. దీంతో పాటు ఇది ఎప్పుడు ఊహించ‌ని కాంబినేష‌న్ ఆ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్‌గా ఉండే అవ‌కాశం ఉంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version