Xiaomi Mix Flip: షియోమీ కంపెనీ నుంచి తొలి క్లామ్‌షెల్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫొన్, అట్రాక్ట్ చేస్తున్న ఫీచర్లు
  • Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Xiaomi Mix Flip: షియోమీ కంపెనీ నుంచి తొలి క్లామ్‌షెల్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫొన్, అట్రాక్ట్ చేస్తున్న ఫీచర్లు

    Xiaomi Mix Flip: షియోమీ కంపెనీ నుంచి తొలి క్లామ్‌షెల్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫొన్, అట్రాక్ట్ చేస్తున్న ఫీచర్లు

    September 21, 2024

    షియోమీ కంపెనీ తన మొట్టమొదటి క్లామ్‌షెల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ Xiaomi Mix Flip ను త్వరలో ప్రపంచ మార్కెట్‌లో విడుదల చేయనుంది. ఈ విషయాన్ని షియోమీ వ్యవస్థాపకుడు, CEO అయిన లీ జున్ ఇటీవల ప్రకటించారు. ఈ ఫోన్ ఇప్పటికే జూలైలో Xiaomi Mix Fold 4 తో పాటు చైనా మార్కెట్‌లో విడుదలైంది. మరి కొద్ది రోజుల్లో ఈ ఫొన్ ఇండియా మార్కెట్‌లోకి రానుంది. ఈ క్రమంలో ఈ ఫొన్ ప్రత్యేకతలు ఓసారి చూద్దాం.

    Xiaomi Mix Flip స్పెసిఫికేషన్లు

    Xiaomi Mix Flip ఫోన్ సుమారు 4.01 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది అత్యాధునిక Snapdragon 8 Gen 3 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. అలాగే, ఈ ఫోన్ 67W వేగవంతమైన వైర్డ్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. 4780mAh బ్యాటరీతో ఇది మెరుగైన పనితీరును అందిస్తుంది.

    Xiaomi Mix Flip ఫోన్ ప్రధానంగా సామ్‌సంగ్ మరియు మోటరోలా కంపెనీల ఫ్లిప్-ఫోన్‌లకు పోటీగా నిలిచే అవకాశం ఉంది. ఈ ఫోన్ సెప్టెంబర్ లో గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేయబడుతుందని లీ జున్ తన X ఖాతా ద్వారా ప్రకటించారు. అయితే, ఖచ్చితమైన విడుదల తేదీ ఇంకా వెల్లడించలేదు. Xiaomi 14T సిరీస్ లాంచ్ ఈవెంట్‌లో ఈ వివరాలు వెలువడే అవకాశం ఉంది.

    ఈ Xiaomi Mix Flip గ్లోబల్ మార్కెట్లో Samsung Galaxy Z Flip 6 మరియు Motorola Razr 50 Ultra వంటి ఫ్లిప్-స్టైల్ స్మార్ట్‌ఫోన్‌లకు పోటీగా ఉంటుంది. యూరప్‌లో దీని ధర సుమారు BGN 2600 (భారత రూపాయల్లో సుమారు ₹1,20,800) గా ఉండవచ్చని అంచనా.

    చైనాలో Xiaomi Mix Flip 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ ధర CNY 5999 (సుమారు ₹69,000). 12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 6499 (సుమారు ₹74,800) కాగా, 16GB RAM + 1TB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 7299 (సుమారు ₹84,000) గా ఉంది.

    ఈ ఫోన్ Android 14 ఆధారంగా Xiaomi HyperOS తో రాబోతుంది. 6.86 అంగుళాల 1.5K AMOLED అంతర్గత డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఉంది. కవర్ డిస్‌ప్లే 4.01-అంగుళాల 1.5K AMOLED ప్యానెల్, 1392 x 1280 పిక్సెల్ రిజల్యూషన్ కలిగి ఉంది.

    ఇది గరిష్టంగా 16GB LPPDDR5X RAM మరియు 1TB వరకు UFS 4.0 స్టోరేజ్‌ను సపోర్ట్ చేస్తుంది. Snapdragon 8 Gen 3 చిప్‌సెట్ పై ఇది నడుస్తుంది. కెమెరా విషయానికి వస్తే, ఈ ఫోన్‌లో Leica ఆధారిత డ్యూయల్ రియర్ కెమెరా ఉంది, ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మరియు 50 మెగాపిక్సెల్ OmniVision OV60A40 సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ OV32B సెన్సార్‌ను కలిగి ఉంది.

    ఈ ఫోన్ 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 4780mAh బ్యాటరీ లాంగ్ లైఫ్ అందిస్తుంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv
    Exit mobile version