ఈ ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఎవరు గొప్ప..?
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఈ ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఎవరు గొప్ప..?

    ఈ ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఎవరు గొప్ప..?

    November 16, 2021
    in IPL

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2008లో ప్రారంభమైన 2021 వరకు 14 సీజన్లు నిర్వహించి క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరిస్తుంది. టీ20 వరల్డ్ కప్‌కి ఏ మాత్రం తీసిపోకుండా ఎంతో అట్టహాసంగా జరిగే ఈ క్రీడా సంబరంలో ప్రపంచ నలుమూలల నుంచి మేటి ఆటగాళ్లు పాల్గొంటారనే విషయం అందరికీ విధితమే.

    1. అభిమానుల కేరింతలు మొదలయ్యేనా.. 

               ప్రతి సీజన్‌లో ప్రేక్షకుల కేరింతలతో స్టేడియాల్లో కోలాహలం మొదలయ్యేది. కాని కరోనా కారణంగా ఐపీఎల్ 14వ సీజన్ నిరాడంబరంగా జరిగింది. ప్రేక్షకులు లేక స్టేడియాలు వెలవెలబోయాయి. చీర్‌గాళ్స్ సందడి జాడలేకుండ పోయింది. బయోబబుల్స్.. క్వారంటైన్ అంటూ ఎన్నో నిబంధనలు పాటించినప్పటికీ ఆ మహమ్మారి ఆటగాళ్లను వదిలిపెట్టలేదు. దీంతో అర్థాంతరంగా ఆటను ఆపేశారు. కాని ఎలాగైనా సీజన్ పూర్తి చేయాలనే ఉద్దేశంతో బీసీసీఐ ఈ సీజన్‌ని యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19న పున:ప్రారంభిస్తుంది. అలాగే పరిమిత సంఖ్యలో ప్రేక్షకులను కూడ అనుమతిస్తుండటంతో ఐపీఎల్ గత వైభవాన్ని సంతరించుకుంటుందని అంతా భావిస్తున్నారు. చూడాలి అసలు మిగతా ఆట ఎలా సాగుతుందో.

    1. ఎవరు గొప్ప

    మొత్తం ఎనిమిది జట్లు ఈ సీజన్‌లో పోటాపోటీగా తలపడుతున్నాయి. కుర్రకారుతో నిండిపోయిన దిల్లీ క్యాపిటల్స్ జట్టు జోరు కొనసాగిస్తుంది. గత సీజన్‌లో చతికిలపడిన చెన్నై సూపర్ కింగ్స్ అనూహ్యంగా పుంజుకొని వరుస విజయాలతో దూసుకెళ్తుంది. ఒక్కసారైనా కప్పు కొట్టాలనే కసితో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తీవ్రంగా కసరత్తులు చేస్తుంది. అలాగే వరుసగా కప్పును ఎగురేసుకెళ్లాలనే ఉద్దేశంతో ముంబై ఇండియన్స్ తన జోరు కొనసాగిస్తుంది. కాని మిడిలార్దర్ బ్యాట్స్‌మెన్స్ ఫామ్ లేని కారణంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ అట్టడుగు స్థానంలో ఉంది.

     3. అసలు ఈ సీజన్‌లో ఐపీఎల్ అర్థాంతరంగా ఆగిపోయే వరకు ఎవరు ఏ స్థానాల్లో ఉన్నారో ఒక్కసారి పరిశీలిద్దాం. 

    దిల్లీ క్యాపిటల్స్(8 మ్యాచులు) 12 పాయింట్లతో అగ్రస్థానాన్ని అధిరోహించింది. చెన్నై సూపర్ కింగ్స్(7 మ్యాచులు) 10 పాయింట్లతో ద్వితీయ స్థానం, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(7 మ్యాచులు) 10 పాయింట్లు, ముంబై ఇండియన్స్(7 మ్యాచులు) 8 పాయింట్లతో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. రాజస్థాన్ రాయల్స్(7 మ్యాచులు) 6 పాయింట్లు, పంజాబ్ కింగ్స్(8 మ్యాచులు) 6 పాయింట్లు, కోల్‌కత్తా నైట్ రైడర్స్(7 మ్యాచులు) 4 పాయింట్లు) సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్(7 మ్యాచులు) కేవలం 2 పాయింట్లు మాత్రమే సాధించి చిట్టచివరి స్థానంలో ఉంది.

       4. ఇప్పటి వరకు వీళ్లదే హవా..!

     ఈ సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న శిఖర్ ధావన్ 380 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ కైవసం చేసుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి చెందిన హర్షల్ పటేల్ 17 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్‌తో కొనసాగుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌కి చెందిన జోస్ బట్లర్ 124 పరుగులు చేసి హయస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. 

    5. మీకు తెలుసా..?

    ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 380 సిక్సర్లు నమోదయ్యాయి. అన్ని జట్లు కలిపి 9,499 పరుగులు చేయగా బౌండరీల ద్వారానే 5520 పరుగులు సాధించారు. ఐపీఎల్ చరిత్రలో కెప్టెన్‌గా ఫస్ట్ మ్యాచులోనే సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రాజస్థాన్ రాయల్స్‌కి చెందిన సంజూ శాంసన్ నిలిచాడు. అలాగే ఈ సీజన్‌లో 48 హాఫ్ సెంచరీలు నమోదయ్యాయి. 343 వికెట్లు పడ్డాయి. 2433 డట్ బాల్స్‌ని బౌలర్లు వేశారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version