క్రిప్టో కరెన్సీ అంటే ఏమిటి ?… ఎక్కడ ఈ కరెన్సీ క్రయ విక్రయాలు జరపాలి ? పూర్తి సమాచారం ఇందులో..
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • క్రిప్టో కరెన్సీ అంటే ఏమిటి ?… ఎక్కడ ఈ కరెన్సీ క్రయ విక్రయాలు జరపాలి ? పూర్తి సమాచారం ఇందులో..

    క్రిప్టో కరెన్సీ అంటే ఏమిటి ?… ఎక్కడ ఈ కరెన్సీ క్రయ విక్రయాలు జరపాలి ? పూర్తి సమాచారం ఇందులో..

    February 10, 2022

    క్రిప్టో కరెన్సీ ఇది పరిచయం అవసరం లేని పేరు. ఎలాన్ మస్క్ లాంటి పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా ఇందులో పెట్టుబడులు పెడుతున్నారు. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ క్రిప్టోపై బడ్జెట్లో కూడా ప్రస్తావించారు. క్రిప్టోపై 30 శాతం ట్యాక్స్ విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు త్వరలోనే భారతీయ డిజిటల్ కరెన్సీని తీసుకొస్తున్నట్లు చెప్పారు. దీంతో క్రిప్టో కరెన్సీపై దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అసలు క్రిప్టో కరెన్సీ అంటే ఏమిటని తెగ సెర్చ్‌లు చేస్తున్నారు. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మంచిదా కాదా అని ఆలోచిస్తున్నారు.

    క్రిప్టో కరెన్సీ అంటే డిజిటల్ కరెన్సీ. ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ మీద ఆధారపడి ఉంటుంది. దీనిని మనం ప్రత్యక్షంగా చూడలేము, ముట్టలేము. ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేయాలంటే ఆన్లైన్‌లో చేయాల్సి ఉంటుంది. డిజిటల్ చెల్లింపులకు మాత్రమే ఇది పనికొస్తుంది. క్రిప్టో కరెన్సీలో చాలా రకాల కాయిన్స్ ఉన్నాయి. అందులో ప్రముఖంగా బిట్ కాయిన్, ఇథేరియమ్, డోజ్ కాయిన్, షీబా ఇను, కార్దనో, తాజాగా మెటావర్స్ కాయిన్స్ బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే క్రిప్టో కరెన్సీ చాలా మందికి తెలిసినా వాటిని ఎక్కడ కొనాలి, ఎలా కొనాలో మాత్రం తెలియదు. వాటిని ట్రేడింగ్ చేయడానికి ఇండియాలో ఏదైనా సౌకర్యాలు ఉన్నాయా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

    సాధారణంగా ఏదైనా క్రిప్టో కాయిన్ కొనాలన్నా, స్టాక్ కొనాలన్నా వాటికి ఎక్స్‌చేంజ్ ప్లాట్ ఫాంలు ఉంటాయి. ఇండియాలో ఇంటర్నెట్ వినియోగం పెరిగిన తరువాత ఇలాంటి ప్లాట్ ఫాంలు చాలానే పుట్టుకొచ్చాయి. అయితే ఇండియాలో బిట్ కాయిన్, ఇథేరియమ్ లాంటి ప్రముఖ క్రిప్టో కరెన్సీలను కొనేందుకు కొన్ని ప్లాట్ ఫాంలు ఉన్నాయి వాటి ఆధారంగా మనం క్రిప్టో కరెన్సీ క్రయ విక్రయాలు జరుపుకోవచ్చు. వీటి ద్వారా సులభంగా క్రిప్టో ట్రాన్సాక్షన్స్ కూడా చేసుకోవచ్చు.

    ఇండియాలో క్రిప్టో కరెన్సీని కొనాలన్నా వాటిని విక్రయించాలన్నా కొన్ని క్రిప్టో ఎక్సేంజెస్ ఉన్నాయి. వాటిలో వాజిరెక్స్, కాయిన్ డీసీఎక్స్, కాయిన్ స్విచ్, బిట్ బీఎన్ఎస్ ఇలా చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయి. ఈ ప్లాట్‌ఫార్మ్స్ నుంచి బిట్ కాయిన్, ఇథేరియమ్, డోజ్ కాయిన్, షీబా ఇను లాంటి కాయిన్స్‌లను కొనొచ్చు. దీంతో పాటు పలు ఇంటర్నేషనల్ ఎక్సేంజెస్ కూడా ఉన్నాయి. వాటిలో బైనాన్స్, కాయిన్ మార్కెట్ క్యాప్, హౌబి గ్లోబల్, కాయిన్ బేస్, రాబిన్‌హుడ్ లాంటి ఎన్నో క్రిప్టో ఎక్స్చేంజ్ ప్లాట్‌ఫార్మ్స్ అందుబాటులో ఉన్నాయి.

    కొన్ని కారణాల వల్ల భారీగా కుప్పకూలిన క్రిప్టో మార్కెట్లు మళ్లీ పుంజుకుంటున్నాయి. భారత్‌లో క్రిప్టో ట్యాక్సెస్ అంటూ ప్రకటన రావడంతో క్రిప్టో ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో క్రిప్టో కరెన్సీ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. అందులో ప్రపంచంలో అత్యంత విలువైన, అత్యంత ప్రాచుర్యం పొందిన బిట్ కాయిన్ ఫిబ్రవరి 10వ తేదీన ఒక శాతం పెరిగి $44,139 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుంది. దీంతో పాటు రెండవ అతి విలువైన ఇథెరియం కూడా 4 శాతం పెరిగి $3,190 డాలర్ల వద్ద ట్రేడవుతుంది. అటు అత్యంత ఆదరణ కలిగిన డోజ్ కాయిన్, షీబా ఇను కాయిన్స్ కూడా లాభాలతోనే ప్రారంభమయ్యాయి. డోజ్ కాయిన్ $0.15 వద్ద, షీబా ఇను $0.000032 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version