వందేభారత్‌ రైలు సగటు వేగం ఎంతంటే?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • వందేభారత్‌ రైలు సగటు వేగం ఎంతంటే?

    వందేభారత్‌ రైలు సగటు వేగం ఎంతంటే?

    April 19, 2023

    Screengrab Twitter:VandeBharatExp

    వందే భారత్‌ రైళ్ల సగటు వేగం గడిచిన రెండేళ్లలో 83 కిలోమీటర్లుగా ఉందని రైల్వే శాఖ తెలిపింది. ఒక రూట్లో మాత్రం గరిష్ఠంగా 95 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని పేర్కొంది. ఈ మేరకు సమాచార హక్కు చట్టం కింద దాఖలైన దరఖాస్తుకు సమాధానం ఇచ్చింది. 2021-22లో వందే భారత్‌ రైళ్లు సగటున 84.48 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగా 2022-23 సంవత్సరంలో 81.38 కిలోమీటర్ల సగటు వేగంతో నడిచినట్లు రైల్వే శాఖ తెలిపింది. ట్రాకుల సామర్థ్యం తక్కువగా ఉండటంతో రైళ్ల వేగం తగ్గిందని చెప్పింది.

    . (ANI Photo)

    వందే భారత్‌ సెమీ హైస్పీడ్, ఎలక్ట్రిక్ మల్టీపుల్ రైలు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ వందే భారతీయ రైల్వే తయారు చేస్తోంది. మేక్ ఇన్‌ ఇండియా కింద ఈ రైళ్లను రూపొందిస్తున్నారు. మెుదటి రైలును రూ. 97 కోట్లతో 18 నెలలు శ్రమించి డిజైన్ చేశారు. ఈ అత్యాధునిక రైలును గతంలో ట్రైన్‌ 18 అని వ్యవహరించారు. 2019 జనవరి 27న వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ అని పేరు పెట్టారు. తొలి రైలు 2019 ఫిబ్రవరి 15న ప్రారంభించారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోందని రైల్వే శాఖ వెల్లడించింది. 

    (ANI Photo)

    తెలుగు రాష్ట్రాల మధ్య 

    ఈ ఏడాది జనవరిలో సికింద్రాబాద్‌- విశాఖపట్టణం మధ్య తొలి వందే భారత్ రైలు ప్రారంభమయ్యింది. ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు. కేవలం 8.30 గంటల్లోనే వైజాగ్ చేరుకుంటుంది. వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మీదుగా ఈ ట్రైన్ వెళ్తుంది. ప్రయాణికులు బాగా ఆదరిస్తుండటంతో సికింద్రాబాద్‌ – తిరుపతి మధ్య మరో రైలును ప్రవేశపెట్టారు. ఏప్రిల్ 8న స్వయంగా హైదరాబాద్‌ వచ్చిన ఆయన… ఈ రైలును ప్రారంభించారు. ప్రస్తుతం మరో వందే భారత్ రైలును కూడా ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ సమాయత్తమవుతుందని తెలుస్తోంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా మరొకటి తీసుకురానున్నారు. 

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version