కొచ్చి ఎయిర్‌పోర్టు.. ప్ర‌పంచంలోనే మొద‌టి సోలార్ ఎయిర్‌పోర్ట్‌

Screengrab Twitter:

కొచ్చి ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు 100 శాతం పూర్తిగా సోలార్ ప‌వ‌ర్‌తోనే న‌డుస్తుంది. దీనికోసం ర‌న్‌వే ప‌క్క‌న వేల కొద్ది సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుచేశారు. ఈ మొత్తం ఏరియా 30 ఫుట్‌బాల్ గ్రౌండ్‌ల‌కు స‌మానంగా ఉంటుంది. ఎయిర్‌పోర్ట్ రూఫ్‌టాప్‌ల‌పై కూడా సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుచేశారు. ఇవి 10 వేల గృహాల‌కు స‌రిప‌డేంత విద్యుత్‌ను త‌యారుచేస్తున్నారు. ఇక్క‌డ అవ‌స‌ర‌మైన‌దానికంటే ఎక్కువ‌గా విద్యుత్ త‌యారీ అవుతుంది. దీంతో కేర‌ళ గ్రిడ్ సిస్ట‌మ్‌కు ప‌వర్ స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. కొచ్చిని చూసి కోల్‌క‌తా ఎయిర్‌పోర్టులో కూడా ఈ విధానాన్ని ఫాలో అవుతున్నారు. గ్రీన్ ఎన‌ర్జీ త‌యారీలో కొచ్చి ఎయిర్‌పోర్ట్ ప్ర‌పంచానికి స్పూర్తిగా నిలిచింది. వీడియో చూసేందుకు watch on twitter గుర్తుపై క్లిక్ చేయండి.

Exit mobile version